సాక్షి, ముంబై : సాంకేతికతలోని లోపమో.. కారణమేదో తెలీనప్పటికీ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌లో ఓ వ్యవహారం మిస్టరీగా మారింది. తమ ఫోటోలను ఎవరైనా ట్యాగ్ చేయని పక్షంలో ఖాతాదారులకు ఉపయుక్తంగా ఉంటుందని ‘ఫేస్ రికగ్నిషన్’(ముఖం గుర్తింపు) ఫీచర్‌ను ఫేస్‌బుక్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.
తద్వారా ఖాతాదారుడి ఫోటో ఫేస్‌బుక్‌లో ఎక్కడ, ఎవరు అప్ లోడ్ చేసినా.. దానికదే గుర్తించి పేరును చూపిస్తుంది. అంతేకాదు సదరు ఖాతాదారుడికి అది నోటిఫికేషన్ కూడా వెళ్తుంది. అయితే ముంజిర్ అహ్మద్ అనే జర్నలిస్ట్‌కు మాత్రం ఇది చిక్కులను తెచ్చిపెడుతోంది. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన రేస్-3 చిత్ర పోస్టర్‌ను తాజాగా విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఫేస్‌బుక్‌లో ఎవరు ఆ ఫోటోను అప్‌లోడ్ చేసినా.. ఫేషియల్ రికగ్నిషన్ లో సల్మాన్ ఫేస్ ముంజిర్ పేరును చూపిస్తోంది.
ఇలా ముంజిర్ ఫేస్‌బుక్ అకౌంట్‌లో ఫ్రెండ్స్ లిస్ట్‌లో ఉన్నవాళ్లే కాదు.. బయటి వ్యక్తులు ఎవరు ఫోటోను అప్ లోడ్ చేసినా ముంజిర్‌కే నోటిఫికేషన్ వెళ్తోంది. ‘ఏం జరుగుతోంది? కుప్పలు తెప్పలుగా నోటిఫికేషన్లు వస్తున్నాయ్. నేనేమైనా సల్మాన్‌లా ఉన్నానా? ఈ సమస్య నా ఒక్కడికేనా? లేక నాలాగే ఇంకా ఎవరైనా బాధపడుతున్నారా? ఫేస్‌బుక్ ఫేషియల్ రికగ్నిషన్ దారుణంగా విఫలమైంది. కానీ, ఇది నా వృత్తికి ముడిపడిన అంశం. అందుకే ఫేస్‌బుక్‌ను వీడలేను. ఆ ఫీచర్‌ను ఆఫ్ చేయలేను’ అని ముంజిర్ పేర్కొన్నాడు.
దీనిపై స్పందించిన ఫేస్ బుక్.. ఈ విషయంపై అధికారికంగా ఫిర్యాదు అందలేదని.. అయినప్పటికీ దర్యాప్తు చేపట్టామని పేర్కొంది.
#Facebook Facial Recognition Fail.
— Munzir Ahmad (@iamhacker) 26 March 2018
Recently Facebook introduced facial recognition feature and I turned on this feature.
People are uploading Salman Khan’s Race 3 poster and Facebook is sending me notification which says ‘XYZ uploaded a photo you might be in’
WTF? pic.twitter.com/TzwJsSg1SG
Comments
Please login to add a commentAdd a comment