బాషా రీమేక్‌ చేస్తే? | ajith in basha sequel ? | Sakshi
Sakshi News home page

బాషా రీమేక్‌ చేస్తే?

Published Fri, Jan 26 2018 9:48 AM | Last Updated on Fri, Jan 26 2018 9:48 AM

ajith in basha sequel ? - Sakshi

తమిళసినిమా: బాషా చిత్రం సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ సినీ కేరీర్‌లో గోల్డెన్‌ చిత్రంగా నిలిచిందనడంతో సందేహం లేదు. అప్పటివరకూ ఎక్కువగా కోలీవుడ్‌కే స్టార్‌ హీరోగా ఉన్న రజనీకాంత్‌కు ఇండియన్‌ సూపర్‌స్టార్‌ అంతస్తును తెచ్చిపెట్టిన చిత్రం బాషానేనని చెప్పక తప్పదు. సురేశ్‌కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆయనకు పెద్ద టర్నింగ్‌గా నిలిచింది. అందుకే బాషాకు సీక్వెల్‌ చేయాలన్న కోరిక ఆయనలో బలంగా ఉంది. రజనీకాంత్‌ ఓకే అంటే బాషా–2 చేయడానికి తాను రెడీ అని సురేశ్‌కృష్ణ చాలా సార్లు బహిరంగంగానే ప్రకటించారు.

అంతే కాదు ఈ విషయమై రజనీకాంత్‌తో చర్చించారు కూడా. అయితే బాషా ఒక్కడేనని, మరో బాషా రాడని అప్పట్లో రజనీకాంత్‌ స్పష్టం చేశారు. ఇలాఉండగా ప్రస్తుతం  రీమేక్‌ల పర్వం నడుస్తున్న విషయం తెలిసిందే. దీంతో బాషా చిత్రాన్ని రీమేక్‌ చేస్తే అందులో అజిత్‌ మాత్రమే నటించగలరని నటుడు కరుణాకరన్‌ ఇటీవల ఒక కార్యక్రమంలో పేర్కొన్నారు. అందుకు రీజన్‌ కూడా చెబుతూ ప్రస్తుతం స్టార్‌ హీరోలలో గ్యాంగ్‌స్టర్‌ పాత్రలకు అజిత్‌ మాత్రమే కరెక్ట్‌ అని ఆయన అన్నారు.  ఇంతకు ముందు రజనీకాంత్‌ నటించిన బిల్లా చిత్ర రీమేక్‌లో అజిత్‌ నటించి సక్సెస్‌ అయ్యారన్నది గమనార్హం. ప్రస్తుతం విశ్వాసం చిత్రానికి సన్నద్ధం అవుతున్న అజిత్‌ భవిష్యత్తులో బాషాగా మారే సాహసం చేస్తారో? లేదో చూడాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement