లాక్‌డౌన్ కారణంగా షూటింగ్స్ లేకపోవడంతో ఇంటికే పరిమితమయ్యారు నిహారిక కొణిదెల. ఈ మెగా వారసురాలు సోషల్ మీడియాలో చాలా ఆక్టీవ్‌గా ఉంటూ అభిమానులను ఎప్పటికప్పుడు అలరిస్తూ ఉంటారు. తాజాగా డ్యాన్స్ కొరియోగ్రాఫర్ యశ్‌తో కలిసి డ్యాన్స్ చేసిన వీడియోను అభిమానులతో పంచుకున్నారు నిహారిక. అంతర్జాతీయ నృత్య దినోత్సవం సందర్భంగా యశ్‌తో కలిసి కాలు కదిపారు. ‘చెలి’ చిత్రంలోని మనోహర పాటకు సంబంధించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యాజిక్‌తో ఈ వీడియోను రూపొందించారు. రొమాంటిక్‌గా సాగే ఈ పాటకు నిహారిక, యశ్‌లు చేసిన డ్యాన్స్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
‘ముద్దపప్పు ఆవకాయ’ వెబ్‌సిరీస్‌తో నటిగా తెరంగేట్రం చేస్తూ కెమెరా ముందుకు తొలిసారి వచ్చారు నిహారిక. అనంతరం అదే ఏడాది ‘ఒక మనసు’ చిత్రంతో హీరోయిన్‌గా మరో ముందుడుగు వేశారు. ఆ తర్వాత ‘హ్యాపీ వెడ్డింగ్’, ‘సూర్యకాంతం’ చిత్రాల్లో నటించినప్పటికీ అనుకున్నంత సక్సెస్ అందుకోలేకపోయారు. కాగా గతేడాది విడుదలైన మెగాస్టార్ చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో అథితి పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు. రెబల్‌స్టార్ ప్రభాస్‌ను నిహారిక పెళ్లి చేసుకోబోతోందనే వార్తలను తాజాగా ఆమె ఖండించిన విషయం తెలిసిందే.
చదవండి:
రొమాంటిక్ సినిమాల్లో నటిస్తా: నిహారిక
అక్కా మీరు నిజంగానే సిగరెట్ తాగారా?
నిహారిక, యశ్‌ల డ్యాన్స్ చూశారా?
Published Fri, May 1 2020 4:29 PM | Last Updated on Sat, May 2 2020 10:29 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment