పోర్న్‌స్టార్‌ చల్లగా ఉండాలి | Rehman Malik Gives His Blessings To Porn star Mia Khalifa - Sakshi
Sakshi News home page

పోర్న్‌స్టార్‌ చల్లగా ఉండాలంటున్న మాజీ మంత్రి

Jan 1 2020 1:23 PM | Updated on Jan 1 2020 3:49 PM

Rehman Malik Gives His Blessings To Pornstar Mia Khalifa - Sakshi

సోషల్‌ మీడియాలో మనం ఏదైనా ఒక పోస్ట్‌ను పెడుతున్నామంటే ఒకటికి రెండు సార్లు చెక్‌ చేసుకొని అడుగు ముందుకేయాలి. హా.. ఏముందిలే అనుకొని చిన్న తప్పు చేసామో ఇక ఆ రోజుకి సోషల్‌ మీడియాలో మనమే పెద్ద జోకర్‌ అవ్వొచ్చు. ఇప్పుడు అలాంటి తప్పే చేసి నెటిజన్లకు దొరికిపోయాడు పాక్ మాజీ మంత్రి రెహ్మాన్ మాలిక్. ఇంతకూ ఆయన చేసిందేమిటంటే.. మియా ఖలిఫా అనే పోర్న్ తారను భారతీయురాలిగా భావించిడమే.

చదవండి: నా గత జీవితం దారుణమైంది : పోర్న్‌ స్టార్‌

పౌరసత్వ సవరణ‌ చట్టానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న భారతీయుల జాబితాను ఓ వ్యక్తి ట్విటర్‌లో షేర్ చేయగా.. దాన్ని తన ట్వీట్‌లో మాలిక్ ప్రస్తావించారు. అయితే ఆ భారతీయుల జాబితాలో మాజీ పోర్న్ స్టార్ మియా ఖలీఫా పేరు కూడా ఉంది. వాటి గురించి పట్టించుకోని మాజీ మంత్రి గారు.. మియా ఖలీఫాతో పాటు జాబితాలోని అందరికీ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలంటూ దీవెనలు అందించారు. ఆయన ట్వీట్‌ను ఆసరగా చేసుకున్న నెటిజన్లు ఊరుకుంటారా చెప్పండి. ఎంచక్కా దానిని ట్రోల్ చేయడం మొదలెట్టేశారు. మియాను దేవుడు దీవించుగాక అంటూ ఆయన చేసిన ట్వీట్‌ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement