cock
-
సింహపురి ‘కోడల్లుళ్లు’ వచ్చేశారోచ్!
సంక్రాంతి పందేల్లో కాలు దువ్వేందుకు సింహపురి నుంచి కోడి పుంజులొచ్చేశాయి. నెల్లూరు ప్రాంతంలో పెంచిన కాకి, నెమలి, డేగ, పచ్చకాకి, కేతువ తదితర జాతుల పుంజులు పందేలరాయుళ్లను ఆకర్షిస్తున్నాయి. రకాన్ని బట్టి ఒక్కొక్క పుంజు రూ.3 వేల నుంచి రూ.6 వేల వరకు విక్రయిస్తున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన వ్యాపారులు రావులపాలెం–ఏలూరు హైవే, రద్దీ రోడ్ల వెంబడి వీటిని విక్రయిస్తున్నారు. – సాక్షి, భీమవరం భీమవరం బ్రీడ్నే అక్కడ పెంచి..సంక్రాంతి కోడి పందేలకు ఉమ్మడి గోదావరి జిల్లాలు పెట్టింది పేరు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, వెంప, సీసలి, దుంపగడప, తూర్పు గోదావరి జిల్లాలోని మురమళ్ల, కాట్రేనికోన, వేట్లపాలెం కోడిపందేలకు పేరొందాయి. పెద్ద బరుల్లో రోజుకు 25 నుంచి 30 వరకు పందేలు జరిగితే.. గ్రామాల్లోని చిన్న బరుల్లో జరిగే పందేలకు లెక్కే ఉండదు. సంక్రాంతి మూడు రోజులు వేలాదిగా జరిగే పందేలకు రెట్టింపు కోడిపుంజులు అవసరమవుతాయి. పందేలకు వినియోగించే ‘భీమవరం బ్రీడ్’ పుంజులకు గిరాకీ అంతాఇంతా కాదు. సంక్రాంతి పందేల కోసం ఉండి, ఆకివీడు, చెరుకుమిల్లి, చినఅమిరం, కాళ్ల, కోనసీమలోని అమలాపురం, లంక, మండపేట, రామచంద్రపురం, పెద్దాపురం తదితర ప్రాంతాల్లో భీమవరం బ్రీడ్ కోడిపుంజుల పెంపకం ద్వారా గోదావరి జిల్లాల్లో వందలాది మంది ఉపాధి పొందుతున్నారు. భీమవరం బ్రీడ్ పుంజులకు ఉన్న గిరాకీని దృష్టిలో పెట్టుకుని నెల్లూరీయులు వీటిని అక్కడ పెంచుతున్నారు. అనంతరం వాటిని గోదావరి జిల్లాలకు తెచ్చి విక్రయిస్తున్నారు.నెల ముందే వ్యాపారుల రాకవారం రోజుల్లో సంక్రాంతి నెల పట్టనుండగా.. నెల్లూరు జిల్లాకు చెందిన నాటుకోళ్ల పెంపకందారులు, వ్యాపారులు అప్పుడే గోదావరి జిల్లాల్లో అమ్మకాలు చేసేందుకు కోడి పుంజులతో తరలివస్తున్నారు. ఒక్కొక్కరు 15 నుంచి 20 పుంజులను తెస్తున్నారు. నలుగురైదుగురు గుంపుగా వచ్చి రావులపాలెం–ఏలూరు హైవే వెంబడి, రద్దీ రోడ్లు పక్కన ఖాళీ ప్రదేశాల్లో పుంజుల్ని ఉంచి అమ్మకాలు చేస్తున్నారు. పందెం కోళ్లలోని దాదాపు అన్ని రకాల జాతులు వీరి వద్ద అందుబాటులో ఉంటున్నాయి. సాధారణంగా పందేల కోసం గోదావరి జిల్లాల్లో సిద్ధం చేసే పుంజులు చాలా ధర ఉంటాయి. పందెం పుంజులను కొత్త అల్లుళ్ల మాదిరిగా పెంచుతుంటారు. వాటికి మూడు నెలల ముందునుంచే మటన్ కీమా, డ్రైఫ్రూట్స్ వంటి బలవర్ధకమైన ఆహారాన్ని అందిస్తుంటారు. శరీర పటుత్వాన్ని పెంచేందుకు వాకింగ్, ఈత కొట్టించడం, నీళ్లపోతలు, శాఖాలు తదితర రూపాల్లో ప్రత్యేకంగా ట్రైనర్లతో శిక్షణ ఇస్తుంటారు. వాటికందించే ఆహారం, శిక్షణను బట్టి ఒక్కొక్క పుంజు ధర రూ.25 వేల నుంచి రూ.లక్ష కూడా దాటిపోతోంది. చూసేందుకు స్థానిక పుంజులకు ఏమాత్రం తీసిపోని విధంగా సైజులు, రంగుల్లో నెల్లూరు పుంజులు ఉంటున్నాయి. పుంజు రంగు, ఎత్తు, బరువును బట్టి రూ.3 వేల నుంచి రూ.6 వేలలోపే ధరలు ఉండటంతో వీటి కొనుగోలుకు పందెంరాయుళ్లు ఆసక్తి చూపుతున్నారు. వాటి కాళ్ల సామర్థ్యం, ప్రత్యర్థిపై దాడిచేసే వేగాన్ని పరీక్షించేందుకు అక్కడే డింకీ పందేలు కట్టి బాగున్న వాటిని బేరమాడి తీసుకుంటున్నారు. నెలరోజుల పాటు వాటికి తగిన మేతను అందించి శిక్షణ ఇవ్వడం ద్వారా పందేలకు సన్నద్ధం చేసే వీలుంటుందంటున్నారు.ఇక్కడే గిరాకీ బాగుంటుంది సంక్రాంతి సందర్భంగా గోదావరి జిల్లాల్లో కోడిపుంజులకు గిరాకీ బాగుంటుంది. నెల్లూరు జిల్లా నుంచి చాలామంది పెంపకందారులు, వ్యాపారులు ఇక్కడకు కోడిపుంజులు తెచ్చి విక్రయిస్తుంటారు. నేను సొంతంగా పెంచిన వాటితో పాటు అక్కడ కొనుగోలు చేసిన పుంజులను తీసుకువచ్చాను. – వెంకటేష్, నెల్లూరు ముందుగానే వచ్చాం నాలుగేళ్లుగా ఏటా సంక్రాంతి ముందు కోడి పుంజులను తీసుకువస్తున్నాం. గతంలో రెండు వారాల ముందు వచ్చేవాళ్లం. మరింత ముందుగా వస్తే పందేలరాయుళ్లు మా వద్ద కొనుగోలు చేసిన పుంజులను పెంచుకునేందుకు బాగుంటుందని కొందరు చెప్పడంతో ఈ ఏడాది నెల రోజులు ముందే వచ్చా. అమ్మకాలు బాగుంటే రూ.10 వేల వరకు మిగులుతాయి. – సంగయ్య, నెల్లూరు -
పందెం కోడికి ఆర్టీసీ వేలం
సాక్షిప్రతినిధి, కరీంనగర్: సంక్రాంతి వేళ..కరీంనగర్లో ఓ పందెం కోడి వార్త సందడి చేస్తోంది. ఆసక్తి ఉన్నవారు ఈ కోడిని వేలంపాటలో దక్కించుకోవచ్చంటూ ఆర్టీసీ డిపో–2 మేనేజర్ మల్లయ్య గురువారం ఒక ప్రకటన చేయడమే ఇందుకు కారణం. ఇంతకీ ఈ కోడి కథాకమామీషు ఏంటో ఓసారి చూద్దాం! అసలేం జరిగిందంటే...? ఈనెల 9వ తేదీన కరీంనగర్ ఆర్టీసీ డిపో–2కు చెందిన ఎక్స్‌ప్రెస్ బస్సు వరంగల్ నుంచి వేములవాడకు వెళ్లింది. అక్కడి నుంచి తిరిగి కరీంనగర్ డిపోకి చేరుకుంది. బస్సు దిగి ఇంటికి వెళదామని బస్సు డ్రైవర్, కండక్టర్ సిద్ధమవుతుండగా, ఇంతలో కోడి కూత వినబడటంతో ఇద్దరూ అవాక్కయ్యారు. సీటు కింద దాన్ని సంచిలో జాగ్రత్తగా కట్టేసిన తీరు చూసి, ఎవరో ప్రయాణికుడు మర్చిపోయాడని గుర్తించారు. కోడి యజమాని వస్తాడని కొద్దిసేపు చూశారు. కానీ, ఎవరూ రాకపోవడంతో ఏం చేయాలో తోచక కంట్రోలర్‌కు ఆ కోడిని అప్పగించారు. మూడురోజులుగా ఆ కోడిని ఓ ఇనుప బోనులో రక్షణ కల్పిస్తున్నారు. దానికి దాణా, నీళ్లు ఇస్తూ అతిథిలాగే మర్యాదలు చేస్తున్నారు. కోడి యజమానికి తెలియజేసే క్రమంలో మీడియాలోనూ ప్రకటన విడుదల చేశారు. అయినా కోడి ఆచూకీ కోసం ఎవరూ రాలేదు. దీంతో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు కరీంనగర్ డిపో–2 ఆవరణలో బహిరంగ వేలం వేసేందుకు నిర్ణయించారు. ఆసక్తి ఉన్న వారు వేలం పాటలో పాల్గొనవచ్చునని డిపో మేనేజర్ మల్లయ్య పేర్కొన్నారు. ఇంతకీ సర్కారు వారి పాట ఎంత ఉంటుందో..? ఆ కోడి యజమాని వస్తాడా? రాడా..? ఇంతకీ వేలం పాటలో దేవుని పాట ఎంతకు మొదలవుతుంది? అన్న విషయంపై చర్చ సాగుతోంది. -
కుక్కను హడలెత్తించిన కోడి.. ఎగిరి ఎగిరి దాడి..
-
Viral Video: కోడి vs కుక్క " బిగ్ ఫైట్ "
-
కోడిపుంజుకు టికెట్.. స్పందించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్
ఆర్టీసీ బస్సులో కోడిపుంజుకు టికెట్.. అదీ ఫుల్ టికెట్ కొట్టిన ఘటన సోషల్ మీడియా ద్వారా వార్తల్లోకి ఎక్కిన విషయం తెలిసిందే. దీనిపై ఇంటర్నెట్లో సెటైర్లు పేలుతున్నాయి. అలా విషయం తన దాకా రావడంతో టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సీరియస్ అయ్యారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కరీంనగర్‌కు వెళ్తోంది. దారిలో రామగుండం బి పవర్‌హౌస్ వద్ద మహ్మద్ అలీ అనే ప్రయాణికుడు బస్సెక్కాడు. కూడా ఓ కోడిని సంచితో దాచిపెట్టుకుని వెళ్తున్నాడు. బస్సు సుల్తానాబాద్‌కు చేరుకోగానే బస్సు కుదుపులకు పుంజు ఒక్కసారిగా అరిచింది. గమనించిన కండక్టర్ తిరుపతి కోడిపుంజుకు కూడా రూ. 30 టికెట్ తీసుకోవాలని గద్దించాడు. దీంతో చేసేది లేక అలీ టికెట్ తీసుకున్నాడు. ఈ విషయం టికెట్ ద్వారా సామాజిక మాధ్యమాలకు ఎక్కింది. ఇది చూసిన నెటిజన్లు ఆర్టీసీపై దుమ్మెత్తి పోశారు. ఏం జరిగిందంటే.. ఈ ఘటనలో ఏం జరిగిందో టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. బస్సుల్లో పశుపక్ష్యాదులకు అనుమతి లేదు. సుల్తాన్‌బాద్ దగ్గర కోడిపుంజును గుర్తించాక కండక్టర్ ఆ ప్రయాణికుడ్ని ప్రశ్నించాడు. అయితే అదే బస్సులో ఉన్న శ్రీ కుమార్ అనే ఓ న్యూస్ రిపోర్టర్.. కండక్టర్‌ను టికెట్ కొట్టమని వుసిగొల్పాడట. హాట్ న్యూస్ కోసం ఆ రిపోర్టర్ అలా ప్రోత్సహించగా.. కండక్టర్ ఆ ప్రభావంతో కోడిపుంజుకు టికెట్ కొట్టాడు. కండక్టర్ ఆ రిపోర్టర్ చెప్పినట్లు.. అలా ప్రవర్తించాల్సింది కాదు. కండక్టర్ మీద చర్యలు తీసుకుంటాం అని ఆయన ఓ పోస్ట్ చేశారు. ఇదిలా ఉండగా.. ఘటనపై స్పందించిన డిపో మేనేజర్ వెంకటేశం చర్యలకు ఆదేశించినట్లు ప్రకటించగా.. ట్విటర్లో టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సైతం ఈ ఘటనపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. pic.twitter.com/kVdLhLzy86 — V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) February 9, 2022 సంబంధిత వార్త: పదేళ్లు కూడా బతకని కోడికి ఫుల్ టికెట్?? -
వీరు క్యాన్సర్‌ను జయించారు
World Cancer Day 2022: క్యాన్సర్‌ను జయించాలంటే మూడు కావాలి. మొదటిది ఆత్మవిశ్వాసం. రెండు కుటుంబం, స్నేహితుల సపోర్ట్. మూడు వైద్యం. వైద్యం ఎలాగూ మేలు చేస్తుంది. కాని కూడగట్టుకోవాల్సింది మొదటి రెంటినే. బాలీవుడ్లో నటీమణులు చాలామంది క్యాన్సర్‌ను ఎదుర్కొన్నారు. గెలిచారు. గ్లామర్ ఫీల్డ్ అయినా దాచకుండా తమ పోరాటాన్ని తెలియచేశారు. వైద్యం చాలా ఆధునికం అయ్యింది. భయం లేదు. గెలుపు ఉంది. క్యాన్సర్‌పై పోరాడాలి. గెలవాలి. ‘మనం అస్సలు ఊహించని విషయాలతో జీవితం మన మీద ఒక మలుపును విసురుతుంది’ అని నటి సోనాలి బెంద్రె 2018లో ట్విటర్లో రాసింది. అప్పటికే ఆమెకు ‘హైగ్రేడ్ క్యాన్సర్’ బయటపడింది. ‘ఏదో కొంత నొప్పి, ఇబ్బంది ఉండేసరికి పరీక్షలు చేయించుకున్నాను. క్యాన్సర్ బయటపడింది. వెంటనే నా కుటుంబం, మిత్రులు బిలబిలమంటూ నా పక్కన చేరారు నాకు సపోర్ట్ ఇవ్వడానికి. డాక్టర్లు వెంటనే వైద్యం మొదలెడదామన్నారు. న్యూయార్క్‌లో నాకు చికిత్స మొదలైంది. నేను ఇప్పుడు క్యాన్సర్‌ను ఎదుర్కొంటున్నాను’ అని రాసిందామె. క్యాన్సర్‌కు ఇవాళ ఆధునిక జీవితానికి పట్టిన మహా భూతంలా మారింది. ఒకప్పుడు దానికి ఎటువంటి వైద్య విధానాలు లేవని వైద్యం చెప్పేది. ఇప్పుడు ఎటువంటి మొండి క్యాన్సర్‌ను అయినా ఎదుర్కొనే ఆధునిక పద్దతులు వచ్చాయి. క్యాన్సర్ బారిన పడినవారు ఆ ఆధునిక పద్ధతులు వాడుకునేందుకు వీలుగా ధైర్యంగా ఉండటమే కావాల్సింది. కుంగిపోకపోతే అదే సగం బలం. బలమే పోరాటం. ఆరోగ్యం. రెండేళ్లు క్యాన్సర్‌కు వైద్యం తీసుకున్నాక సోనాలి బెంద్రే స్వస్థత పొందింది. ఇప్పుడు సాధారణ జీవితం గడుపుతోంది. హైగ్రేడ్ క్యాన్సర్‌ను ఆమె జయించగా లేనిది మిగిలిన వారు కూడా ఎందుకు జయించలేరు? ఆమెలాగే అందరూ మామూలు మనుషులే. ఆమె వృత్తిరీత్యా నటి మాత్రమే. తేడా ఏమిటంటే ఆమె పోరాడాలని నిశ్చయించుకుంది. 2021 ఏప్రిల్‌లో నటి కిరణ్ ఖేర్ బ్లడ్ క్యాన్సర్ బారిన పడింది. కాని ఆమె భయపడలేదు. క్యాన్సర్‌ను ఎదుర్కొనడానికి ట్రీట్మెంట్కు సహకరించాలనుకుంది. భర్త అనుపమ్ ఖేర్ ‘ఆమెకు ఏమీ కాదు. ఆమె ఆరోగ్యం పొందుతుంది’ అని ధైర్యం చెప్పాడు. ముంబైలో కిరణ్ ఖేర్‌కు వైద్యం జరిగింది. ఇంకా కొనసాగుతూనే ఉంది. అయినప్పటికీ ఆమె తాను పాల్గొంటున్న ఒక టీవీ షోలో జడ్జ్‌గా తిరిగి వచ్చి కూచుని క్యాన్సర్ దారి క్యాన్సర్‌దే మన పని మన పనే అన్నట్టుగా స్ఫూర్తినిస్తోంది. మరో సీనియర్ నటి నఫీసా అలీ కూడా చర్మ సంబంధ క్యాన్సర్ బారిన పడ్డారు. అయినప్పటికీ ఆమె కుంగిపోక పోరాడింది. కీమో థెరపీ తీసుకుని ఆమె క్యాన్సర్‌ను జయించింది. కీమో థెరపీ చేయించుకుంటూ నవ్వుతూ ఉన్న ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో పెట్టింది. అలాగే శిరోజాలను ముండనం చేసుకున్న ఫొటో కూడా. ఇవన్నీ క్యాన్సర్‌ను అన్ని జబ్బుల్లాగే చూడటానికి స్ఫూర్తినిస్తున్నాయి. ఇక మనిషా కోయిరాలా 2012లో ఒవేరియన్ క్యాన్సర్ బారిన పడటం పెద్ద సంచలనం అయ్యింది. అభిమానులు తీవ్ర నిరాశలో పడ్డారు. ఆమె కూడా ఇది తనకు అశనిపాతంగా భావించింది. అయినప్పటికీ క్యాన్సర్ మీద పోరాడి గెలవాలని నిశ్చయించుకుందామె. న్యూయార్క్‌లో ఉండి వైద్యం తీసుకుంది. సుదీర్ఘకాలం వైద్యం కొనసాగినా బెదరక, చెదరక క్యాన్సర్‌ను జయించింది. తిరిగి సినిమాల్లో నటిస్తూ ఉంది కూడా. వీరి కంటే ముందు కెరీర్ పీక్‌లో ఉండగా మోడల్ లీసారే క్యాన్సర్ బారిన పడింది. శిరోజ ముండనంతో ఆమె ఫొటోలు చూసి అభిమానులు తల్లడిల్లారు. కాని ఆమె క్యాన్సర్‌తో బహిరంగంగా పోరాడింది. తన పోరాటాన్ని ఎప్పటికప్పుడు లోకంతో పంచుకుంది. అంతే కాదు ఆ పోరాట సారాన్ని ‘క్లోజ్ టు ది బోన్: ఏ మెమొయిర్’ పేరుతో పుస్తకంగా రాసింది. ఒకప్పటి స్టార్ నటి, ‘ఆప్ కీ కసమ్’, ‘ఆయినా’ సినిమాల హీరోయిన్ ముంతాజ్ తన 54వ ఏట 2000 సంవత్సరంలో బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడింది. ‘చావు కూడా నన్ను సులువుగా ఓడించలేదు. క్యాన్సర్ ఎంత’ అనే స్ఫూర్తితో పోరాడి గెలిచింది. ఇప్పుడు ఆమె వయసు 74. హాయిగా ఉంది. అలాగే మన తెలుగు నటి హంసా నందిని కూడా ఇప్పుడు క్యాన్సర్‌పై గట్టి పోరాటం చేస్తూ ఉంది. క్యాన్సర్‌పై పోరాడండి. గెలవండి. పోరాడితే పోయేదేమి లేదు క్యాన్సర్ తప్ప. -
కోడిపుంజు గుడ్డు పెట్టింది!
సంగారెడ్డి, కల్హేర్ (నారాయణఖేడ్): కోడిపెట్ట గుడ్డు పెట్టడం అందరికీ తెలిసిందే.. కానీ సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలం ఫత్తేపూర్‌లో గురువారం వింత సంఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మల్లుగొండ తన ఇంట్లో పెంచుతున్న నాటు కోడిపుంజును ఎప్పటిలాగే బుధవారం రాత్రి గంప కింద ఉంచాడు. గురువారం ఉదయం లేచి చూసే సరికి గుడ్డుపెట్టి కనిపించింది. విషయం కాస్తా ఆనోటా..ఈనోటా.. తెలియడంతో ఈ వింతను చూసేందుకు గ్రామస్తులు పెద్ద ఎత్తున మల్లుగొండ ఇంటికి చేరుకున్నారు. అటు సామాజిక మాధ్యమాల్లోనూ ఇది చర్చనీయాంశమైంది. జన్యులోపంతో ఇలా జరిగి ఉండవచ్చని మండల పశువైద్యాధికారి సయ్యద్ ముస్తాక్ తెలిపారు. -
కుక్కపైకి కాలు దువ్విన పుంజు
-
పంతం నీదా, నాదా.. సై..!
బలవంతుడు బలహీనున్ని బెదిరించడం ఆనవాయితీ.. బట్ జస్ట్‌ఫర్ చేంజ్ ఇప్పుడు బలహీనుడు బలవంతుడిని భయపెడతాడు. ఇది ఓ సినిమాలోని డైలాగ్. భిన్న జాతుల మధ్య వైరం ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది. పాము-ముంగిస, పిల్లి-ఎలుక, కుక్క-పిల్లి, కుక్క-కోడి ఇలా వీటి మధ్య ఇప్పుడు శతృత్వం ఉంటూనే ఉంటుంది. అలాంటిదే ఈ వీడియోలో ఓ కుక్క ఓ కోడి పుంజును పట్టుకోవాలని ప్రయత్నిస్తుంది. అది పసిగట్టిన పుంజు, కుక్కపైకి కాలు దువ్వింది. కోడి పందేళ్లో కాళ్లకు కత్తి కట్టినట్లు రెచ్చిపోయింది. కుక్కపై ఎదరుదాడికి దిగింది. అంతే కుక్కుకు బుద్ది వచ్చింది. బ్రతికి ఉంటే బలిసాకు తిని బతకొచ్చని పారిపోయింది. అయినా వదలకుండా కోడిరాజు, భైరవుడుని వెంబండిచింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో మీకోసం -
పందెంకోడి ఆన్లైన్
సాక్షి, అమరావతి: నెట్టింట్లో పందెం కోడి కూత పెడుతోంది. సంక్రాంతికి నెల రోజుల ముందుగానే పుంజుల సందడి మొదలైంది. ఒకప్పుడు పల్లెలకే పరిమితమైన పుంజుల విక్రయం ఇప్పుడు ఆన్లైన్ స్థాయికి ఎదిగింది. పలు వెబ్‌పోర్టల్స్‌లో జాతి కోడి పుంజుల పేరుతో జోరుగా విక్రయాలు సాగుతున్నాయి. ఉభయ గోదావరితోపాటు కృష్ణా, గుంటూరు జిల్లాలలో సంక్రాంతి సందర్భంగా పెద్ద ఎత్తున కోడి పందాలు జరుగుతుంటాయి. 60 ఏళ్ల క్రితం గోదావరి జిల్లాల్లో మొదలైన ఎడ్ల పందేలు క్రమంగా కోళ్ల డింకీ పందేల(కత్తుల కట్టకుండా) వైపు మళ్లాయి. 25 ఏళ్ల నుంచి పుంజులకు కత్తులు కట్టి బరిలోకి దించి డబ్బులు పందాలు వేసే పద్ధతి మొదలైంది. షామియానాలు వేసి ప్లడ్‌లైట్ల కాంతిలో కోడిపందాలు జాతరను తలపిస్తాయి. పహిల్వాన్లను తలపించే పుంజులు... పందాల కోసం కోడి పుంజులను ప్రత్యేక శిక్షణతో పెంచడం దాదాపు 15 ఏళ్ల నుంచి ప్రారంభమైంది. ఉదయాన్నే ఈత, వేడి నీటి స్నానం, అల్పాహారంగా కోడిగుడ్డు, వేటమాంసం, బాదం, పిస్తా, చోళ్లు, గంట్లు మేత. ఆరోగ్యం కోసం విటమిన్ టాబ్లెట్లు, పశుసంవర్థక శాఖ డాక్టర్లతో వారానికో పర్యాయం వైద్య పరీక్షలు.. ఇలా వీటి సంరక్షణ కోసం తీసుకుంటున్న చర్యలు చాలానే ఉన్నాయి. తరలివస్తున్న ప్రముఖులు మూడు రోజుల కత్తుల సమరం కోసం కోడి పుంజులను ఏడాదిపాటు పహిల్వాన్ల తరహాలో అపురూపంగా సాకుతారు. బరిలో పందెం కోడి కాలుదువ్వి గెలిస్తే దాని ఆసామి విజయగర్వంతో మీసం మెలేస్తాడు. సంక్రాంతికి గోదావరి జిల్లాల్లో జరిగే కోడి పందేలను తిలకించేందుకు పొరుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో రాజకీయ, సినీ ప్రముఖులు తరలివస్తుంటారు. గతేడాది క్యాష్‌లెష్.. ఈసారి ఆన్లైన్.. గతేడాది కోడి పందేలపై కోట్లాది రూపాయల బెట్టింగ్‌లకు పెద్ద నోట్ల రద్దు ఇబ్బందికరంగా మారడంతో క్యాష్‌లెష్ పందాలు జరిగాయి. నేరుగా నగదు మార్చకుండా ఆన్లైన్లో నగదు బదిలీ, కాగితాల్లో పందాల మొత్తాలు రాసుకుని బ్యాంక్‌ల ద్వారా లావాదేవీలు సాగాయి. ఈసారి ఆన్లైన్లో కోడి పుంజుల అమ్మకాలు ఊపందుకున్నాయి. ఓఎల్ఎక్స్, క్విక్కర్, జెడ్ఎజెడ్స్పాట్ డాట్‌కామ్, పిఒఎస్ఒటిడాట్క్లాస్ తదితర వెబ్సైట్లలో పుంజుల ఫొటోలతో సహా అమ్మకాలకు పెట్టడం విశేషం. ఒక్కో పుంజు ధర కనీసం రూ.3,500 నుంచి రూ.50 వేల వరకు ఉంది. పుంజు పెంపకం, జాతి, రంగు, ఎత్తు, బరువును ప్రస్తావిస్తూ ఆన్లైన్ వెబ్సైట్లలో అమ్మకాలు జరుగుతున్నాయి. రెండు తరాలుగా అమ్మకాలే జీవనాధారం.. సంక్రాంతి సీజన్ కోసం ఏడాదిపాటు కష్టపడి కోడి పుంజులను పెంచుతాం. రెండు తరాలుగా కోడి పుంజుల అమ్మకాలపైనే ఆధారపడి జీవిస్తున్నాం. మా నాన్న నుంచి మా అన్నదమ్ముల వరకు అంతా కోడి పుంజులను పెంచి అమ్ముకుంటున్నాం. ఈసారి పుంజులు కొనేవారి సంఖ్య తగ్గింది. – తోట నర్సింహారావు, మచిలీపట్నం(కృష్ణా జిల్లా) పందేలను చూసేందుకు రెండు కళ్లూ చాలవు మా ప్రాంతంలో జాతరలా జరిగే కోడి పందాలు చూసేందుకు రెండు కళ్లు చాలవు. కొందరు ముందుగానే పందెం కోళ్లు పెంచుతారు. మరికొందరు కొనుక్కుని పందాలు వేస్తుంటారు. ఇప్పుడు ఆన్లైన్ ద్వారా కూడా కొంటున్నారు. – పుచ్చకాయల అబ్బులు, పెదగరువు(పశ్చిమగోదావరి) -
కుక్కను మించిన విశ్వాసం..
అర్వపల్లి: సాదారణంగా ఇళ్ళు, వ్యవసాయ బావుల వద్ద కాపలా కోసం కుక్కలను పెంచుకుంటాం. కానీ, కుక్కలకు మించి కాపలాగా ఉంటుంది ఆకోడిపుంజు. మండలంలోని కొమ్మాల గ్రామంలో సర్పంచ్ కుంట్ల సురేందర్‌రెడ్డి తన వ్యవసాయ బావి వద్ద ఓ కోడిపుంజును పెంచుతున్నారు. ఇందులో పెద్ద విషయమేముంది అనుకుంటున్నారా... ఈ కోడిపుంజు ఆరున్నర కిలోల బరువు ఉంటుంది. అయితే ఇది మామూలు కోడి పుంజు కాదు. కుక్క కన్న విశ్వాసం గలది ఈ కోడిపుంజు ఆ బావి వద్దకు కొత్త వ్యక్తులు వస్తెచాలు వెంటబడి పొడుస్తుంది. తన యజమాని కుటుంబ సభ్యులను తప్ప మరెవ్వరిని అక్కడకు రానివ్వదు. ఎవరైనా కొత్త వారు వస్తున్నారంటే కుటుంబ సభ్యులు కోడిపుంజుని అటు వైపు పోనివ్వరు. దూరంగా తీసుకెళుతారు. లేదంటే పశువల దొడ్లోకి తోలుతారు. ఎంతైనా ఆ కోడిపుంజు విశ్వాసం గలది కదూ. -
పందెం రాయుళ్లకు ఎమ్మెల్యేల అండ !
-
పందేలదే పైచేయి
పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కోడి పందేలు కోర్టు ఉత్తర్వులు బేఖాతర్ గాలిలోకి కాల్పులు జరిపి ప్రారంభించిన వైనం చేతులు మారుతున్న రూ.కోట్లు 144 సెక్షన్ ప్రకటించిన కలెక్టర్ సాక్షి ప్రతినిధి, ఏలూరు : భోగి రోజున పందెం రాయుళ్లు రెచ్చిపోయారు. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కోడిపందేలు యథేచ్ఛగా జరిగాయి. అధికార పార్టీ నేతలే ముందుండి నడిపించడంతో గురువారం రాత్రివరకూ హడావుడి చేసిన పోలీసులు శుక్రవారం పూర్తిగా చేతులెత్తేశారు. దీంతో జిల్లా వ్యాప్తంగా కోడిపందేలు జరిగాయి. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం కోడి పందాల్లో తెలంగాణ పరిధిలోని ఖమ్మం, ఏపీ పరిధిలోని పశ్చిమ గోదావరి జిల్లాల పందేల రాయుళ్ల మధ్య భారీ పందేలు జరిగాయి. ఇక్కడ ఖమ్మం జిల్లా జూబ్లీపుర గ్రామానికి చెందిన గంగవరపు లక్ష్మీదయాకర్ అనే వ్యక్తి పందేల ప్రారంభం సందర్భంగా తన లైసెన్స్ రివాల్వర్‌తో గాల్లోకి మూడు రౌండ్ల కాల్పులు జరిపాడు. ఈ విషయం తెలిసిన కొన్నిగంటల తరువాత అక్కడకు చేరుకున్న పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ఏటా మాదిరిగానే ముందువరకూ ఉత్కంఠ నెలకొన్నా సంక్రాంతి సంబరాల్లో తొలిరోజైన భోగినాడు జిల్లావ్యాప్తంగా పందెం కోళ్లకు రెక్కలు తెగాయి. హైకోర్టు ఉత్తర్వులు, దానిపై సుప్రీంకోర్టు స్పందనతో చివరి రోజు వరకూ పందేలను అడ్డుకున్నా భోగి రోజున చేతులెత్తేశారు. ఉదయం 11 గంటల తర్వాత ప్రభుత్వం నుంచి అనధికారిక ఉత్తర్వులు రావడంతో పోలీసులు తప్పుకున్నారు. నిడమర్రు మండలం పత్తేపురంలో, భీమడోలు మండలం గుండుగొలను బరుల్లో పందేలను ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు ప్రారంభించారు. టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఈ పందాల్లో పాల్గొన్నారు. పెదవేగి మండలం కొప్పాకలో ప్రభుత్వ విప్ చింతమనేని ఆధ్వర్యంలో కోడిపందేలు నిర్వహించారు. జంగారెడ్డిగూడెం మండలంలోని శ్రీనివాసపురం, లక్కవరం గ్రామాల్లో భారీగా పందాలు నిర్వహించారు. తెలంగాణ నుంచి కోడి పందేల రాయుళ్లు భారీగా తరలి వచ్చారు. రూ.లక్షల్లో పందాలు జరిగాయి. పందేల ముసుగులో కోతాట, గుండాట, మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా సాగాయి. పోలీసులు కనీసం కన్నెత్తి కూడ చూడలేదు. ఆచంట మండలం వల్లూరులో కోడి పందేల బరిని వేలం పాట నిర్వహించగా గ్రామానికి చెందిన ఒక వ్యక్తి రూ.2 లక్షలకు పాడుకున్నట్టు సమాచారం. అకివీడు మండలం ఐ.భీమవరంలో హైడ్రామా నడిచింది. గ్రామంలోని ప్రధాన బరిగా ఉన్న ఎఫ్‌సీఐ గోడౌన్ల ప్రాంతంలో కోడి పందేలు వేయరాదంటూ పోలీస్, రెవెన్యూ యంత్రాంగం తిష్ట వేశాయి. పందెంరాయుళ్లు గొడవకు దిగినా తహసీల్దార్ ఒప్పుకోలేదు. పోలేరమ్మ గుడివద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డింకీ పందాలను ఎమ్మెల్యేతో ప్రారంభించేందుకు నిర్వాహకులు నిర్ణయించి ఎమ్మెల్యే కలవపూడి శివను ఆహ్వానించారు. ఎమ్మెల్యే చెప్పడంతో మధ్యాహ్నం నుంచి ప్రధాన బరిలో కూడా కోడిపందేలు జరిగాయి. భీమవరం మండలం వెంప, తోకతిప్ప గ్రామాల్లో భారీ పందాలు వేస్తుండగా దిరుసుమర్రు, ఈలంపూడి, వీరవాసరం మండలంలోని కొణితివాడ, నవుడూరు, ఉత్తరపాలెం, అండలూరు, వీరవాసరం, నందమూరుగరువు తదితర గ్రామాల్లో పందేలు నిర్వహిస్తున్నారు. వీరవాసరం మండలం కొణితివాడ చుట్టుపక్కల గ్రామాల ఏడు చిన్నచిన్న గ్రామాల్లోని సంఘ పెద్దలు ఉత్తరపాలెంలో నిర్వహించే కోడి పందాలకు పోటీగా మరొక బరిని సిద్ధం చేయడంలో అక్కడి మహిళలు అడ్డుకున్నారు. తొలిరోజు పందాలకు ప్రముఖులు ఎవరూ హాజరు కాకపోయినప్పటికీ మండలస్థాయిలోని టీడీపీ నాయకులు నిర్వహణ బాధ్యతలు తీసుకుని జోరుగా నిర్వహించారు. -
’పుంజు’కుంటున్నాయ్
కోడి పందేలకు చెక్ పెడతారా.. సలాం చేస్తారా! హైకోర్టు ఆదేశాలు అమలు చేస్తామంటున్న యంత్రాంగం సుప్రీం నుంచి స్టే ఉత్తర్వుల కోసం జిల్లా నేతల యత్నాలు సాక్షి ప్రతినిధి, ఏలూరు : సంప్రదాయం ముసుగులో కోడి పందేలు నిర్వహించేందుకు పందెం రాయుళ్లు సకల ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. కోడి పందేలు వేయకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలంటూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే తీసుకు వచ్చేందుకు కొందరు నేతలు సుప్రీం కోర్టును ఇప్పటికే ఆశ్రయించారు. ఎట్టిపరిస్థితుల్లో పందేలు జరగనిచ్చేది లేదని అధికారులు చెబుతున్నా.. పందేల రాయుళ్లు మాత్రం వీటిని తాటాకు చప్పుళ్లుగానే భావిస్తూ తమ పని తాము చేసుకుపోతున్నారు. తమిళనాడులో జల్లికట్టుకు అనుమతి లేకపోయినా అక్కడ ఆ పోటీలు నిర్వహిస్తున్న విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. కోర్టు ఆదేశాల పేరుతో సంప్రదాయాలను అడ్డుకోవడం సరికాదని వాదిస్తున్నారు. ఇదే అంశాన్ని ప్రాతిపదికగా చేసుకుని సుప్రీం కోర్టులో పిటీషన్ వేశారు. మరో రెండు రోజుల్లో దీనిపై ఆదేశాలు వచ్చే అవకాశం ఉంది. సుప్రీం కోర్టు నుంచి స్టే వస్తుందన్న ఆశతో పందేల నిర్వాహకులు పక్కా ఏర్పాట్లు చేస్తున్నారు. తోటల మాటున.. పందేల బరుల నిమిత్తం కొబ్బరి, మామిడి, జీడిమామిడి, ఆయిల్‌పామ్ తోటలను శుభ్రం చేస్తున్నారు. జనం రాకపోకలు సాగించేందుకు వీలుగా దారులు వేస్తున్నారు. పెద్దఎత్తున వచ్చే వాహనాల కోసం పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. బరుల కోసం ఎంపిక చేసిన ప్రాంతాలను చదును చేసి నీటితో తడపటం.. రోలర్లతో తొక్కించడం వంటి పనులను ముమ్మరం చేశారు. సమాచారం ఉన్నా.. బైండోవర్ చేసినా.. జిల్లాలో కోడిపందేలు వేయించే వారు ఎవరు, ఎక్కడ వేస్తారు.. కోళ్లు ఎక్కడ పెంచుతున్నారు.. వాటికి శిక్షణ ఎక్కడ ఇస్తున్నారు.. కోడి పుంజుల కాళ్లకు కత్తులు ఎవరు కడతారనే పూర్తి సమాచారం పోలీసుల వద్ద ఉంది. అయితే, ప్రజాప్రతినిధులకు అడుగులకు మడుగులొత్తుతున్న అధికారులు పందేలు వేయకుండా వారిని ఎంతమేరకు నిలువరిస్తారు, ఎవరిపై బైండోవర్ కేసులు పెడతారన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే బైండోవర్లు చేయడం మొదలైనా.. కీలక సూత్రధారులు, పాత్రధారుల వైపు పోలీసులు తొంగి చూడటం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఒక ప్రజాప్రతినిధి తన ఇలాకాలో గత వారమే కోడిపందేలు ట్రైల్ వేసినట్టు సమాచారం. గత ఏడాది, అంతకు ముందు ఏడాది కూడా కోడి పందేలను అడ్డుకుంటామని చెప్పినా చివరకు ఎమ్మెల్యేల ఒత్తిడి, ప్రభుత్వం నుంచి అందిన అనధికార ఆదేశాలతో సంక్రాంతి రోజుల్లో పందేలపై ఆంక్షలు ఎత్తివేశారు. దాంతో పండగ వేళ పందేల మాటున రూ.వందల కోట్లు చేతులు మారాయి. హైకోర్టు ఆదేశాలను కచ్చితంగా అమలు చేస్తామని ఎస్పీ భాస్కర్‌భూషణ్ చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో పోలీసు సిబ్బంది సహకారం ఎలా ఉంటుంది, అదేశాలను అమలు చేస్తారా అన్నది వచ్చే వారంలో తేలిపోనుంది. ఇదిలావుంటే.. హైకోర్టు ఆదేశాలను అమలు చేసేందుకు జిల్లా యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. మండల స్థాయిలో ఏర్పాటు చేసే జాయింట్ యాక్షన్ కమిటీల్లో పని చేసే స్వచ్ఛంద సేవా సంస్థలు, జంతు పరిరక్షణ సమితుల ప్రతినిధుల ఎంపిక ప్రక్రియ చేపట్టారు. ఈ బృందాలు 7వ తేదీ నుంచి 24 వరకూ పనిచేస్తాయని అధికారులు ప్రకటించారు. చివరకు ఏమవుతుందనేది.. చివరి వరకు వేచి చూడాల్సిందే. -
అందమే ఆనందం
సాక్షి, సిటీబ్యూరో: కాసింత సౌందర్య పోషణ ఉంటే కొండంత ఆత్మవిశ్వాసంతో అందంగా మెరిసిపోవచ్చునని చెబుతూ నిర్వహించిన అందాల అతివల ర్యాంప్‌వాక్ ఆకట్టుకుంది. కొంపల్లిలో బుధవారం అనూస్ సెలూన్ అండ్ క్లినిక్ 17వ శాఖ ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన ‘షో’లో మోడల్స్ మెరిశారు. సినీ తార(నేను శైలజ ఫేం) ధన్యా బాలకృష్ణ సెలూన్‌ను ప్రారంభించారు. నిర్వాహకులు ప్రదీప్‌రావు, సీహెచ్ అనూరాధ, అన్నపూర్ణ, సుష్మ, అనుపమ తదితరులు పాల్గొన్నారు. -
క్షణం.. ఆలోచిస్తే..
భవిష్యత్తు బంగారమే.. •క్షణికావేశమే అనర్థాలకు మూలం •ప్రతి సమస్యకూ పరిష్కారం ఉంటుంది •ఆత్మన్యూనతే పెద్ద ఉపద్రవం ఆత్మవిశ్వాసం గెలుపునకు రాచబాట •నేడు ఆత్మహత్యల నివారణ దినోత్సవం జీవితంలో వెనక్కి తీసుకోలేనివి రెండే.. ఒకటి కాలం.. మరొకటి ప్రాణం. తొందరపాటు జీవితాన్ని చిదిమేస్తుంది. మనపై ప్రేమను పెంచుకున్న కుటుంబ సభ్యులకు తీరని విషాదాన్ని మిగిలిస్తుంది. కన్ను తెరిస్తే జననం.. కన్ను మూస్తే మరణం.. రెప్పపాటే కదా జీవితం అంటాడు ఓ కవి. జీవిత ప్రయాణాన్ని ముగించే మరణం సహజంగా ఉంటేనే ఆ జీవితానికి సార్థకత. అయితే, జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లను ఎదుర్కోలేక, చిన్న చిన్న సమస్యలను సైతం భూతద్దంలో చూస్తూ భయపడిపోయి ఆత్మహత్యలకు పాల్పడేవారు ప్రస్తుత పరిస్థితులో అధికమవుతున్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మారలేకపోవడం, జీవితంలో పెరిగిపోతున్న యాంత్రికత, తీవ్రమైన మానసిక ఒత్తిడి, న్యూనతా భావం ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నాయని మానసిక విశ్లేషకులు అభిప్రాయం. క్షణికావేశానికి గురైన వ్యక్తుల ఆలోచనలను కొద్ది సేపు మళ్లించగలిగితే మళ్లీ ఎప్పుడూ అలాంటి ప్రయత్నం చేయబోరని చెబుతున్నారు. ఇలాంటి మానసిక బలహీనుల కోసం పలు స్వచ్ఛంద సంస్థలు కౌన్సెలింగ్ నిర్వహిస్తూ వారిని మంచి మార్గంలోకి మళ్లించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. క్షణికావేశంలో యువత ఆత్మహత్యలకు పాల్పడుతూ బంగారు జీవితాన్ని చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. అమ్మతిట్టిందనో..నాన్న కొట్టాడనో...ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవద్దన్నారనో.. అడిగిన డబ్బులు ఇవ్వలేదనో...తరగతిలో టీచర్ అవమానించారనో చిన్న చిన్న వాటికి యువత క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. క్రిమిసంహారక మందులు వేసుకోవడం, ఎవరూ లేని సమయంలో ఇంట్లోనే ఉరి వేసుకోవడం, చెరువులల్లో దూకి చనిపోవడం వంటివి చేసుకుంటున్నారు. మనకు తల్లిదండ్రులు ఎందుకు ఈ జన్మను ఇచ్చారన్న విషయాన్ని మరచిపోయి అప్పటికప్పడు నిర్ణయాలు తీసుకొని, వారిపై ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులకు పుట్టెడు శోకాన్ని మిగులుస్తున్నారు. ఉన్నత చదువులు చదువుతున్న యువత కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం బాధకరం. సమాజంలో నలుగురిని చైతన్య వంతులుగా చేసే తెలివి ఉన్న వారు కూడా అప్పటికప్పుడు తప్పుడు నిర్ణయాలు తీసుకొని ప్రాణాలమీదుకు తెచ్చుకుంటున్నారు. రైతుల ఆత్మహత్యలు పంటల కోసం పెట్టిన పెట్టుబడులు చేతికిరాక, వాతావణం అనుకూలించక చేసిన కష్టం కూడా దక్కేటట్లు లేదని ప్రతి రోజు రైతులు ఎక్కడో ఒక చోట ఆత్మహత్యలు చేసుకుంటునే ఉన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల కారణంగా కూడా రైతులు ఆత్మస్థైర్యం కోల్పోయి బలవన్నరణాలకు దిగుతున్నారు. ముఖ్యంగా జిల్లాలో కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. పెరుగుతున్న ధరలు, పెస్టిసైడ్స్, ఎరువులు , విత్తనాలు ఆమాంతం పెరగడం.. కష్టించి తీరా పంట వస్తే గిట్టు బాటు ధర లభించడంలేదు. వ్యవసాయానికి బ్యాంకుల్లోను సొసైటీల్లోను, అప్పులు తీసుకొన్నా.. తిరిగి చెలించలేక కుటుంబాన్ని పోషించుకోలేక అనుదినం మానసిక సంఘర్షణలకు గురై బలవన్మరణాలకు పాల్పడుతున్న ఘటనలు తెలిసిందే.. రెండేళ్ల కాలంలో వేలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. డిప్రెషన్‌కు లోనైన వారే ఎక్కువ ‘ఆత్మహత్యలు చేసుకునేవారిలో చాలా మంది డిప్రెషన్‌కు లోనైన వారే. సున్నిత మనస్కులు, హిస్టీరికల్ మనస్థత్వం ఉన్న వారు ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. జీవితంపై సానుకూల ధోరణిలో ఒక్క క్షణం ఆలోచించినా ఆత్మహత్యను నివారించడం సులభం. సమస్యలను, బాధలను సన్నిహితంగా ఉండే బంధువులు, స్నేహితులతో పంచుకోవడం ద్వారా పరిష్కారం లభించే అవకాశం ఉంది. ఆత్మహత్య భావన మదిలో కదలినపుడు ఒకసారి అలా బయటకు వెళ్లి ఏకాంతంగా గడపడం, శ్వాసపై ధ్యాస ఉంచి ఓ పది నిమిషాలు నెమ్మదిగా ఉండడం ఉపయోగపడుతుంది. బంధువులు, కుటుంబ సభ్యులు సైతం బలహీన మనస్థత్వమున్న వారిని ఒంటరిగా వదలడం మంచిది కాదు.జీవితం పట్ల అనురక్తిని పెంచేలా మాట్లాడడం ఉదాహరణలుగా ఇవ్వడం ద్వారా ఆత్మహత్యలే కాదు ఎటువంటి సమస్యలనైనా పరిష్కరించవచ్చు. మనల్ని నమ్ముకున్న వారికి కడుపు కోత పెట్టడం ఎంతటి పాపమో ఆలోచిస్తే తప్పకుండా మనసు మారుతుంది. - ప్రముఖ వైద్యుల, డాక్టర్ నాగరాజు -
తూర్పుగోదావరి జిల్లాలో కోడి పందాల జోరు
-
కోడిపందేలకు తాము సైతం అంటున్న మహిళలు!!
-
పెద్దాపురంలో జోరుగా కోడిపందేలు
-
పందెం పుంజుల ‘ఢీ’
చేతులు మారిన 200 కోట్లు సాక్షి, విజయవాడ బ్యూరో: సంక్రాంతి పురస్కరించుకుని భోగి రోజైన బుధవారం రాష్ట్రవ్యాప్తంగా కోడి పందేలు జోరుగా సాగాయి. ముఖ్యంగా ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో జరిగిన పందేల్లో భాగంగా రూ.200 కోట్ల మేర సొమ్ము చేతులు మారినట్లు అంచనా. న్యాయస్థానాల ఆదేశాలు ఎలా ఉన్నా.. పలుచోట్ల అధికార తెలుగుదేశం పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు స్వయంగా బరిలోకి దిగి కోడి పందేలను ప్రారంభించడం గమనార్హం. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా పెద్దయెత్తున పందెంరాయుళ్లు తరలివచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా వెంప, భీమవరం ఆశ్రమం తోట, ఐ భీమవరం, మహదేవపట్నం, పూలపల్లి, తదితర బరుల్లో పందేలు జోరుగా జరిగాయి. కొన్నిచోట్ల పోలీసుల మోహరింపు కారణంగా కత్తులు కట్టకుండానే పందేలు నిర్వహించారు.కోడి పందేల నిర్వహణకు అనుమతించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించిన బీజేపీ నేత కె. రఘురామకృష్ణంరాజు భీమవరం మండలం వెంపలో కోడి పందేలను ప్రారంభించారు.ఏలూరు ఎంపీ మాగంటి బాబు బరిలోకి దిగి పందేలకు సై అన్నారు. తెలంగాణ నేతలు ప్రకాష్‌గౌడ్, శ్రీశైలంగౌడ్‌లు పందేలను వీక్షించారు. ఉండి నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకటశివరామరాజు స్వయంగా బరిలోకి దిగి పందేలు వేశారు. దెందులూరు నియోజకవర్గం కొప్పాకలో ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్, ఉంగుటూరు నియోజకవర్గం గుండుగొలనులో ఎమ్మెల్యే గన్ని ఆంజనేయులు పందేలు ప్రారంభించారు. కొవ్వూరు టౌన్లో ఎమ్మెల్యే కె.జవహర్ ప్రారంభించారు. హోంమంత్రి చినరాజప్ప ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దాపురం నియోజకవర్గంలోని వేట్లపాలెంలో పందేలు నిర్వహించారు. పిఠాపురం పట్టణం వైఎస్సార్ గార్డెన్స్‌లో నిర్వాహకులు టెంట్ల చుట్టూ తెలుగుదేశం జెండాలు కట్టి, ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ యూత్ పేరుతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ముమ్మిడివరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే బుచ్చిబాబు, కృష్ణా జిల్లా నున్నలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ ప్రారంభించారు. మచిలీ పట్నంలో జరిగిన పందేల్లో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. విజయవాడ గాయత్రీనగర్‌లో ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే బొండా ఉమ కోడి పందాలను ప్రారంభించారు. పెనమలూరులో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పందేలను నిర్వహింపజేశారు. గన్నవరం మండలం చిక్కవరంలో ఎస్టీ నాయకుడు బూక్యా కపూర్ నాయక్ కారు అనుమానాస్పద పరిస్థితుల్లో దగ్ధమైంది. -
గతమంతా శాస్త్రీయతే!
ద్వారకానగరాన్ని, శల్యుడికి, కృష్ణుడికి మధ్య జరిగిన యుద్ధాన్ని... మహాభారతం అభివర్ణిస్తుంది. అంతేకాదు, ఆకాశంలో ఎగిరే యంత్రాల నుంచి ఆయుధాలు, క్షిపణుల ప్రయోగం గురించి కూడా ప్రస్తావిస్తుంది. వాటివర్ణన అణ్వాయుధాలను, ఎగిరే పళ్లాలను పోలి ఉంటుంది. ఇటీవలి కాలం వరకు ఆధునిక చరిత్రకారులు ద్వారకను పుక్కిటి పురాణంగా కొట్టిపారేశారు. రామసేతు, మహాభారతం, సరస్వతీ నది... వంటి వాటిని కూడా పుక్కిటి పురాణాలుగా ముద్రవేశారు. గుజరాత్లో ద్వారకానగరం, పెద్దకోటలు, భారీ పునాదులు తవ్వకాలలో బయటపడ్డాయి. ‘వీటిని మానవమాత్రులు నిర్మించలేరు’ అంటూ అధికారులు పేర్కొనడాన్ని బట్టి ఆ నగరాన్ని... దేవతలలో ఒకరైన విశ్వకర్మ నిర్మించాడన్న వాదన నిజమేనని సూచిస్తోంది. అలాగే అవాస్తవికమైనదిగా భావించిన సరస్వతీ నది ఉనికి నిజమేనంటూ ‘నాసా’ ధృవీకరించడం... మన పురాణాలలో వర్ణించినట్టుగానే అనేకానేక ప్రదేశాల ఉనికి నిజమేనని రుజువయింది. ఈ ఆవిష్కరణలలో పాశ్చాత్య మేధావులైన శాస్త్రవేత్తలు, చరిత్రకారులు పాలు పంచుకుంటున్నారు. దేవుళ్లు, గంధర్వులు, యక్ష రాక్షసులు తదితరులంతా వివిధ డైమన్షన్స్ నుంచి వచ్చినవారేనని వైదికగ్రంథాలు పేర్కొంటున్నాయి. మానవజాతి మరొక డైమన్షన్ నుంచి వచ్చిందని, దేవుళ్లు దానిని పర్యవేక్షించారని ఆధునిక శాస్త్రవేత్తలు అంగీకరిస్తున్నారు. అయితే ఈ వాస్తవాన్ని మెజారిటీ ప్రజల మనస్సుల నుంచి తుడిచివేయడం ఆసక్తికరమైన విషయం. ఆధునిక మానవుడు దేవుడే లేడని విశ్వసిస్తున్నాడు. తాను జీవించవలసిన పర్యావరణాన్ని, ప్రకృతిని స్వార్థం కోసం విధ్వంసం చేస్తూ ఈ భూమిపైన ఉన్న వనరులను దోచుకుంటున్నాడు. ఈ యుగంలో మానవుడు స్వార్థం, నిరీశ్వర వాదంతో తనతో సహా అన్నింటినీ విధ్వంసం చేస్తాడని పెద్దలు ఏనాడో స్పష్టంగా హెచ్చరించారు. ఈ వాస్తవాన్ని చూడగలిగినవారు, మానవ జాతిని కాపాడగలిగినవారు కొందరే వున్నారు. మహాభారతంలోని వనపర్వంలో మార్కండేయ మహర్షి కలియుగంలో జరగబోయే ఘట్టాలను స్పష్టంగా అభివర్ణించారు. వేదాలు మానవులకు ప్రవర్తనా నియమావళినే కాదు, దేవుళ్లతో సంభాషించేందుకు మార్గాలను (హవనాలు, మంత్రాలు) సూచించాయి. మనం ఈ డైమన్షన్‌లో పరిపూర్ణంగా జీవించామని భావించినప్పుడు తిరిగి మన ఇంటికి మనం వెళ్లేందుకు మార్గాన్ని కూడా వేదాలు సూచించాయి. వైదిక గురువుల మాటలలోని ప్రామాణికతను, విశ్వసనీయతను ఆధునిక శాస్త్రం నెమ్మదిగా ఆవిష్కరిస్తున్న నేపథ్యంలో, వేల ఏళ్ల కిందటే గ్రంథస్థం చేసిన శాస్త్రీయ వాస్తవాలను కనుగొని, వేదాలు చెప్పింది వాస్తవమే తప్ప పుక్కిటిపురాణం కాదనే అభిప్రాయానికి వస్తున్నారు. ఏది ఏమైనా... మహాప్రళయానికి కారణ భూతమైన విషయం మాత్రం, ఆధునిక మానవుడికి శాశ్వతంగా అంతుచిక్కని ప్రశ్నగానే మిగులుతుంది.