Nominations observation
-
బద్వేల్, హుజురాబాద్ ఉప ఎన్నికల నామినేషన్ల పరిశీలన పూర్తి
సాక్షి, వైఎస్సార్ కడప: బద్వేల్ ఉప ఎన్నికలో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ముగిసింది. 9 నామినేషన్లను అధికారులు తిరస్కరించగా.. బద్వేల్ బరిలో 18 మంది నిలిచారు. కాగా నామినేషన్ల ఉప సంహరణకు ఈనెల 13 వరకు గడువుంది. చదవండి: Huzurabad Bypoll: కోడికూర ఉండాల్సిందే..! మరోవైపు హుజురాబాద్ ఉప ఎన్నిక లో నామినేషన్ల పరిశీలన పూర్తయ్యింది. మొత్తం 61 నామినేషన్లు దాఖలవ్వగా.. 19 నామినేషన్లను అధికారులు తిరస్కరించారు దీంతో 42 మంది అభ్యర్థుల నామినేషన్లు ఒకే అయ్యాయి. ఈటల పేరుతో ఉన్న ముగ్గురు నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈనెల 13 వరకు గడువుంది. చదవండి: బద్వేల్ నియోజకవర్గ అభివృద్ధికి రూ.792 కోట్లు: పెద్దిరెడ్డి -
తొలివిడత నామినేషన్లు 296
వనపర్తి: తొలివిడత నామినేషన్ల ఘట్టం బుధవారం ముగిసింది. మూడురోజుల పాటు కొనసాగిన నామినేషన్ల స్వీకరణలో మొదటి, రెండోరోజు నామమాత్రంగానే దాఖలయ్యాయి. చివరిరోజు ఉదయం 11గంటల నుంచే నామినేషన్లు ఊపందుకున్నాయి. తొలివిడత నాలుగు మండలాల్లో రేవల్లి మినహా మిగతా మూడు మండలాలు వనపర్తి, ఖిల్లాఘనపురం, గోపాల్పేట మండలాల్లో ఎంపీటీసీ స్థానాలకు చివరి రోజు 60కి తగ్గకుండా నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు వెల్లడించారు. జెడ్పీటీసీ స్థానానికి రేవల్లి మండలంలో అత్యధికంగా తొమ్మిది మంది 14 నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్లకు బుధవారం చివరిరోజు కావటంతో ఆయా మండల కేంద్రాల్లోని నామినేషన్లు స్వీకరించే కేంద్రాల వద్దకురాజకీయ పార్టీల నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. నామినేషన్ల కౌంటర్‌కు వందమీటర్ల దూరం వరకు ఎవ్వరినీ అనుమతించలేదు. కేవలం అభ్యర్థితో పాటు ప్రపోజర్లు, సాక్షులు మొత్తం నలుగురిని మాత్రమే లోపలికి వెళ్లనిచ్చారు. నామినేషన్లు దాఖలు చేసేందుకు మండల పరిషత్ కార్యాలయానికి టీడీపీ కాంగ్రెస్ పార్టీల నాయకులు కలిసే ర్యాలీగా వచ్చారు. నేడు నామినేషన్ల పరిశీలన అధికారులు గురువారం తొలివిడత నామినేషన్ల పరిశీలన కార్యక్రమం చేపడతారు. ఉపసంహరణకు ఈనెల 28వ తేదీ వరకు అవకాశం ఉంటుంది. నామినేషన్లు సక్రమంగా పూరించకపోయినా, తప్పులు దొర్లినా, అధికారులు ఆ నామినేషన్లను తిరస్కరించే అవకాశం ఉంటుంది. ఎంపీటీసీ నామినేషన్లు ఇలా.. తొలివిడత నాలుగు మండలాల్లో నిర్వహిస్తున్న ప్రాదేశిక ఎన్నికల్లో భాగంగా 40 ఎంపీటీసీ స్థానాలకు 206 మంది అభ్యర్థులు మొత్తం 259 నామినేషన్లు దాఖలైనట్లు లైజన్ అధికారి నర్సింహులు తెలిపారు. వనపర్తి మండలంలో 11 ఎంపీటీసీ స్థానాలకు మొత్తం 76 నామినేషన్లు దాఖలు కాగా బీజేపీ పార్టీ నుంచి 9, కాంగ్రెస్ పార్టీ నుంచి 29, టీఆర్ఎస్ పార్టీ నుంచి 18, టీడీపీ నుంచి 4, ఇండిపెండెంట్ల నుంచి 16 దాఖలయ్యాయి. అలాగే ఖిల్లాఘనపురం మండలంలో మొత్తం 12 ఎంపీటీసీ స్థానాలకు మొత్తం 88 నామినేషన్లు దాఖలయ్యాయి. బీజేపీ నుంచి 9, కాంగ్రెస్ పార్టి నుంచి 22, టీఆర్ఎస్ నుంచి 34, టీడీపీ నుంచి 2, ఇండిపెండెంట్ల నుంచి 21 దాఖలయ్యాయి. గోపాల్పేట మండలంలో మొత్తం 11 ఎంపీటీసీ స్థానాలకు మొత్తం 60 నామినేషన్లు దాఖలయ్యాయి. బీజేపీ నుంచి 6, కాంగ్రెస్ నుంచి 20, టీఆర్ఎస్ నుంచి 17, టీడీపీ నుంచి 2, ఇండిపెండెంట్ల నుంచి 14, గుర్తింపు పొందిన ఇతర పార్టీల నుంచి 1 దాఖలయ్యాయి. రేవల్లి మండలంలో మొత్తం 6 ఎంపీటీసీ స్థానాలకు గాను మొత్తం 35 నామినేషన్లు దాఖలయ్యాయి. బీజేపీ నుంచి 02, కాంగ్రెస్ నుంచి 8, టీఆర్ఎస్ నుంచి 8, టీడీపీ నుంచి 1, ఇండిపెండెంట్ల నుంచి 14, గుర్తింపు పొందిన ఇతర పార్టీల నుంచి 2 దాఖలయ్యాయి. రెండో విడతకు రేపటి నుంచే నామినేషన్లు జిల్లాలో మలివిడత ప్రాదేశిక ఎన్నికలు నిర్వహించే పెద్దమందడి, కొత్తకోట, మదనాపురం, ఆత్మకూర్, అమరచింత మండలాల పరిధిలోని 5 జెడ్పీటీసీ స్థానాలకు, 43 ఎంపీటీసీ స్థానాలకు ఆయా మండ ల పరిషత్ కార్యాలయాల్లో ఈనెల 26వ తేదీనుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. మూడు రోజుల పాటు కొనసాగే ఈ కార్యక్రమం కోసం ఆయామండల పరిషత్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జెడ్పీటీసీ నామినేషన్లు ఇలా.. జిల్లాలో తొలివిడత ఎన్నికలు నిర్వహించే నాలుగు జెడ్పీటీసీ స్థానాలకు మొత్తం 37 నామినేషన్లు దాఖలయ్యాయి. వనపర్తి మండలంలో బీజేపీ నుంచి 0 1, కాంగ్రెస్ నుంచి 01, టీఆర్ఎస్ నుంచి 04, టీ డీపీ నుంచి 01, ఇండిపెండెంట్ల నుంచి 2 దాఖలయ్యాయి. ఖిల్లాఘనపురం మండలంలో బీజేపీ నుంచి 01, కాంగ్రెస్ నుంచి 03, టీఆర్ఎస్ నుంచి 03, టీడీపీ నుంచి నిల్, ఇండిపెండెంట్ల నుంచి 1 దాఖలయ్యాయి. గోపాల్పేట మండలంలో బీజేపీ నుంచి 01, కాంగ్రెస్ నుంచి 01, టీఆర్ఎస్ నుంచి 03, టీడీపీ నుంచి నిల్. రేవల్లి మండలంలో బీజేపీ నుంచి 01, కాంగ్రెస్ నుంచి 06, టీఆర్ఎస్ 05, టీడీపీ నుంచి 01, ఇండిపెండెంట్ల నుంచి 2 దాఖలయ్యాయి. -
65 నామినేషన్లుతిరస్కరణ
సాక్షి, రంగారెడ్డి జిల్లా: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో మరో అంకం ముగిసింది. గురువారం నాటితో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ పూర్తయింది. జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండు పార్లమెంటు నియోజకవర్గాలకు బుధవారం నాటికి నామినేషన్ల స్వీకరణ పూర్తయింది. 14 అసెంబ్లీ స్థానాలకు 421 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. గురువారం చేపట్టిన పరిశీలనలో 61 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించారు. దీంతో బరిలో 360 మంది అభ్యర్థులు నిలిచారు. రెండు పార్లమెంటు స్థానాలకు 52 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. పరిశీలన ప్రక్రియలో నలుగురి నామినేషన్లు తిరస్కరణకు గురికావడంతో చివరకు పోటీలో 48 మంది ఉన్నారు. ఎల్బీనగర్లో అధికంగా అసెంబ్లీ నియోజకవర్గ కేటగిరీలో ఎల్బీనగర్ సెగ్మెంట్ నుంచి అధికంగా 13 మంది అభ్యర్థుల నామినేషన్ల తిరస్కరణకు గురయ్యాయి. ఆ తర్వాత మల్కాజిగిరి సెగ్మెంట్ నుంచి 11 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించారు. రాజేంద్రనగర్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల నుంచి ఒక్కో అభ్యర్థి నామినేషన్ తిరస్కరించారు. అదేవిధంగా చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో నలుగురు అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. నామినేషన్లు దరఖాస్తు సమయంలో బలపర్చే అభ్యర్థుల సంఖ్య అవసరం మేరకు లేకపోవడం, పలు వివరాలు సమర్పించకపోవడంతోనే వాటిని తిరస్కరించినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే తిరస్కరణపై అప్పీలుకు వెళ్లే అవకాశం లేకపోవడంతో వారంతా పోటీ నుంచి దాదాపు నిష్ర్కమించినట్లే. ఇదిలాఉండగా నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ శనివారంతో పూర్తికానుంది. -
నామినేషన్ల పరిశీలన ఇలా..
మంచిర్యాల రూరల్, న్యూస్‌లైన్ : జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ(జెడ్పీటీసీ), మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ(ఎంపీటీసీ) ఎన్నికల ప్రక్రియలో భాగంగా తొలి ఘట్టం నామినేషన్ల పర్వం గురువారంతో ముగియనుంది. శుక్రవారం ఉదయం 11గంటల నుంచి ఎన్నికల అధికారులు ఆయా స్థానాలకు దాఖాలైన నామినేషన్లను నిర్దేశించిన ప్రదేశాల్లో పరిశీలించనున్నారు. అన్ని వివరాలు సరిగా ఉంటేనే అభ్యర్థి నామినేషన్‌ను ఆమోదిస్తారు. లేనిపక్షంలో తిరస్కరిస్తున్నట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటిస్తారు. ఈ నేపథ్యంలో నామినేషన్ల పరిశీలనపై అటు అభ్యర్థులతోపాటు ఇటు ఓటర్లలోనూ ఆసక్తి నెలకొంది. తిరస్కరణపై ఎన్నికల సంఘం రూపొందించిన విధివిధానాలు తెలుసుకుందాం. నామినేషన్ల పరిశీలనలో రిటర్నింగ్ అధికారికి అన్ని అధికారాలు ఉంటాయి. ఎన్నికల నియమావళి ప్రకారం వీలైనంత వరకు అభ్యర్థుల నామినేషన్లను ఆమోదించాలని ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అభ్యర్థుల సమక్షంలోనే నామినేషన్లను పరిశీలిస్తారు. నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థి, ప్రతిపాదించిన వ్యక్తి, ఏజెంట్, అభ్యర్థికి సమీప బంధువు లేనిపక్షంలో న్యాయసలహాదారుడు పరిశీలనలో పాల్గొనవచ్చు. నామినేషన్ ఫారమ్‌లో పొందుపరిచిన వివరాలు పరిశీలిస్తారు. తర్వాత అభ్యర్థితోపాటు అతన్ని ప్రతిపాదించిన వ్యక్తి పేర్లు, వారి సంతకాలు, ఓటరు జాబితాలో వారి పేర్లు అన్నీ సరిచూస్తారు. జాతీయ, రాష్ట్ర పార్టీల గుర్తులపై పోటీచేసే వ్యక్తి బీ -ఫామ్ సమర్పించారా లేదా అన్నది పరిశీలిస్తారు. (నామినేషన్ల ఉపసంహరణ వరకు కూడా బీ-ఫామ్ సమర్పించే వెసులుబాటు ఉంది). బీ-ఫామ్ సమర్పించని నేపథ్యంలో అభ్యర్థి ఎలాంటి నిర్ణయం(స్వతంత్ర అభ్యర్థిగానైనా) తీసుకుంటారనే వివరణ పత్రాన్ని కూడా పరిశీలిస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వ్ స్థానాల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా పొందిన కుల ధ్రువీకరణ పత్రాలను పరిశీలిస్తారు. అన్ని నిబంధనలకు లోబడి ఉంటానని ధ్రువీకరించే పత్రాన్ని పరిశీలిస్తారు. అభ్యర్థి ఆస్తులు, అప్పుల వివరాలు నమోదు చేసి ఉండాలి. తనపై ఎలాంటి కేసులు లేవని స్పష్టం చేయాలి. {పచారానికి అయ్యే ఖర్చులను సమర్పిస్తానని ధ్రువీకరణపత్రం అందజేయాలి. నామినేషన్ దాఖలు సమయంలో రిటర్నింగ్ అధికారి ఇచ్చిన డిపాజిట్ బిల్లును చూపించాలి. పైవన్నీ సరిగా ఉన్నట్లయితే అభ్యర్థి నామినేషన్‌ను ఆమోదిస్తున్నట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటన చేస్తారు. నామినేషన్ ఆమోదిస్తున్నట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించిన రెండు నిమిషాల వ్యవధిలో ప్రత్యర్థులు, ఇతర వ్యక్తులు అభ్యంతరాలు, ఆరోపణలు, ఆక్షేపణలు, అభియోగాలు చేసే సమయం ఉంటుంది. రెండు నిమిషాలు దాటిన తర్వాత ఆమోదించిన నామినేషన్‌పై ఎలాంటి అభ్యంతరాలు, ఆరోపణలు, ఆక్షేపణలు, అభియోగాలు వచ్చినా అనుమతించరు. అభ్యర్థిపై అభియోగాలు మోపే వారు రాతపూర్వకంగా రిటర్నింగ్ అధికారికి తెలియజేయాల్సి ఉంటుంది. ఆరోపణలకు తగిన ఆధారాలు సమర్పించాలి. అభియోగాలను పరిశీలించిన తర్వాతే నామినేషన్‌ను ఆమోదిస్తారు. ఇందుకు సంబంధించి అభ్యర్థులు, ప్రత్యర్థుల నుంచి రిటర్నింగ్ అధికారులు సంతకాలు తీసుకుంటారు.