బలవంతుడు బలహీనున్ని బెదిరించడం ఆనవాయితీ.. బట్ జస్ట్‌ఫర్ చేంజ్ ఇప్పుడు బలహీనుడు బలవంతుడిని భయపెడతాడు. ఇది ఓ సినిమాలోని డైలాగ్. భిన్న జాతుల మధ్య వైరం ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది. పాము-ముంగిస, పిల్లి-ఎలుక, కుక్క-పిల్లి, కుక్క-కోడి ఇలా వీటి మధ్య ఇప్పుడు శతృత్వం ఉంటూనే ఉంటుంది. అలాంటిదే ఈ వీడియోలో ఓ కుక్క ఓ కోడి పుంజును పట్టుకోవాలని ప్రయత్నిస్తుంది. అది పసిగట్టిన పుంజు, కుక్కపైకి కాలు దువ్వింది. కోడి పందేళ్లో కాళ్లకు కత్తి కట్టినట్లు రెచ్చిపోయింది. కుక్కపై ఎదరుదాడికి దిగింది. అంతే కుక్కుకు బుద్ది వచ్చింది. బ్రతికి ఉంటే బలిసాకు తిని బతకొచ్చని పారిపోయింది. అయినా వదలకుండా కోడిరాజు, భైరవుడుని వెంబండిచింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో మీకోసం
Comments
Please login to add a commentAdd a comment