
రామ్‌గోపాల్ వర్మ (ఫైల్ ఫొటో)
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌పై వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తనదైన శైలిలో ప్రశంసల జల్లు కురిపించారు. ‘సినీ హీరోయిన్ల కన్నా కేసీఆరే అందంగా ఉంటారని నేను ఎప్పుడు నమ్మేవాడిని, కానీ తాజా ఫలితాలు చూస్తే కేసీఆర్ సినీ హీరోల కన్నా అందగాడని, హిమాలయాలకన్నా ఆకర్షనీయుడనిపిస్తోందనని ట్వీట్ చేశారు.
I always maintained that KCR was more beautiful than all heroines but now I think he’s more handsome than all heroes and more attractive than all the Himalayas.
— Ram Gopal Varma (@RGVzoomin) December 12, 2018
గుజరాత్‌లో ప్రధాని నరేంద్ర మోదీ విగ్రహం పెడితే మాత్రం తెలంగాణలో దానికి రెండు రెట్లు కేసీఆర్ విగ్రహం పెట్టాలని మరో ట్వీట్‌లో పేర్కొన్నారు. అలాగే ఒక స్పూఫ్ వీడియోను కేటీఆర్‌కు ట్యాగ్ చేస్తూ.. ‘ హే కేటీఆర్ మీ డాడీ.. 2.0 కాదు.. రజనీకాంత్ కన్నా 20 రెట్లు.. మహేశ్ బాబు కన్నా 200 రెట్లు.. చంద్రబాబు నాయుడు కన్నా 2వేల రెట్లు ఎక్కువ.’ అని ట్వీట్ చేశారు. దీనికి కేటీఆర్ స్పందిస్తూ.. ఈ విషయం నాకప్పుడే తెలుసని బదులిచ్చారు.
If Modi put the tallest statue in Gujarat, Telangana should put 2.0 times higher statue of KCR
— Ram Gopal Varma (@RGVzoomin) December 12, 2018
Hey @KTRTRS ,ur father KCR is not 2.0 but he is 20.0 times @rajinikanth 200.0 times @urstrulyMahesh and 2000.0 times bigger than @ncbn pic.twitter.com/D7YWWLDhlz
— Ram Gopal Varma (@RGVzoomin) December 11, 2018
తెలంగాణ ఎన్నికల్లో 88 సీట్లతో అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న టీఆర్‌ఎస్, ఆ పార్టీ అధినేతపై సాధారణ ప్రజలు, రాజకీయా,సినీ, క్రీడా ప్రముఖులు ట్విటర్ వేదికగా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. స్టార్ హీరో మహేశ్ బాబు, మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్, డీఎంకే అధినేత స్టాలిన్, తదితరులు కేసీఆర్‌ను ప్రశంసిస్తూ అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేయగా.. మంత్రి కేటీఆర్ వాటన్నిటికి స్పందింస్తూ ధన్యవాదాలు తెలిపారు. (చదవండి: బండ్ల గణేశా.. ఎక్కడా?)
Comments
Please login to add a commentAdd a comment