
ఒంగోలు క్రైం: ఈ ఏడాది జిల్లా నేరమయంగా మిగిలింది. ఏవో కొన్ని మినహా అన్ని రకాల నేరాలు ఎక్కువ మందికి విషాదం మిగిల్చింది. 2017 సంవత్సరానికి సంబంధించి నేరాలను సింహావలోకనం చేసుకుంటే బాధితులకు కన్నీరే మిగిలిందని చెప్పక తప్పదు. 2016తో పోలిస్తే రోడ్డు ప్రమాద మరణాలు మినహా అన్నీ అధికంగానే జరిగాయని నిరూపితమైంది. మరీ ముఖ్యంగా హత్యలు కూడా పెరగడం ఆందోళన కలిగిస్తోంది.
రికవరీలో ఊరట
రికవరీ విషయంలో పోలీసుల పనితీరు మెరుగ్గానే ఉంది. ప్రజల సొత్తు రూ.5.17 కోట్లు అపహరణకాగా అందులో రూ.3.44 కోట్లు రికవరీ చేశారు. వీటితో పాటు జిల్లాలో సంచలనం రేపిన కేసుల విషయంలో పోలీసుల వేగంగా ఛేదించారు. వేమవరం జంట హత్యలు, ప్రతి చర్యగా చేపట్టిన దాడులు, పీసీపల్లి మండలంలో ఐదేళ్ల చిన్నారి అత్యాచారం, హత్య కేసు, ఒంగోలు దంపతుల హత్య కేసు, ఒంగోలులో రూ.3 కోట్ల దొంగతనం, కారులో రూ.2 కోట్ల బంగారు ఆభరణాలు, నగదు కేసు, ఏటీఎంల వద్ద మాటు వేసే అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు, కందుకూరు ప్రాంతంలో వృద్ధ మహిళల హత్యలతో పాటు మరి కొన్ని కేసులను త్వరితగతిన ఛేదించి జిల్లా ప్రజలకు పోలీసులు కొంత ఊరట కలిగించారు.
రోడ్డు ప్రమాద మృతులు
ఈ ఏడాది 466 ప్రమాదాల్లో 518 మంది
గతేడాది 507 ప్రమాదాల్లో 569 మంది
క్షతగాత్రుల సంఖ్య
ఈ ఏడాది 903 రోడ్డు ప్రమాదాల్లో 1857
గతేడాది 870 రోడ్డు ప్రమాదాల్లో 1,944
తీవ్రమైన దొంగతనాలు
ఈ ఏడాది 62
గతేడాది 97
Comments
Please login to add a commentAdd a comment