కోడిని కోసిన తర్వాత అది ప్రాణాలతో కొద్దీసేపు గిలగిల కొట్టుకోవడం సాధారణమే. కానీ ముక్కలు ముక్కల చేసి.. వండడానికి సిద్దమై.. ఇక వంట గిన్నెలో వేద్దాం అనుకున్నప్పుడు.. అందులోనుంచి ఓ ముక్క గిలగిల కొట్టుకుంటూ పైకి ఎగిరి కిందపడితే ఎలా ఉంటుంది? హర్రర్ థ్రిల్లర్ సినిమాలో సీన్‌లా ఉంటుంది. కానీ ఇది సినిమాలో జరిగింది కాదు. నిజంగా జరిగిందే. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట హల్‌చల్ చేస్తూ.. నెటిజన్లను షాక్‌కు గురిచేస్తోంది. నిజమా? కల్పితమా? అనే సందిగ్ధంలో పడేస్తూ.. నోరెళ్లబెట్టేలా చేస్తోంది. రెండు వారాల క్రితమే ఫ్లోరిడాకు చెందిన రీ ఫిలిప్స్ తన ఫేస్‌బుక్‌లో ఈ వీడియోను రీపోస్ట్ చేయగా.. అది క్రేజీగా వైరల్ అయ్యింది.
వీడియోలో ఏముందంటే.. ఓ రెస్టారెంట్‌లో టేబుల్‌పై వండడానికి సిద్ధంగా ఉన్న కొన్ని ఆహార పదార్థాలతో పాటు ఓ ప్లేట్‌లో చికెన్ ముక్కలున్నాయి. అయితే ప్లేట్‌లోని ఓ చికెన్ ముక్క కదులుతూ.. గిలగిల కొట్టుకుంటూ పేకి లేచి టేబుల్‌పై నుంచి కిందపడింది. దీంతో అక్కడున్నవారు తీవ్ర భయాందోళనకు గురై పెద్దగా అరిచారు. మిగిలిన చికెన్ ముక్కలు మాత్రం అలాగానే ఉన్నాయి. అయితే ఇది ఏ రెస్టారెంట్‌లో జరిగిందనేది మాత్రం స్పష్టత లేదు. కానీ ఆ ఆహార పదార్థాలను బట్టి జపానీస్, చైనీస్ లేక కొరియన్ రెస్టారెంట్ కావొచ్చని తెలుస్తోంది. నెటిజన్లు మాత్రం ఈ వీడియోపై భిన్నభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అప్పుడే కోడిని కోసుంటారు.. అందుకే ఇలా జరిగి ఉంటుందని తేలికగా తీసిపారేస్తుంటే.. కొందరు మాత్రం ఇది నిజంగా జరిగిందా? అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు.. ఆ కోడికి చావాలని లేనట్టుంది.. అందుకే చచ్చినంక కూడా చావును అంగీకరించడం లేదంటూ ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment