Top Stories
ప్రధాన వార్తలు

HCU భూములపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో హెచ్‌సీయూ యూనివర్సిటీ వద్ద 400 ఎకరాల భూమి అమ్మకం వ్యవహారంలో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో 400 ఎకరాల భూమి వివాదంపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఆ భూమి ప్రభుత్వానిదే అంటూ క్లారిటీ ఇచ్చింది.నగరంలోని హెచ్‌సీయూ వద్ద 400 ఎకరాల భూ వ్యవహారంపై ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించారు. ఈ క్రమంలో..‘ఆ 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదే. ప్రాజెక్టులో సెంట్రల్ యూనివర్సిటీ భూమి లేదు. ఆ భూమి యజమాని తామేనని న్యాయస్థానం ద్వారా తెలంగాణ ప్రభుత్వం నిరూపించుకుంది. ప్రైవేటు సంస్థకు 21 ఏళ్ల క్రితం కేటాయించిన భూమిని న్యాయపోరాటం ద్వారా ప్రభుత్వం దక్కించుకుంది. వేలం.. అభివృద్ధి పనులు అక్కడ ఉన్న రాళ్లను దెబ్బతీయవు. అభివృద్ధికి ఇచ్చిన భూమిలో చెరువు (లేక్) లేదు సర్వేలో ఒక్క అంగుళం భూమి కూడా హెచ్‌సీయూది కాదని తేలింది అని క్లారిటీ ఇచ్చింది. అలాగే, విద్యార్థులను కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారు అంటూ చెప్పుకొచ్చింది. మరోవైపు.. సెంట్రల్ యూనివర్సిటీలో నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇద్దరు పీహెచ్డీ స్కాలర్స్ విద్యార్థులపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఎర్రం నవీన్ కుమార్, రోహిత్‌పై 329(3), 118(10, 132, 191(3), 351(3) r/w 3(5) బీఎన్ఎస్ యాక్ట్ కింద గచ్చిబౌలి పోలీసులు కేసులు పెట్టారు.

Nara Lokesh: కోతి చేతికి కొబ్బరిచిప్ప దొరికినట్లు..!
తెలుగుదేశం పార్టీ అబద్దాల ఫ్యాక్టరీగానే కాదు.. అహంభావం తలకెక్కిన పార్టీగా మారిపోయిందా! పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు, మంత్రి లోకేష్‌లు చేసిన ప్రసంగాలు చూస్తే అలాగే అనిపిస్తోంది! అవకాశవాద రాజకీయాలు చేసేందుకు చంద్రబాబు ఏ మాత్రం ఫీల్ కారు. ఇప్పుడు లోకేష్ కూడా అదేబాటలో పయనిస్తూ అబద్దాలు చెప్పడంలో తండ్రితో పోటీ పడుతున్నారన్న విమర్శలు ఎదుర్కుంటున్నారు. అబద్దాల వరకైతే ఒక రకంగా సరిపెట్టుకోవచ్చు. కాని తానొక యువరాజు అనుకుని అహంకారంతో నారా లోకేష్(Nara Lokesh) మాట్లాడుతున్న తీరు కచ్చితంగా ఆయన స్వభావాన్ని తెలియచేస్తుంది. చంద్రబాబు నాయుడుకు లోపల అహం ఉన్నా, పైకి కనిపించకుండా నటిస్తూ, రెండు రకాలుగా ఆయనే మాట్లాడుతూ ప్రజలను మభ్య పెట్టే యత్నం చేస్తుంటారు. కానీ లోకేష్ మాత్రం అధికారంతో వచ్చిన కైపుతో మాట్లాడుతున్న వైనం పార్టీలోనే కాదు.. ప్రజలలో కూడా వెగటు పుట్టించే అవకాశం ఉంది. వీరి ఉపన్యాసాలకు వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇస్తూ.. చంద్రబాబు ఎప్పటి మాదిరే అసత్యాలు చెప్పారని, లోకేష్ అధికార మదంతో మాట్లాడారని ధ్వజమెత్తారు. భవిష్యత్తులో లోకేష్ ఇందుకు మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. 👉విశేషం ఏమిటంటే తెలుగుదేశం పార్టీ(TDP) ఏర్పడినప్పుడు చంద్రబాబు ఆ పార్టీలో చేరనే లేదు. పార్టీలోకి రావాల్సిందిగా మామ ఎన్టీఆర్, తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు కోరినా, అసలు తెలుగుదేశం పార్టీ మనజాలదని చెప్పారు. సినిమా వాళ్లను జనం ఆదరించరని ఎద్దేవా చేశారు. అప్పట్లో ఆయన కాంగ్రెస్ (ఐ) ప్రభుత్వంలో మంత్రి. పార్టీ అదేశిస్తే మామపై కూడా పోటీ చేస్తానని బీరాలు పలికిన చరిత్ర ఆయనది. కానీ 1983 ఎన్నికలలో చంద్రబాబు ఓడిపోయాయిన వెంటనే ముఖ్యమంత్రి పీఠమెక్కిన మామ పార్టీలోకి రావడం చంద్రబాబుకు ఇబ్బంది రాలేదు. అప్పటి నుంచి పార్టీని ఒక ప్లాన్ ప్రకారం తన గుప్పెట్లోకి తెచ్చుకుని, చివరికి రామారావునే కూలదోసిన సంగతీ తెలిసిందే. 👉చివరి రోజుల్లో ఎన్టీఆర్ స్వయంగా చంద్రబాబును(Chandrababu) విలువలు లేని వ్యక్తి అని చెప్పిన విషయం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. చంద్రబాబు అంత దుష్టుడు లేడంటూ రామారావే వీడియో విడుదల చేశారు. ఆయన ఆకస్మిక మరణంతో చంద్రబాబు మాట మార్చేసి, ఆయన వారసత్వం తనదేనని ప్రకటించుకున్నారు. ఎన్టీఆర్ ఆశయాలే తమ సిద్దాంతమని, ఆయన యుగపురుషుడు అంటూ కబుర్లు చెబుతూ వస్తున్నారు. కాలం గడిచే కొద్ది ఆ పేరు కనుమరుగవుతూ వచ్చింది. స్వోత్కర్ష పెరిగింది. పార్టీలోని ఇతర నేతలు, క్యాడర్ కూడా అదే బాటలో నడుస్తోంది. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు టీడీపీని ఒక అబద్దాల కర్మాగారంగా మార్చడంలో విజయవంతం అయ్యారన్న అభిప్రాయం వివిధ వర్గాలలో వ్యక్తం అవుతుంటుంది. ఒక వర్గం మీడియాకు అవసరమైన వనరులను సమకూర్చి దానిని తన చెప్పుచేతలలో ఉండేలా చేసుకున్నారు. చంద్రబాబు చెప్పే అబద్దాలను జనంలోకి తీసుకువెళ్లడంలో ఈ ఎల్లో మీడియా నిరంతరం శ్రమిస్తుంటుంది. ఈ క్రమంలో కొన్నిసార్లు విజయవంతం అయ్యారు. మరికొన్ని సార్లు విఫలం అయ్యారు. వార్షికోత్సవంలో ఒకరినొకరు పొగుడుకుంటే పర్వాలేదు.కాని అదేదో పార్టీలో మొదటి నుంచి తానే ఉన్నట్లు, ఇప్పటికీ ఎన్టీఆర్ కాలం నాటి విలువలు కొనసాగిస్తున్నట్లుగా కబుర్లు చెప్పడమే అతిశయోక్తిగా ఉంటుంది. ఎన్టీఆర్ ఆత్మగౌరవ నినాదంతో పార్టీని పెట్టారు. పేదలను సంక్షేమ కార్యక్రమాలతో ఆదుకోవాలని భావించేవారు. మాట ఇస్తే సాధ్యమైనంత వరకు ఆచరించి చూపాలని అనేవారు. అబద్దాలు చెప్పడానికి అంతగా ఇష్టపడేవారు కారు. అయితే పార్టీ చంద్రబాబు నాయుడు చేతిలోకి వచ్చినప్పటి నుంచి వీటన్నిటికి మంగళం పలికింది కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఎన్టీఆర్ ఆత్మగౌరవం కోసం ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాడితే, చంద్రబాబు అదే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడానికి 2023 లో నానా తంటాలు పడ్డారు. 2024 ఎన్నికలకు ముందు ఢిల్లీలో రోజుల తరబడి బీజేపీ పెద్దల చుట్టూ తిరిగి ఎలాగైనా పొత్తు కావాలని కోరిన వైనం, పవన్ కళ్యాణ్‌ను బతిమలాడుకున్న తీరును గమనిస్తే, టీడీపీ ఆత్మగౌరవం ఎలా దిగజారిపోయింది తెలియడం లేదా! తన పార్టీలోకి ఎవరైనా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రావాలంటే రాజీనామా చేసి రావాలని ఎన్టీఆర్ నియమం పెట్టారు. చంద్రబాబేమో పూర్తిగా అందుకు విరుద్దం. 2014 టర్మ్‌లో 23 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసి టీడీపీలోకి తీసుకు వచ్చి, నలుగురికి మంత్రి పదవులు కట్టబెట్టారు. ఎన్టీఆర్ ఎన్నికలలో హామీ ఇచ్చిన విధంగా 1994లో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి మద్య నిషేధం విధిస్తే, చంద్రబాబు ఆయనను పదవీచ్యుతుడిని చేసి మొత్తం రివర్స్ చేశారు. పోనీ వాటికైనా కట్టుబడి ఉంటారా ఉంటే అదేమీ లేదు. ఎన్నికలకు ముందు ఎక్కడలేని అబద్దాలు చెబుతారన్న విమర్శకు ఆస్కారం ఇస్తారు. ఆ తర్వాత వాటిని ఏ రకంగా ఎగవేయాలన్న దాని కోసం ఎన్ని అసత్యాలైనా చెప్పడానికి వెనుకాడరని అనుభవాలు చెబుతున్నాయి. 2014 టర్మ్‌లో రైతుల రుణమాఫీ, డ్వాక్రా మహిళల రుణమాఫీ వంటి హామీలు ఇచ్చి ఏమి చేశారో అందరికి తెలుసు. 2024లో రికార్డు స్థాయిలో అబద్దాలు చెప్పి గెలిచిన తర్వాత ఇప్పుడు ఏ రకంగా మాట్లాడుతున్నారో అంతా గమనిస్తూనే ఉన్నారు. సూపర్ సిక్స్, తదితర హామీలు, అప్పుల గురించి ఎన్నికల ప్రచారంలో ఏమి చెప్పారు! ఇప్పుడు ఏమి అంటున్నారు. 👉ఎన్నికలకు ముందు బయట నుంచి చూస్తే సూపర్ సిక్స్ అమలు చేయగలనని అనిపించిందట. అందుకే హామీలు ఇచ్చారట. కాని అధికారం వచ్చాక చేయడం కష్టమని తెలుస్తోందట. పదిహేనేళ్లు సీఎంగా ఉన్న వ్యక్తి ఈ మాటలు చెబితే ఎవరైనా నమ్ముతారా? ప్రజల చెవిలో పూలు పెట్టడం తప్ప ఇంకొకటి అవుతుందా? ఒకసారి అప్పు చేసి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తానంటారు. మరోసారి స్కీములన్నీ ఇచ్చేస్తానని అంటారు. వేరొకసారి అప్పులు చేసి స్కీములు ఎలా ఇస్తామని ప్రజలనే ప్రశ్నిస్తారు. ఇలా అన్ని మాటలు ఆయనే చెబుతారు. కక్ష రాజకీయాలు చేయబోమని అంటారు. మళ్లీ ఆయనే తప్పు చేస్తే తాట తీస్తామని చెబుతారు. చంద్రబాబు పైకి కనీసం నటించనన్నా నటిస్తారు. కాని లోకేష్ ఏ మాత్రం మొహమాటం, పద్దతి ఏమీ లేకుండా అహంకార పూరితంగా మాట్లాడుతున్నారు. కేవలం మాటలే కాదు.. ఆయన పనులు కూడా అలాగే ఉన్నాయి. ఎన్నికలకు ముందు తాను చంద్రబాబు అంత మంచివాడిని కానని కూడా ప్రచారం చేసుకునేవారు. ఆయన కనిపెట్టిన రెడ్ బుక్ అనేది కోతికి కొబ్బరికాయ మాదిరిగా ఉంది. రెడ్‌బుక్ పేరుతో అరాచకాలు సృష్టిస్తున్నది, ఇష్టారాజ్యంగా వైసీపీ వారిపై కేసులు పెడుతున్నది, దౌర్జన్యాలు, విధ్వంసాలను ప్రోత్సహిస్తున్నది తానేనని లోకేష్ చెప్పకనే చెబుతున్నారు. రెడ్ బుక్ అనగానే ఒకరికి గుండెపోటు వచ్చిందని, ఇంకొకరు బాత్ రూమ్ లో కాలు జారిపడ్డారని.. అర్థమైందా రాజా! అంటూ మాట్లాడిన తీరు ఆయనలోని అహంభావాన్ని స్పష్టంగా తెలియచేస్తుంది. ఈ నేపథ్యంలోనే అంబటి రాంబాబు కౌంటర్ ఇస్తూ లోకేష్ అధికార మదంతో మాట్లాడుతున్నారని, మూల్యం చెల్లించుకునే రోజు వస్తుందని హెచ్చరించారు. లోకేష్ తండ్రి చంద్రబాబు నాయుడు స్కిల్ స్కామ్‌లో అరెస్టు అయినప్పుడు బెయిల్ కోసం ఎన్ని వ్యాధులు ఉన్నాయని కోర్టుకు చెప్పారని ప్రశ్నించారు. కేసులు రాగానే ఎక్కడ లేని వ్యాధులు చంద్రబాబుకు గుర్తుకు వచ్చాయని అంబటి వ్యాఖ్యానించారు. ఇందులో కొంత వాస్తవం లేకపోలేదు. ఆ స్కామ్‌లో మనీలాండరింగ్ జరిగిందని, చివరికి టీడీపీ ఆఫీస్ ఖాతాకు కూడా డబ్బు చేరిందని, అప్పట్లో సీఐడీ ఆధార సహితంగా చూపితే దానిని ఖండించలేక పోయారే!. దానికి తోడు ఒక ప్రైవేటు ఆస్పత్రి నుంచి చంద్రబాబుకు రకరకాల జబ్బులు ఉన్నాయని సర్టిఫికెట్ తీసుకుని బెయిల్ పొందారే! అదే ఆస్పత్రిలో ఇప్పుడు ఎవరైనా వైఎస్సార్సీపీ నేత చేరితే జబ్బు లేకపోయినా చేరినట్లవుతుందా? అదెందుకు!.. .. చంద్రబాబు అరెస్టు అయితే, పాదయాత్ర ఆపేసి మరీ లోకేష్ డిల్లీకి ఎందుకు పరుగులు తీశారు? కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసి ఏమని వేడుకున్నారు? ఇవన్ని వాస్తవాలే కదా. కాని జాక్ పాట్ మాదిరి అధికారం వచ్చింది కదా అని విర్రవీగితే లోకేష్ కే నష్టమని రాంబాబు అన్నారు. అబ్దుల్ కలాంను టీడీపీనే రాష్ట్రపతి చేసినట్లు, ఇలా ఏవేవో డాంబికాలు చెప్పుకుంటే చెప్పుకోవచ్చు. కానీ రెడ్ బుక్ పేరుతో ప్రజలపైన ,ప్రతిపక్షంపై, ప్రశ్నించే వారిపై దాడులకు తెగబడతామంటే ఎల్లకాలం వారి ఆటలు సాగవు. ఈ సంగతిని గుర్తు పెట్టుకోకపోతే అదే రెడ్ బుక్ తన మెడకు చుట్టుకుంటుందన్న సంగతి లోకేష్ ఎంత త్వరగా గుర్తిస్తే ఆయనకే అంత మంచిది.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత

ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ముస్లిం సోదరులకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. మనిషిలోని చెడు భావనల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ రంజాన్ అని వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు. అల్లా చూపిన మార్గంలో నడవాలని, అల్లా చల్లని దీవెనలు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు తెలిపారురంజాన్ పండుగ సందర్బంగా వైఎస్ జగన్..‘ముస్లింలకు రంజాన్ పండుగ ఎంతో పవిత్రమైనది. రంజాన్ పండుగ సామరస్యానికి, సుహృద్భావానికి, సర్వమానవ సమానత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక. అల్లాహ్ దీవెనలతో రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ మానవాళికి సకల శుభాలు కలగాలని కోరుకుంటున్నాను. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్ మాసం విశిష్టత. పవిత్ర దివ్య ఖురాన్ అవతరించిన ఈ మాసంలో కఠిన ఉపవాస దీక్షలకు రంజాన్ ఒక ముగింపు వేడుక. మనిషిలోని చెడు భావనల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ రంజాన్’ అని అన్నారు.భక్తి శ్రద్ధలతో కఠినమైన ఉపవాస దీక్షలు ముగించుకుని ప్రేమ, శాంతి, సౌభ్రాతృత్వానికి ప్రతీక అయిన రంజాన్ పండుగను జరుపుకుంటున్న ముస్లిం సోదర సోదరీమణులందరికీ నా శుభాకాంక్షలు. అల్లా చూపిన మార్గంలో నడవాలని, అల్లా చల్లని దీవెనలు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా…— YS Jagan Mohan Reddy (@ysjagan) March 31, 2025

RR VS CSK: చివరి ఓవర్లో ధోని ఔట్.. సీఎస్కే ఫ్యాన్ గర్ల్ రియాక్షన్ చూడండి..!
ఐపీఎల్ 2025లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో నిన్న (మార్చి 30) జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చివరి వరకు పోరాడి 6 పరుగుల స్వల్ప తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో సీఎస్కే 183 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తూ 176 పరుగుల వద్ద ఆగిపోయింది. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ధోని చెన్నైని గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు.Shimron Hetmeyer took a brilliant catch in the final over to dismiss MS Dhoni and potentially save the match for Rajasthan !! 👏👏#RRvCSK #RRvsCSK pic.twitter.com/AGhS9ZM2cU— Cricketism (@MidnightMusinng) March 30, 2025చివరి ఓవర్లో 20 పరుగులు చేయాల్సి ఉండగా.. ధోని తొలి బంతికే ఔటయ్యాడు. సందీప్ శర్మ బౌలింగ్‌లో హెట్‌మైర్ బౌండరీ లైన్ వద్ద అద్బుతమైన క్యాచ్ పట్టాడు. ఇది చూసి ధోనిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఓ ఫ్యాన్ గర్ల్ తట్టుకోలేకపోయింది. ఎంత పని చేశావు రా అన్నట్లు ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది. హెట్‌మైర్ పక్కనే ఉంటే ఆ అభిమాని చేతిలో తన్నులు తినుండే వాడు. ఈ ఫ్యాన్ గర్ల్ రియాక్షన్ ప్రస్తుతం ఇంటర్నెట్ను షేక్ చేస్తుంది. దీనిపై రకరకాల మీమ్స్ వస్తున్నాయి.Reaction of a Dhoni fan when Hetmyer took his catch! Thala for a reason! 🔥 pic.twitter.com/0RmHT4kfcw— Keh Ke Peheno (@coolfunnytshirt) March 31, 2025కాగా, ధోని ఔటైన అనంతరం గౌహతిలోని బర్సపారా క్రికెట్ స్టేడియంలో నిశ్శబ్దం ఆవహించింది. ఈ మ్యాచ్‌లో ధోని సీఎస్కేను గెలిపిస్తాడని అంతా అనుకున్నారు. రాయల్స్ సైతం ధోనికి బయపడుతూనే సందీప్ శర్మకు చివరి ఓవర్ ఇచ్చింది. అప్పటికే 10 బంతుల్లో ఫోర్, సిక్సర్ సాయంతో 16 పరుగులు చేసిన ధోని మంచి టచ్‌లో ఉన్నట్లు కనిపించాడు. Wake up babe new meme template just dropped #CSKvsRR #Dhoni pic.twitter.com/J5jMnZKp4W— Ganeshan (@ganeshan_iyer) March 30, 2025అయితే హెట్‌మైర్ డీప్ మిడ్ వికెట్ వద్ద అద్భుతమైన డైవింగ్ క్యాచ్ పట్టి చెన్నై అభిమానుల ఆశలను అడియాసలు చేశాడు. ధోని ఔటైన వెంటనే సీఎస్కే ఓటమి ఖరారైపోయింది. నాలుగో బంతికి ఓవర్టన్ సిక్సర్ కొట్టినా ఎలాంటి ప్రయోజనం లేదు.ఛేదనలో సీఎస్కే ఆదిలోనే ఇన్ ఫామ్ బ్యాటర్ రచిన్ రవీంద్ర వికెట్ కోల్పోయినా కెప్టెన్ రుతురాజ్ చక్కటి అర్ద సెంచరీతో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. అయితే అతనికి మరో ఎండ్ నుంచి సహకారం లభించలేదు. ఆఖర్లో జడేజా (22 బంతుల్లో 32 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్) పోరాడినా ఫలితం లేదు. ఇన్నింగ్స్ మధ్యలో హసరంగ ప్రతి ఓవర్లో ఓ వికెట్ తీసి సీఎస్కేను దెబ్బకొట్టాడు. శివమ్ దూబే లాంటి భారీ హిట్టర్ కొన్ని ఓవర్ల పాటు క్రీజ్‌లో ఉండివుంటే ఫలితం వేరేలా ఉండేది. కానీ దూబేను రియాన్ పరాగ్ అద్బుతమైన క్యాచ్‌తో పెవిలియన్‌కు పంపాడు.అంతకుముందు నితీశ్ రాణా (36 బంతుల్లో 81; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) శివాలెత్తిపోవడంతో రాయల్స్ 182 పరుగులు చేసింది. వాస్తవానికి రాయల్స్ ఇంకా భారీ స్కోర్ చేయాల్సింది. అయితే నితీశ్‌ను ఔట్ చేశాక సీఎస్కే బౌలర్లు నూర్ అహ్మద్ (4-0-28-2), పతిరణ (4-0-28-2), ఖలీల్ అహ్మద్ (4-0-38-2) పరిస్థితికి అదుపులోకి తెచ్చుకున్నారు. ఈ మ్యాచ్‌లో ఓటమితో సీఎస్కే రన్‌రేట్ కూడా బాగా దెబ్బతినింది. ఈ సీజన్లో ఆ జట్టుకు మూడు మ్యాచ్‌ల్లో ఇది రెండో ఓటమి. తొలి మ్యాచ్‌లో ముంబైపై విజయం సాధించిన ఎల్లో ఆర్మీ.. ఆతర్వాత వరుసగా ఆర్సీబీ, రాయల్స్ చేతుల్లో పరాజయంపాలైంది.

పవన్ అసమర్థుడినని తానే ఒప్పుకున్నాడు: అంబటి
సాక్షి, గుంటూరు: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సంపద సృష్టిస్తామన్నారు.. ఏమైంది? అని ప్రశ్నించారు. అలాగే, రాష్ట్రంలో తొమ్మిది నెలల కూటమి పాలనలో ఎంత సంపద సృష్టించారు చెప్పాలని డిమాండ్ చేశారు.మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబుది అంతా పబ్లిసిటీ స్టంట్. చంద్రబాబు పీ-4 పేరుతో ప్రజలందరినీ అడ్వాన్స్డ్ ఏప్రిల్ ఫూల్ చేశారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు సంపద సృష్టిస్తామన్నారు.. సంపద ఏమైంది?. రాష్ట్రంలో తొమ్మిది నెలల కూటమి పాలనలో ఎంత సంపద సృష్టించారు. గత ప్రభుత్వ పథకాలను పాతరేశారు. కొత్త పథకాల ఊసేలేదు. రాష్ట్రంలోని పేద ప్రజలను మరింత పేదరికంలోకి నెడుతున్నారు. డబ్బులు ఉన్నోడికే మెడికల్ సీట్లు దోచిపెడుతున్నారు. నీతి, నిజాయితీకి మారు పేరు అంటే చంద్రబాబు ఎవరైనా నమ్ముతారా?. బంగారు కుటుంబం అని రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారు. పీ-4 అంటూ బాధ్యతల నుంచి తప్పించుకుంటున్నారు’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. పీ-4 పేరుతో కొత్త నాటకం..చంద్రబాబు నాయుడు పీ-4 పేరుతో కొత్త నాటకాన్ని ప్రారంభించాడు. పీ-4కు మార్గదర్శి బంగారు కుటుంబం అని కొత్త పేరు పెట్టాడు. ఆంధ్రప్రదేశ్‌లో పేదరిక నిర్మూలనకు పీ-4 దోహదం చేస్తుందని చంద్రబాబు చెప్తున్నారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కొత్తగా టోల్ గేట్లు పెడతానని చెబుతున్నారు. మెడికల్ కాలేజీలు, పోర్టులు, గ్రామీణ ప్రాంత రోడ్డును చంద్రబాబు నాయుడు ప్రైవేటుపరం చేస్తున్నాడు. గత చంద్రబాబు ప్రభుత్వంలో 58 కార్పొరేషన్లను ప్రైవేటీకరణ చేశాడు. ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్, సంపద సృష్టిస్తానని చెప్పాడు. పేదరిక నిర్మూలన చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.పేదరిక నిర్మూలన కావాలంటే విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పించాలి. అంతేకానీ కాంట్రాక్టర్లను, డబ్బులు ఉన్నవారిని, బడా బాబుల్ని పీ-4 పేరుతో వేదికపైన కూర్చోబెడితే పేదరికం పోదు. ఈ రాష్ట్రంలో రెండే రెండు బంగారు కుటుంబాలు ఉన్నాయి. ఒకటి చంద్రబాబుది, రెండోది పవన్ కళ్యాణ్‌ది. ఈ రెండు బంగారు కుటుంబాలే. గతంలో చంద్రబాబు నాయుడు జన్మభూమి అన్నాడు.. శ్రమదానం అన్నాడు అవన్నీ పోయాయి. ఇప్పుడు పీ-4 పేరు చెప్పి ప్రచారం చేసుకుంటున్నాడు.చంద్రబాబు నాయుడు నేనేం తప్పు చేయనని డప్పు కొట్టుకుంటున్నాడు. ఆయన పుట్టిన దగ్గర నుంచి ఆయన చేసేవన్నీ తప్పులే. ఎన్టీఆర్ దగ్గర పని చేశారని చంద్రబాబు చెప్తున్నాడు. ఆయన ఇందిరా గాంధీ దగ్గర పని చేశాడు.. ఎన్టీఆర్ పని పూర్తి చేశాడు. లోకేష్ లాంటి అసమర్ధుడిని ప్రజలపై రుద్దాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడు. రాష్ట్రంలో ఒక కోటి 40 లక్షల మంది వైట్ రేషన్ కార్డులు ఉన్నవాళ్లు ఉన్నారు. ఎనిమిది లక్షల అరవై వేల మంది ట్యాక్స్ కట్టే వాళ్ళు ఉన్నారు. వీళ్లని వాళ్లతో ఎలా అనుసంధానం చేస్తాడు?.పవన్ ప్యాకేజీ స్టారే..పవన్ కళ్యాణ్ నేను అసమర్థున్ని అని మనసులో మాట బయటపెట్టారు. పవన్ మాటలను జనసేన కార్యకర్తలు, వీర మహిళలు ఆలోచించాలి. లోకేష్ డబ్బులు వసూలు చేసి పవన్‌కి ప్యాకేజీ ఇస్తున్నాడు. పేదల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబు నాయుడుకి లేదు. చంద్రబాబు నాయుడు సెల్ ఫోన్ నేనే కనిపెట్టాను.. ఐటీ నేనే తెచ్చానని పిట్టలదొర మాటలు మాట్లాడుతున్నాడు. డబ్బులు కోసం పోలవరాన్ని చంద్రబాబు సర్వనాశనం చేశాడు. పోలవరాన్ని ఏటీఎంగా మార్చుకున్నారని సాక్షాత్తు ప్రధాని మోదీనే చెప్పారు. పోలవరంపై ఎప్పుడైనా ఎక్కడైనా చర్చకు నేను సిద్ధం. చంద్రబాబు వచ్చినా.. ఆయన మంత్రులను పంపించినా చర్చకు నేను సిద్ధం. కేంద్రం కట్టాల్సిన పోలవరాన్ని ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది అని ఎప్పటినుంచో అడుగుతున్నాను. కానీ, తెలుగుదేశం నాయకులు గానీ చంద్రబాబు గానీ.. ఎవరు సమాధానం చెప్పడం లేదు ఎందుకు?. కూటమి ప్రభుత్వానికి రోజులు చెల్లాయి. చంద్రబాబు సర్కార్‌పై ప్రజలు తిరగబడే రోజులు దగ్గరపడ్డాయి. చంద్రబాబు తెలిపి తక్కువ వల్లే పోలవరం ఆలస్యమైంది. పోలవరంపై చర్చకు ఎప్పుడైనా సిద్దమే. స్పిల్ వే, కాఫర్ డ్యామ్ పూర్తి చేసిన ఘనత వైఎస్సార్సీపీదే. కాఫర్ డ్యామ్ పూర్తి చేయకుండా డయాఫ్రం వాల్ వేస్తారా? అని ప్రశ్నించారు.

నా కుమారుడు ఎవరినీ మోసం చేయలేదు.. లూసిఫర్‌పై 'పృథ్వీరాజ్' తల్లి
'ఎల్ 2: ఎంపురాన్' (L2 Empuraan) వివాదంపై మోహన్‌లాల్ (Mohanlal) ఇప్పటికే స్పందించారు. సోషల్ మీడియా వేదికగా చిత్ర బృందం తరఫున క్షమాపణలు చెబుతూ ఆయన ఒక పోస్టు కూడా చేశారు. తాజాగా చిత్ర దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) తల్లి మల్లిక కూడా ఈ గొడవపై రియాక్ట్ అయ్యారు. లూసిఫర్ సినిమా విషయంలో కేవలం తన కుమారుడిని మాత్రమే తప్పుగా చూపుతూ కొందరు దూషిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. తన కుమారుడు ఎవరినీ మోసం చేయలేదని సోషల్‌మీడియా వేదికగా పోస్ట్ చేశారు.లూసిఫర్2 సినిమా విషయంలో తన కుమారుడిని కించపరిచేలా తప్పుడు కథనాలు రావడాన్ని మల్లిక తప్పుబట్టారు. ఈ వివాదంపై మొదట తాను రియాక్ట్ కాకూడదని నిర్ణయించుకున్నానని ఆమె చెప్పారు. కానీ, ఒక తల్లిగా తన కుమారుడి కోసం రియాక్ట్ కావాల్సి వస్తుందని ఆమె ఇలా అన్నారు. 'ఎల్ 2: ఎంపురాన్' తెర వెనుక జరుగుతున్న విషయాలన్ని నాకు తెలుసు. కానీ, నా కుమారుడిని మాత్రమే తప్పుగా చూపుతూ కథనాలు క్రియేట్ చేస్తున్నారు. నా కుమారుడు ఎవరినీ మోసం చేయలేదు. మోహన్‌లాల్, చిత్ర నిర్మాతలు ఎవరూ కూడా పృథ్వీరాజ్ మోసం చేసినట్లు చెప్పలేదు. మోహన్‌లాల్ నా సోదరుడితో సమానం. నా కుమారుడిపై జరుగుతున్న తప్పుడు ప్రచారం కూడా ఆయనకు తెలియకుండానే కొందరు చేస్తున్నారు. చాలామంది కుట్రలు పన్ని నా కుమారుడిని బలిపశువును చేస్తున్నారు. నా కుమారుడు పృథ్వీరాజ్ ఎవరినీ మోసం చేయడని బలంగా చెబుతున్నాను. ఈ మూవీ వల్ల ఏమైనా ఇబ్బందులు వచ్చాయంటే అందులో భాగమైన వారందరికీ బాధ్యత ఉంటుందని తెలుసుకోవాలి. కేవలం ఒక్కరి మీద మాత్రమే నిందలు వేయకూడదు. సినిమా కథను అందరూ చదివే కదా అందరూ ఆమోదించారు. సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు రచయిత కూడా ఎల్లప్పుడు పక్కనే ఉన్నారు. ఇబ్బంది ఉంటే ఆయనే మార్పులు చేసేవారు. సినిమా విడుదలయ్యాక కేవలం పృథ్వీరాజ్‌ను మాత్రమే తప్పుపడుతున్నారు. పూర్తి విషయాలు తెలుసుకోకుండా కొందరు సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు కామెంట్లు చేస్తున్నారు. మోహన్‌లాల్‌కు తెలియకుండా కొన్ని సీన్లు ఈ మూవీలో కలిపారంటూ వస్తున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు. సినిమా పూర్తి అయిన తర్వాత అందరూ చూసిన తర్వాతే విడుదల చేశారు. అందరి ఆమోదంతోనే మీ వద్దకు మూవీ వచ్చిందని గ్రహించండి. నా కుమారుడు ఎప్పటికీ ఎవరి వ్యక్తిగత విశ్వాసాల జోలికి వెళ్లడు.' అని మల్లిక చెప్పుకొచ్చారు.2002 సమయంలో గుజరాత్లో జరిగిన అల్లర్ల నేపథ్యంలోని కొన్ని సీన్లు ఈ సినిమాలో చూపించారని కొందరు తప్పపట్టారు. ఆ సమయంలో ఓ కుటుంబాన్ని మరో వర్గానికి చెందిన నాయకుడు అత్యంత కీరాతకంగా హత్య చేసి ఫైనల్‌గా అతనే రాజకీయాల్లోకి అడుగుపెట్టారని చూపించటం ఒక వర్గం వారికి నచ్చలేదు. దీంతో ఈ చిత్రంపై చాలా విమర్శలు వచ్చాయి.

రాజకీయ ప్రకంపనలు.. మూడోసారి అధికారంపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తాను మూడోసారి అధికారంలోకి రావడానికి మార్గాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడిగా మూడోసారి ఎన్నిక కావడంపై తాను జోక్ చేయడం లేదంటూ మాట్లాడారు. అయితే, అమెరికా అధ్యక్షుడిగా మూడోసారి ఎన్నిక కావడాన్ని రాజ్యాంగంలోని 22వ సవరణ అనుమతించదు. దీంతో, ఆయన వ్యాఖ్యలు అమెరికాలో కొత్త చర్చకు దారి తీశాయి.అమెరికా అధ్యక్షుడిగా మూడోసారి ఎన్నిక కావడానికి అవకాశం, మార్గాలు ఉన్నాయని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. అయితే దీనిపై ఇప్పుడే ఆలోచించడం సరికాదన్నారు. దానికి ఇంకా సమయం ఉందని చెప్పుకొచ్చారు. అధ్యక్షుడు ట్రంప్ ఆదివారం ఓ న్యూస్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అమెరికాలో చాలా మంది ప్రజలు.. నన్ను మూడోసారి ఎన్నిక కావాలని కోరుతున్నారు. నాకు పనిచేయడం అంటే ఇష్టం. అమెరికా ప్రజలు కోసం ఎంత కష్టమైనా కొన్ని నిర్ణయాలు తీసుకోడానికి వెనుకాడను. మూడోసారి అధ్యక్ష బాధ్యతలు తీసుకోవడానికి ఇంకా చాలా సమయం ఉంది. ఇప్పుడే దానిపై ఆలోచించడం తొందరపాటు అవుతుంది. ఇప్పుడు నేను ప్రస్తుత పరిస్థితులపై దృష్టి సారించాను. ఇప్పుడు చేయాల్సింది చాలా మిగిలి ఉంది’ అంటూ కామెంట్స్ చేశారు.రెండు మార్గాలు.. ఇదిలా ఉండగా.. అమెరికా రాజ్యాంగంలో విధించిన రెండు దఫాల నిబంధనను మార్చాలంటే సవరణ చేయాలి. అది కష్టతరమైనది. రాజ్యాంగ సవరణ చేయాలంటే కాంగ్రెస్‌లో మూడింట రెండు వంతుల మెజారిటీ ఉండాలి. లేదంటే మూడింట రెండు వంతుల రాష్ట్రాలు అంగీకరించాలి. ఈ రెండు మార్గాలనూ నాలుగింట మూడు వంతుల రాష్ట్రాలు ఆమోదించాలి. ఇది వ్యాఖ్యలు చేసినంత సులభం కాదని పలువురు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక, అమెరికాలో 2028లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.

బాబు డబుల్ గేమ్.. సొంత ఇలాకాలో ఊహించని షాక్
చిత్తూరు, సాక్షి: ముస్లింల హక్కుల విషయంలో డబుల్ గేమ్ ఆడుతున్న నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం తీరుపై ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా.. చంద్రబాబు నియోజకవర్గంలో, అదీ రంజాన్ పర్వదినాన ముస్లిం సోదరులు శాంతియుత నిరసనకు దిగారు. తమ సంక్షేమాన్ని, అభివృద్దిని నిర్లక్ష్యం చేస్తున్న చంద్రబాబు(Chandrababu).. ఇప్పుడేమో రక్షించేవాడిలా నాటకాలు ఆడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నియోజకవర్గం కుప్పం(Kuppam)లో ఇవాళ నిరసన జరిగింది. నల్ల బ్యాడ్జిలు ధరించిన మరీ రంజాన్ ప్రత్యేక ప్రార్థనంలో పాల్గొన్నారు ముస్లిం సోదరులు. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు కూటమి ప్రభుత్వం నడుం బిగించాలనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. కేంద్రంలోని ఎన్డీయేలో కీలక భాగస్వామిగా ఉంటూనే.. వక్ఫ్ సవరణ బిల్లుకు చంద్రబాబు మద్దతు ఇస్తుండడాన్ని వీళ్లంతా ఖండించారు. ఈ బిల్లు గనుక పార్లమెంట్లో పాసైతే ముస్లిం సమాజం తీవ్రంగా నష్టపోతుంది అని ఆవేదన చెందుతున్నారు. ఇదీ చదవండి: వక్ఫ్ సవరణ బిల్లును అడ్డుకోవాల్సిందేముస్లిం సమాజం మొత్తం వ్యతిరేకిస్తున్న వక్ఫ్ సవరణ బిల్లు(Waqf Bill) విషయంలో రాష్ట్రంలో ఒకలా, ఢిల్లీలో మరో రకంగా చంద్రబాబు మాట్లాడుతుండడాన్ని రాజకీయ వర్గాలు ఖండిస్తున్నాయి. ఈ బిల్లు విషయంలో చంద్రబాబు రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నాయి.ఇదిలా ఉంటే.. టీడీపీ మద్ధతు మీదనే కేంద్రం ఆధారపడి ఉందనేది విశ్లేషకుల మాట. అలాంటప్పుడు ఆ బిల్లును ఆదిలోనే టీడీపీ వ్యతిరేకించి ఉంటే ఇప్పుడు జేపీసీ వరకు వచ్చి ఉండేది కాదన అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. మరోపక్క బిల్లుకి మద్దతు ప్రకటించిన చంద్రబాబు.. తాజాగా జరిగిన ఇఫ్తార్ విందులో పాల్గొని వక్ఫ్ ఆస్తులను పరిరక్షిస్తున్నామని చెబుతుండడం మోసమేనన్నది కొందరి వాదన. ఈ క్రమంలోనే ఎన్డీయే కూటమిలో కీలక భాగస్వాములైన టీడీపీ అధినేత చంద్రబాబు, జేడీయూ నితీశ్ కుమార్లపై మజ్లిస్ అధినేత.. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అలాంటి వారిని క్షమించబోమంటూ ఘాటు వ్యాఖ్యాలు చేశారు.

అరుదైన వ్యాధులు వస్తే.. ఇదిగో ఈ ఇన్సూరెన్స్..
హీమోఫీలియా, మర్ఫాన్ సిండ్రోమ్ లాంటి అరుదైన వ్యాధులు కొద్ది మందికి మాత్రమే వస్తాయి. కానీ వాటి తీవ్రత మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా 30 కోట్ల మంది 7 వేల పైగా రకాల అరుదైన వ్యాధులతో బాధపడుతున్నారని అంచనా. ఇలాంటి వాటికి నాణ్యమైన చికిత్స దొరకడం కష్టంగానే ఉంటోంది.. అలాగే చికిత్స వ్యయాలు భారీగానే ఉంటున్నాయి.భారత్ విషయానికొస్తే 7 కోట్ల మంది అరుదైన వ్యాధులతో బాధపడుతున్నారని అంచనాలున్నాయి. అవగాహనారాహిత్యం, వైద్యపరీక్షల వ్యయాలు భారీగా ఉండటం, ఆరోగ్య సంరక్షణ సదుపాయాలు అంతగా లేకపోవడం వంటి అంశాల కారణంగా వారు సమయానికి సరైన చికిత్సను పొందలేకపోతున్నారు.ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) 4,001 అరుదైన వ్యాధులను గుర్తించింది. కానీ, 450 వ్యాధుల రికార్డులు మాత్రమే ఆస్పత్రుల్లో అధికారికంగా అందుబాటులో ఉంటున్నాయి. వైద్యపరీక్షలు, డేటా సేకరణపరమైన సవాళ్లను ఇది సూచిస్తోంది. 80 శాతం అరుదైన వ్యాధులు జన్యుపరమైనవే కాగా మిగతావి ఇన్ఫెక్షన్లు, ఆటోఇమ్యూన్ లేదా పర్యావరణంపరమైన అంశాల వల్ల వస్తున్నాయి.50 శాతం పైగా అరుదైన వ్యాధుల లక్షణాలు ఎక్కువగా పిల్లల్లోనే ఉంటాయి కాబట్టి సాధ్యమైనంత ముందుగా వైద్యపరీక్షలు చేసి గుర్తించడం కీలకంగా ఉంటుంది. అరుదైన వ్యాధులకు ప్రత్యేకమైన చికిత్సలు, జీవిత కాల సంరక్షణ, కొన్ని సందర్భాల్లో ప్రయోగాత్మక చికిత్సలు కూడా అవసరమవుతాయి. అందుకే తగినంత బీమా కవరేజీ ఉండాలి. ఈ నేపథ్యంలో సాధారణ హెల్త్ ఇన్సూరెన్స్, క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్ల మధ్య వ్యత్యాసాలు, వాటితో ఏయే ప్రయోజనాలు ఉంటాయో తెలియజేసేదే ఈ కథనం. క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్ అంటే.. సాధారణ ఆరోగ్య బీమాతో పోలిస్తే క్రిటికల్ ఇల్నెస్ (సీఐ) స్వరూపం భిన్నంగా ఉంటుంది. ఆస్పత్రిలో చికిత్స వ్యయాలకు మాత్రమే చెల్లించడం కాకుండా, వ్యాధి నిర్ధారణయినప్పుడు ఏకమొత్తంగా బీమా మొత్తాన్ని కంపెనీ చెల్లిస్తుంది. దీన్ని చికిత్స వ్యయాల కోసం కావచ్చు, కోల్పోయిన ఆదాయాన్ని భర్తీ చేసుకోవడం కోసం కావచ్చు, ఇతరత్రా ప్రత్యామ్నాయ చికిత్స కోసం కావచ్చు, పాలసీదారు తనకు కావాల్సిన విధంగా ఉపయోగించుకోవచ్చు.లూపస్ లేదా స్లెరోడెర్మాలాంటి అరుదైన ఆటోఇమ్యూన్ వ్యాధులకు సీఐ ప్లాన్‌తో ఆర్థికంగా కొంత ఉపశమనం లభించవచ్చు. సాధారణంగా ముందస్తుగా నిర్ణయించిన వ్యాధుల కేటగిరీలకు మాత్రమే సీఐ ప్లాన్లు బీమా మొత్తాన్ని చెల్లిస్తాయి. ఒకవేళ ఏదైనా అరుదైన వ్యాధికి కవరేజీ నుంచి మినహాయింపు ఉంటే, పాలసీదారుకు ఆర్థిక ప్రయోజనం దక్కదు. కవరేజీల్లో వ్యత్యాసం.. ఏది మెరుగైనది.. అరుదైన వ్యాధుల విషయంలో ప్రాథమిక ఆరోగ్య బీమా, హాస్పిటలైజేషన్, తక్షణ వైద్య వ్యయాలకు ఉపయోగపడుతుంది. డాక్టర్లను సంప్రదించడం, ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చేరడం, అవసరమైన ప్రొసీజర్లు మొదలైన వాటికి పాలసీ చెల్లిస్తుంది. అయితే, ఆదాయ నష్టం, దీర్ఘకాల సంరక్షణలాంటి పరోక్ష వ్యయాలకు కవరేజీనివ్వదు. మరోవైపు, క్రిటికల్ ఇల్నెస్ పాలసీ అనేది ఏకమొత్తంగా చెల్లిస్తుంది. దాన్ని పాలసీదారు తనకు కావాల్సిన విధంగా ఉపయోగించుకోవచ్చు.అయితే, సదరు వ్యాధి గురించి పాలసీలో ప్రస్తావిస్తేనే ఇది వీలవుతుంది. లేకపోతే కవరేజీ లభించదు. సాధారణంగా సీఐ పాలసీలు చాలా మటుకు అరుదైన వ్యాధులకు కవరేజీనివ్వవు. కాబట్టి ఆర్థిక భద్రత కోసం వాటిని మాత్రమే నమ్ముకోవడానికి ఉండదు. అరుదైన సమస్యలు ఉన్న వారు అధిక కవరేజీ ఉండే బేసిక్ హెల్త్ ఇన్సూరెన్స్, క్రిటికల్ ఇల్నెస్ పాలసీని కలిపి తీసుకుంటే ఆర్థికంగా భరోసాగా ఉంటుంది. అసాధారణ వ్యాధుల కోసం ఆర్థిక ప్రణాళిక.. అరుదైన వ్యాధులతో అధిక రిస్కులున్న వారు రెండు రకాల బీమాను తీసుకుంటే భరోసాగా ఉంటుంది. అధిక కవరేజీ ఉండే సాధారణ ఆరోగ్య బీమా పాలసీ, ఆస్పత్రి.. వైద్య వ్యయాలకు కవరేజీనిస్తుంది. ఇక క్రిటికల్ ఇల్నెస్ పాలసీ (ఒకవేళ తీసుకుంటే) వైద్యయేతర వ్యయాలకు ఆర్థికంగా తోడ్పాటు అందిస్తుంది. కవరేజీల్లో అంతరాలను తగ్గించుకునేందుకు టాప్ అప్ ప్లాన్లు, నిర్దిష్ట వ్యాధి సంబంధిత పాలసీల్లాంటివి పరిశీలించవచ్చు.రెగ్యులర్ హెల్త్ ఇన్సూరెన్స్ అంటే.. సమగ్ర ఆరోగ్య బీమా పాలసీలనేవి హాస్పిటలైజేషన్ చార్జీలు, డాక్టర్ల కన్సల్టేషన్లు, వైద్య పరీక్ష ప్రొసీజర్లు, ఆస్పత్రిలో చేరడానికి ముందు అలాగే ఆ తర్వాత తలెత్తే వ్యయాలకు కవరేజీనిస్తాయి. హంటింగ్టన్స్ డిసీజ్ లేదా రెట్ సిండ్రోమ్‌లాంటి నరాల సంబంధిత అరుదైన వ్యాధుల విషయంలో హాస్పిటలైజేషన్.. సపోర్టివ్ కేర్‌కి, జీవక్రియ సంబంధ గౌచర్ వ్యాధి లేదా ఫ్యాబ్రీ వ్యాధి, ఎంజైమ్ మార్పిడి థెరపీ కూడా కవరేజీ లభిస్తుంది. అయితే, సాధారణ పాలసీల్లో అన్ని రకాల అరుదైన వ్యాధులూ కవర్ కావు. కాబట్టి, జేబు నుంచి భారీగా పెట్టుకోవాల్సి వస్తుంది.అమితాబ్ జైన్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్

ఐశ్వర్యరాయ్ బాడీగార్డ్ వేతనం ఎంతో తెలుసా? సీఈవోలకు మించి
సినీ తారల కీర్తి, సంపద గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే ఉండదు. వృత్తిపరంగా వచ్చే ఆదాయంతో పాటు, ఎండార్స్మెంట్లు, ప్రకటనలు తదితర మార్గాల ద్వారా భారీ ఆదాయాన్నే సంపాదిస్తారు. ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్‌కి తోడు సహజంగానే అధిక భద్రత అవసరం ఉంటుంది. అందులోనూ సూపర్ స్టార్లకు మరింత రక్షణ అవసరం. వారి కుటుంబాలకు భద్రతాపరమైన ప్రత్యేకమైన ఏర్పాటు ఉంటుంది. ముఖ్యంగా స్టార్ హీరోలు, హీరోయిన్ల వ్యక్తిగత భద్రతకోసం తమతోపాటు పాటు వచ్చే వ్యక్తిగత అంగరక్షకులపై భారీగా ఖర్చు పెడతారు. ఒక్కో సెలబ్రిటీ బాడీగార్డ్ (Bodyguard) సంపాదన కార్పొరేట్ కంపెఈ సీఈవోలకు మించి ఉంటుంది. మరి బాలీవుడ్ అందాల తార ఐశ్వర్య రాయ్ బచ్చన్ (Aishwarya Rai Bachchan) బాడీగార్డ్ జీతం ఎంతో తెలుసా?బాలీవుడ్ ప్రపంచం గ్లామర్ , స్టార్డమ్తో నిండి ఉంటుంది. అందాల ఐశ్వర్యం ఐశ్వర్య ప్రపంచవ్యాప్తంగా భారీ అభిమానులను సంపాదించుకుంది. ఆమె బయటికి అడుగుపెట్టినప్పుడల్లా నిరంతరం భారీ భద్రత అవసరం. సినిమాలు, రెడ్ కార్పెట్ ప్రదర్శనల నుండి అంతర్జాతీయ ప్రయాణాల వరకు ఐశ్వర్య విశ్వసనీయ బాడీగార్డ్ శివరాజ్. ఆయన అందిస్తున్నసేవలకు నిదర్శనంగా గత కొన్నేళ్లుగా బచ్చన్ కుటుంబ భద్రతా బృందంలో కొనసాగుతున్నాడు. ఐశ్వర్యతో పాటు సినిమా సెట్లు, పబ్లిక్ ఈవెంట్లు , అంతర్జాతీయ పర్యటనలకు శివరాజ్ తోడు ఉండాల్సిందే. మరో విధంగా చెప్పాలంటే శివరాజ్ కేవలం ఒక ప్రొఫెషనల్ గార్డు మాత్రమే కాదు ఆమె కుటుంబానికి అంతకుమించిన ఆత్మీయుడు కూడా. 2015లో శివరాజ్ పెళ్లికి కూడా ఐశ్వర్య హాజరు కావడం విశేషం. ఐశ్వర్యతోపాటు ఆమె కుటుంబాన్ని రక్షించడంలో అంతటి అభిమానాన్ని సంపాదించుకున్నాడు. మరి అంతటి నమ్మకమైన అంగరక్షకుడు శివరాజ్ ఉంటే ఐశ్యర్య ఎక్కడ ఎలాంటి షోలకు, ప్రదర్శనకు వెళ్లినా నిశ్చింతగా ఉంటుందట. అంతటి నమ్మకస్తుడైన బాడీగార్డ్ శివరాజ్‌కు నెలకు దాదాపు 7 లక్షల రూపాయల వేతనం లభిస్తుందట. అంటే అతని వార్షిక జీతం సుమారు రూ. 84 లక్షలు. అగ్రశ్రేణి బహుళజాతి కంపెనీలలో పనిచేస్తున్న పలువురు కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌ల జీత ప్యాకేజీల కంటే ఈ మొత్తం ఎక్కువ. అంతేకాదు ఐశ్వర్య బృందంలోని మరో భద్రతా నిపుణుడు రాజేంద్ర ధోలే వార్షిక ఆదాయం రూ. కోటి వరకు ఉంటుందని పలు నివేదికల ద్వారా తెలుస్తోంది.సెలబ్రిటీ బాడీగార్డ్‌గా ఉండటం అంత సులభం కాదు. ఎంతో అప్రమత్తత, ఓర్పు ఉండాలి. క్లిష్టమైన సమయాల్లో అభిమానుల అభిమానానికి భంగం కలగకుండా, ఆమె రక్షణ బాధ్యతను నిర్వర్తించడం కత్తిమీద సామే. ఈ రిస్క్‌లు , బాధ్యతల నేపథ్యంలో సెలబ్రిటీల వ్యక్తిగత భద్రతా సిబ్బందికి అంతటి ఆకర్షణీయమైన జీతాలు లభించడంలో ఆశ్చర్యం ఏముంటుంది.1973, నవంబరు ఒకటిన పుట్టిన ఐశ్వర్య రాయ్ 1994లో విశ్వసుందరిగా ఎంపికైంది. మోడల్‌గా, యాడ్ ఫిల్సింలో నటిస్తూ, బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి అనేక హిట్ మూవీలతో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. అనేక అవార్డులు సొంతం చేసుకుంది. 2007 ఏప్రిల్‌లో బాలివుడ్ హీరో అభిషేక్ బచ్చన్‌ను పెళ్లాడింది. వీరికి 2011, నవంబరులో కుమార్తె ఆరాధ్య పుట్టింది.
నా పిల్లలు భారత్‌లోనే పెరగాలి ఎందుకంటే..? వైరల్‌గా అమెరికన్ తల్లి పోస్ట్
ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ ఎన్కౌంటర్.. అగ్ర నేత రేణుక మృతి
కొత్త లోన్ రూల్.. రేపటి నుంచే..
రూ.3 కోట్ల ఆఫర్.. అక్కర్లేదని రిజెక్ట్ చేశాం: శివబాలాజీ దంపతులు
మోనాలిసాకి ఆఫర్ ఇచ్చిన డైరెక్టర్ అరెస్ట్
సమ్మర్ : ఉదయాన్నే ఈ ఫ్రూట్స్ తీసుకుంటే యవ్వనంగా మెరిసిపోవాల్సిందే!
మోదీ రిటైర్మెంట్.. మాకు ఆ అవసరమే లేదు!
వేసవిలో అక్కడకు వెళితే మాడి మసైపోతారు
'సర్దార్2' నుంచి ప్రోలాగ్ వీడియో.. భారీ యాక్షన్ సీన్స్‌లో కార్తి
వాహనదారులకు షాక్.. ORRపై టోల్ ఛార్జీలు పెంపు
ఇప్పటిదాకా ఆరు అక్రమ కేసులు.. దేనికైనా రెడీ: కాకాణి
IPL 2025: బోణీ కొట్టిన రాజస్తాన్ రాయల్స్..
మయన్మార్‌లో దారుణ పరిస్థితులు.. రెస్య్కూ వేళ వైమానిక దాడులు!
పవన్ అసమర్థుడినని తానే ఒప్పుకున్నాడు: అంబటి
బెట్టింగ్ యాప్స్‌పై సిట్ ఏర్పాటు.. డీజీపీ కీలక ఆదేశాలు
HCU భూములపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన
Riyan Parag: మ్యాచ్ గెలిచినా సుఖం లేదు..!
‘HCU విద్యార్థులపై లాఠీచార్జ్.. 400 ఎకరాలు అమ్మి రాష్ట్రాన్ని పాలిస్తారా?’
రాజకీయ ప్రకంపనలు.. మూడోసారి అధికారంపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
పిల్లలు వద్దనుకున్నాం.. కారణం ఇదే: హరీశ్ శంకర్
నా పిల్లలు భారత్‌లోనే పెరగాలి ఎందుకంటే..? వైరల్‌గా అమెరికన్ తల్లి పోస్ట్
ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ ఎన్కౌంటర్.. అగ్ర నేత రేణుక మృతి
కొత్త లోన్ రూల్.. రేపటి నుంచే..
రూ.3 కోట్ల ఆఫర్.. అక్కర్లేదని రిజెక్ట్ చేశాం: శివబాలాజీ దంపతులు
మోనాలిసాకి ఆఫర్ ఇచ్చిన డైరెక్టర్ అరెస్ట్
సమ్మర్ : ఉదయాన్నే ఈ ఫ్రూట్స్ తీసుకుంటే యవ్వనంగా మెరిసిపోవాల్సిందే!
మోదీ రిటైర్మెంట్.. మాకు ఆ అవసరమే లేదు!
వేసవిలో అక్కడకు వెళితే మాడి మసైపోతారు
'సర్దార్2' నుంచి ప్రోలాగ్ వీడియో.. భారీ యాక్షన్ సీన్స్‌లో కార్తి
వాహనదారులకు షాక్.. ORRపై టోల్ ఛార్జీలు పెంపు
ఇప్పటిదాకా ఆరు అక్రమ కేసులు.. దేనికైనా రెడీ: కాకాణి
IPL 2025: బోణీ కొట్టిన రాజస్తాన్ రాయల్స్..
మయన్మార్‌లో దారుణ పరిస్థితులు.. రెస్య్కూ వేళ వైమానిక దాడులు!
పవన్ అసమర్థుడినని తానే ఒప్పుకున్నాడు: అంబటి
బెట్టింగ్ యాప్స్‌పై సిట్ ఏర్పాటు.. డీజీపీ కీలక ఆదేశాలు
HCU భూములపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన
Riyan Parag: మ్యాచ్ గెలిచినా సుఖం లేదు..!
‘HCU విద్యార్థులపై లాఠీచార్జ్.. 400 ఎకరాలు అమ్మి రాష్ట్రాన్ని పాలిస్తారా?’
రాజకీయ ప్రకంపనలు.. మూడోసారి అధికారంపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
పిల్లలు వద్దనుకున్నాం.. కారణం ఇదే: హరీశ్ శంకర్
సినిమా

'సికిందర్' తొలిరోజు కలెక్షన్స్.. మరీ ఇంత తక్కువా?
సల్మాన్ ఖాన్ లేటెస్ట్ మూవీ సికిందర్. రష్మిక హీరోయిన్. ఈద్ సందర్భంగా ఆదివారం (మార్చి 30) థియేటర్లలో రిలీజైంది. మొదటి ఆట నుంచి దీనికి నెగిటివ్ టాక్ బయటకొచ్చింది. రొట్టకొట్టుడు స్టోరీకి తోడు సల్మాన్ యాక్టింగ్ నీరసంగా ఉందనే కామెంట్స్ వినిపించాయి. మరి తొలిరోజు కలెక్షన్స్ ఎన్నికోట్లు వచ్చాయి?(ఇదీ చదవండి: 'మ్యాడ్ స్క్వేర్' మూడు రోజుల కలెక్షన్లు)చాలా ఏళ్లుగా సల్మాన్ సినిమాలు చేస్తున్నాడు. కానీ ఒక్కటంటే ఒక్కటీ హిట్ అవ్వట్లేదు. దీంతో ఈ సారి తమిళ దర్శకుడు ఏఆర్ మురగదాస్ తో కలిసి సికిందర్ తీశాడు. హిట్ బ్యూటీ రష్మిక ఉండటంతో కాస్త అంచనాలు ఏర్పడ్డాయి. కానీ టీజర్, ట్రైలర్ దెబ్బకు మూవీపై ఉన్న హైప్ అంతా పోయింది. సినిమా కూడా అలానే ఉందని, చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు. ఇకపోతే రిలీజ్ కి ముందు రోజు అంటే శనివారం రాత్రి.. సికిందర్ పైరసీ హెచ్ డీ ప్రింట్ పలు వెబ్ సైట్లలో దర్శనమిచ్చింది. అలా ప్రతికూల అంశాలతో రిలీజైన ఈ మూవీకి తొలిరోజు కేవలం రూ.26 కోట్లు మాత్రమే వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. సల్మాన్ లాంటి స్టార్ హీరో.. తొలిరోజు ఈ వసూళ్లు అంటే చాలా తక్కువనే చెప్పాలి. మరి ఓవరాల్ గా ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: కాస్ట్ లీ కారు కొన్న ప్రభాస్ హీరోయిన్.. రేటు ఎంతంటే?)

మరో నటుడితో ఫోటోలు.. ఇందుకే నీ భర్త నిన్నొదిలేశాడు.. నటిపై ట్రోలింగ్
స్నేహాన్ని కూడా ప్రేమగా ముద్ర వేస్తున్నారు. పెళ్లయ్యాక అబ్బాయితో స్నేహాన్ని కొనసాగిస్తే దానికి రకరకాల పేర్లు పెట్టి తనను విమర్శించారంటోంది హిందీ బుల్లితెర నటి బర్కా బిష్త్ (Barkha Bisht). బుల్లితెరపై అనేక సీరియల్స్ చేసిన ఈమె పీఎమ్ నరేంద్రమోదీ, 1920: హారర్స్ ఆఫ్ ద హార్ట్, సేఫ్డ్, ఖదాన్ వంటి పలు చిత్రాలతో వెండితెరపైనా మెరిసింది. 2008లో నటుడు ఇంద్రనీల్ సేన్‌గుప్తాను పెళ్లాడగా వీరికి ఓ కూతురు పుట్టింది. 2022లో వీరు విడాకులు తీసుకున్నారు. అనంతరం నటుడు, నిర్మాత ఆశిష్ శర్మతో ప్రేమాయణం నడుపుతున్నట్లు వార్తలు వైరలవుతున్నాయి!కొందరు స్పెషల్తాజాగా బర్క బిష్త్ మాట్లాడుతూ.. కరణ్ (Karan Veer Mehra), నేను ఏళ్లతరబడి స్నేహాన్ని కొనసాగిస్తున్నాం. కానీ, జనాలు మమ్మల్ని తప్పుగా అనుకుంటున్నారు. మా మధ్య ఏదో ఉందన్నట్లుగా మాట్లాడుకుంటూనే ఉన్నారు. కానీ మన జీవితంలో మనకంటూ స్పెషల్ అనేవాళ్లుంటారు. అలా నా లైఫ్‌లో నాకు కరణ్ వీర్ మెహ్రా ఉన్నాడు. మా గురించి ఎప్పుడూ ఏదో ఒక పుకారు వస్తూనే ఉంటుంది. జనాలు నన్ను విమర్శిస్తూనే ఉంటారు. దారుణమైన ట్రోలింగ్ముఖ్యంగా బిగ్‌బాస్ షోలో కరణ్‌ను సపోర్ట్ చేయడానికి వెళ్లినప్పుడు నన్ను దారుణంగా ట్రోల్ చేశారు. కరణ్ వెంట తిరుగుతున్నందుకే నా పెళ్లి పెటాకులైందని తిట్టిపోశారు. అతడు, నేను కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినప్పుడు.. అసలు దీనికి నీ భర్త ఎలా ఒప్పుకున్నాడు? అంటూ ఆగ్రహించేవారు అని చెప్పుకొచ్చింది.డేటింగ్.. అంత టైం లేదుఆశిష్తో లవ్ రూమర్స్‌పై స్పందిస్తూ.. కష్ట సమయంలో అతడు నాకు కనెక్ట్ అయ్యాడు. జనాలు మేము డేటింగ్ చేస్తున్నామని అనుకుంటున్నారు. నిజంగా ప్రేమలో ఉంటే దాన్ని దాచాల్సిన అవసరం నాకు లేదు. ప్రస్తుతం నా దృష్టంతా నా 13 ఏళ్ల కూతురు మైరాపైనే ఉంది. ప్రేమ పాటలు పాడుకునేంత ఆసక్తి, సమయం లేదు అని బర్క పేర్కొంది.చదవండి: బ్యాంకాక్‌లో భూకంపం.. ఇప్పటికీ నా చేతులు వణుకుతున్నాయి

కాస్ట్ లీ కారు కొన్న ప్రభాస్ హీరోయిన్.. రేటు ఎంతంటే?
పేరుకే హిందీ హీరోయిన్ గానీ దక్షిణాదిలోనూ ఈమె పర్వాలేదనిపించే ఫ్యాన్ బేస్ ఉంది. గతంలో ప్రభాస్ పక్కన సాహో మూవీలో హీరోయిన్ గానూ చేసింది. ప్రస్తుతానికైతే పూర్తి ఫోకస్ హిందీపైనే ఉంది. గతేడాది 'స్త్రీ 2'తో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు ఖరీదైన కారు కొనుగోలు చేసింది. ఇంతకీ దీని రేటు ఎంతంటే?(ఇదీ చదవండి: 'జయం' సినిమాలో హీరోయిన్ రష్మీ గౌతమ్.. చివర్లో: నితిన్)తండ్రి నటుడు కావడంతో సులభంగానే ఇండస్ట్రీలోకి వచ్చిన శ్రద్ధా కపూర్.. ఆచితూచి సినిమాలు చేస్తోంది. స్త్రీ 2 తర్వాత మరో కొత్త ప్రాజెక్ట్ ఓకే చేసినట్లు లేదు. అలా అని ఖాళీగా లేదు. అపార్ట్ మెంట్స్ కొనడం, అమ్మడం లాంటివి చేస్తూ డబ్బులు సంపాదిస్తున్న ఈ బ్యూటీ.. లగ్జరీ లైఫ్ మెంటైన్ చేస్తుందని చెప్పొచ్చు.రెండేళ్ల క్రితం దాదాపు రూ.4 కోట్ల విలువైన లాంబోర్గిని కారుని కొనుగోలు చేయగా.. ఇప్పుడు రూ.2.93 కోట్ల విలువ చేసే లెక్సెస్ ఎల్ఎమ్ 350హెచ్ అనే లగ్జరీ కారుని కొనేసింది. చాలామంది స్టార్స్ ప్రస్తుతం ఈ మోడల్ కారునే ఉపయోగిస్తుండటం విశేషం. ఇప్పుడు శ్రద్ధా కూడా ఆ లిస్టులోకి చేరిపోయిందని చెప్పొచ్చు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీలో వచ్చే సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇవే) View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani)

బ్యాంకాక్‌లో భూకంపం.. ఇప్పటికీ నా చేతులు వణుకుతున్నాయి: నటి
మయన్మార్, థాయ్‌లాండ్‌లో సంభవించిన భూకంపం (Myanmar, Thailand Earthquake) రెండు దేశాలను అతలాకుతలం చేసింది. పలు నగరాల్లో భవనాలు పేకమేడల్లా కుప్పకూలిపోయాయి. ఆ శిథిలాల కింద మృతదేహాలు కుళ్లిపోతున్నాయి. భూకంపం సృష్టించిన విధ్వంసంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇప్పటికీ ఆ షాక్‌లో నుంచి తేరుకోలేకపోతున్నారు.నా చేతులు ఇంకా వణుకుతున్నాయిబ్యాంకాక్లో భూకంపం వచ్చినప్పుడు మలయాళ బుల్లితెర నటి, యాంకర్ పార్వతి కృష్ణ (Parvathy Krishna) అక్కడే ఉంది. తాజాగా ఆమె తన అనుభవాన్ని సోషల్ మీడియాలో రాసుకొచ్చింది. ఇప్పటికీ నా చేతులు వణుకుతున్నాయి. ఇంకా నేను బతికే ఉన్నందుకు సంతోషంగా ఉంది. నా జీవితంలో అతి భయంకరమైన భూకంపం చూశాను. బ్యాంకాక్‌లో 7.7 తీవ్రతతో భూకంపం సంభవించడంతో అందరూ షాకయ్యారు. నా కళ్లముందే భారీ భవనాలు నేలకొరిగాయి. ఎక్కడ చూసినా హాహాకారాలేజనాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటకు పరుగులు తీశారు. ఎక్కడచూసినా హాహాకారాలే! ఎక్కడికైనా వెళ్దామంటే రవాణా వ్యవస్థ కూడా స్థంభించిపోయింది. ఎవరి ముఖం చూసినా భయమే కనిపిస్తోంది. ఆ సమయంలో నేను ప్రేమించినవాళ్లను తల్చుకున్నాను. నా కుటుంబానికి ఫోన్ చేసి మాట్లాడాను. ఎట్టకేలకు ఫ్యామిలీతో అయినా మాట్లాడినందుకు సంతృప్తిగా అనిపించింది.లైఫ్‌లో సెకండ్ ఛాన్స్భూకంపం క్షణాల్లో అంతా మార్చేసింది. జీవితంలో నాకు సెకండ్ ఛాన్స్ దొరికినట్లుగా ఉంది. బతకడానికి మరో అవకాశం దొరికినందుకు, అందరినీ కలిసే అదృష్టం దక్కినందుకు ఆనందంగా ఉంది. భూకంపం వల్ల ప్రభావితులైనవారిని తలుచుకుంటేనే బాధగా ఉంది. ఈ కష్టసమయాన్ని దాటేందుకు మీరు ధైర్యం కూడదీసుకోవాలని కోరుకుంటున్నాను అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది. అలాగే వీలైనంత త్వరగా తాను ఇండియాకు తిరిగిరావడానికి సహకరించినవారికి కృతజ్ఞతలు తెలిపింది. పార్వతి.. మాలిక్, ఏంజెల్స్, వర్షంగళ్కు శేషం, గ్ర్ర్.. సినిమాల్లో నటించింది. View this post on Instagram A post shared by PARVATHY KRISHNA (@parvathy_r_krishna)చదవండి: 'జయం' సినిమాలో హీరోయిన్ రష్మీ గౌతమ్.. చివర్లో: నితిన్
న్యూస్ పాడ్‌కాస్ట్

బడుగుల ఆలోచన ఆ పూట వరకే. ఎస్సీ, బీసీ వర్గాలపై చంద్రబాబు అక్కసు

ఆంధ్రప్రదేశ్‌లో వలంటీర్లను దగా చేసిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం... రోడ్డున పడిన 2 లక్షల 66 వేల కుటుంబాలు

థాయ్‌లాండ్, మయన్మార్‌లో భారీ భూకంపం... పేకమేడల్లా కూలిన భవనాలు... రెండు దేశాల్లో ఇప్పటికే 200 దాటిన మృతుల సంఖ్య.. ఇండియా, చైనాలోనూ భూప్రకంపనలు

హిందూ ధర్మంపై వీరికి మాట్లాడే హక్కుందా?... ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం

ఎలాగైనా ఉత్తీర్ణత పెంచాల్సిందే... ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయులపై తీవ్ర ఒత్తిళ్లు..

పెద్దల మెప్పు కోసం పని చేయొద్దు, పోలీసుల తీరు చూస్తుంటే మాకు బీపీ పెరిగిపోతోంది... మాదిగ మహాసేన వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రేమ్‌కుమార్ అరెస్ట్‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆగ్రహం

అరటి రైతును ఆదుకోవాలి. కూటమి ప్రభుత్వమే పూర్తిస్థాయిలో పరిహారం అందించాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్

ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని నిర్మాణం పేరిట సిండికేట్ లూటీ... సన్నిహితులైన కాంట్రాక్టర్లతో ప్రభుత్వ పెద్దల కుమ్మక్కు...

25 ఏళ్లపాటు నియోజకవర్గాల పునర్విభజన చేపట్టొద్దు... చెన్నైలో జేఏసీ తొలి సమావేశంలో తీర్మానం

ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు కూటమి ప్రభుత్వ పాలనలో ఉద్యోగాలు మాయం... దాదాపు 2 లక్షల మేర తగ్గిపోయిన ఉద్యోగుల సంఖ్య
క్రీడలు

RR VS CSK: మేము చరుగ్గా లేము.. అందుకు సంతోషమే: రుతురాజ్
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా రెండో ఓటమి మూటగట్టుకుంది. నిన్న (మార్చి 30) రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 పరుగుల స్వల్ప తేడాతో ఓటమిపాలైంది. గౌహతిలో జరిగిన ఈ ఉత్కంఠ పోరులో రాయల్స్ కీలకమైన క్షణాలన్నిటినీ అధిగమించి విజేతగా నిలిచింది. ఈ సీజన్లో రాయల్స్‌కు ఇది తొలి విజయం.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్స్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. వాస్తవానికి ఈ మ్యాచ్‌లో రాయల్స్ ఇంకా భారీ స్కోర్ చేసుండాల్సింది. నితీశ్ రాణా (36 బంతుల్లో 81; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) రాయల్స్‌కు మెరుపు ఆరంభాన్ని అందించాడు. అయితే మిగతా బ్యాటర్ల నుంచి పెద్దగా సహకారం లేకపోవడంతో రాయల్స్ ఊహించిన దానికంటే 20-30 పరుగులు తక్కువ చేసింది. రాయల్స్ ఇన్నింగ్స్‌లో నితీశ్‌తో పాటు శాంసన్ (16 బంతుల్లో 20; ఫోర్, సిక్స్), రియాన్ పరాగ్ (28 బంతుల్లో 37; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), హెట్‌మైర్ (16 బంతుల్లో 19; ఫోర్, సిక్స్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. నితీశ్‌ను ఔట్ చేశాక సీఎస్కే పరిస్థితులను తమ అదుపులోకి తెచ్చుకుంది. పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు వరుస విరామాల్లో వికెట్లు తీసింది. నూర్ అహ్మద్ (4-0-28-2), పతిరణ (4-0-28-2) మరోసారి అద్భుతమైన స్పెల్స్ వేశారు. ఖలీల్ అహ్మద్ (4-0-38-2) పర్వాలేదనిపించాడు. జడ్డూ, అశ్విన్ తలో వికెట్ తీశారు. ఓవర్టన్ (2-0-30-0), అశ్విన్ (4-0-46-1) ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన సీఎస్కేకు ఆదిలోనే షాక్ తగిలింది. ఇన్ ఫామ్ బ్యాటర్ రచిన్ రవీంద్రను ఈ సీజన్లో చెత్త ఫామ్‌లో ఉన్న జోఫ్రా ఆర్చర్ డకౌట్ చేశాడు. అనంతరం రుతురాజ్ (44 బంతుల్లో 63; 7 ఫోర్లు, సిక్స్) పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అయితే అతనికి మరో ఎండ్ నుంచి ఎలాంటి సహకారం లభించలేదు. హసరంగ (4-0-35-4) తన స్పెల్ ప్రతి ఓవర్లో వికెట్ తీసి సీఎస్కేను ఇరకాటంలో పడేశాడు. సీఎస్కే గెలుపుకు చివరి 3 ఓవర్లలో 45 పరుగులు కావాల్సి ఉండింది. ధోని, జడ్డూ క్రీజ్‌లో ఉన్నారు. వీరిద్దరు నిలబడితే సీఎస్కే ఎలాగైనా గెలుస్తుందని అంతా అనుకున్నారు. అయితే ఇక్కడే తీక్షణ మ్యాజిక్ చేశాడు. 18వ ఓవర్లో అతను కేవలం 6 పరుగులే ఇచ్చి సీఎస్కేకు లక్ష్యాన్ని మరింత దూరం చేశాడు. 19వ ఓవర్లో తుషార్ దేశ్‌పాండే బౌలింగ్‌లో జడ్డూ, ధోని చెలరేగగా (బౌండరీ, 2 సిక్సర్లు) చివరి ఓవర్లో సీఎస్కే లక్ష్యం 20 పరుగులుగా మారింది. ఈ మ్యాచ్‌లో అద్భుతంగా బౌలింగ్ చేసిన ఆర్చర్‌కు (3-1-13-1) చివరి ఓవర్ ఇవ్వకుండా రాయల్స్ కెప్టెన్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు. ఆర్చర్‌కు బదులుగా సందీప్ శర్మను నమ్ముకోగా.. అతను కెప్టెన్ నమ్మకాన్ని నిలబెట్టాడు. తొలి బంతికే ధోని వికెట్ తీసి ఆతర్వాత రెండు బంతులను సింగిల్స్ మాత్రమే ఇచ్చాడు. దీంతో సీఎస్కే గెలుపుకు చివరి మూడు బంతుల్లో మూడు సిక్సర్లు అవసరమయ్యాయి. అక్కడికీ ఓవర్టన్ నాలుగో బంతికి సిక్సర్ బాది సీఎస్కే గెలుపు ఆశలను సజీవంగా ఉంచాడు. అయితే ఐదో బంతికి రెండు పరుగులే రావడంతో సీఎస్కే ఓటమి ఖరారైపోయింది. చివరి ఓవర్‌ను సందీప్ శర్మకు ఇవ్వడంతో టెన్షన్ పడ్డ రాయల్స్ అభిమానులు చివరికి ఊపిరి పీల్చుకున్నారు. ఎట్టకేలకు (రెండు మ్యాచ్‌ల తర్వాత) రియాన్ పరాగ్ కెప్టెన్‌గా తన తొలి విజయాన్ని నమోదు చేశాడు. ఈ గెలుపు సొంత అభిమానుల మధ్య దక్కడం అతనికి మరింత స్పెషల్.మ్యాచ్ అనంతరం లూజింగ్ కెప్టెన్ రుతురాజ్ మాట్లాడుతూ ఇలా అన్నాడు. నితీశ్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. పవర్ ప్లేలో అతని ఆటతీరు అమోఘం. నితీశ్ ఎక్కువగా వెనుక భాగంలో షాట్లు ఆడుతున్నాడని తెలిసి కూడా మేము చురుగ్గా లేము. అతన్ని వికెట్‌కు ముందు ఆడించే ప్రయత్నం చేసుండాల్సింది. మిస్ ఫీల్డ్‌ల ద్వారా అదనంగా 8-10 పరుగులు సమర్పించుకున్నాము. ఫీల్డింగ్‌లో చాలా మెరుగుపడాలి. ఈ వికెట్‌పై 180 పరుగులు ఛేదించదగ్గ టార్గెటే. ఇన్నింగ్స్ బ్రేక్‌లో సంతోషపడ్డాను. వారు 210 పరుగులకు పైగా స్కోర్ చేస్తారని అనుకున్నాను. మా బౌలర్లు బాగా కంట్రోల్ చేశారు. జరగాల్సిన నష్టం ఆదిలోనే జరిగిపోయింది. మూడో స్థానంలో బ్యాటింగ్ చేయడంపై స్పందిస్తూ.. గత కొన్ని సీజన్లలో రహానే 3వ స్థానంలో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు రాయుడు మిడిల్ ఓవర్ల బాధ్యత తీసుకునేవాడు. నేను కూడా మిడిల్ ఓవర్ల బాధ్యత తీసుకోవడానికి కొంచెం ఆలస్యంగా వస్తే మంచిదని భావించాము. అయితే అది వర్కౌట్ కాలేదు. మూడు మ్యాచ్‌ల్లోనూ ఆట ప్రారంభంలోనే బ్యాటింగ్‌కు దిగాల్సి వచ్చింది. వేలం సమయంలోనే నేను మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగాలని నిర్ణయించబడింది. ఈ స్థానంలో బ్యాటింగ్ చేయడానికి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. దురదృష్టవశాత్తు ఈ సీజన్లో మాకు మంచి ఆరంభాలు లభించడం లేదు. ఒక్కసారి మా ఓపెనర్లిద్దరూ టచ్‌లోకి వస్తే పరిస్థితులు మారతాయి. ఎప్పటిలాగే నూర్ బాగా బౌలింగ్ చేశాడు. ఖలీల్, జడ్డూ కూడా సత్తా చాటారు. బౌలింగ్ విభాగంలో కొంత ఊపు అవసరం ఉంది. అందరం కలిసికట్టుగా రాణిస్తే మా జట్టుకు తిరుగుండదు.

ఆస్ట్రేలియాలో టీమిండియా పర్యటన.. షెడ్యూల్ విడుదల
ఈ ఏడాది చివర్లో భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఈ పర్యటనలో టీమిండియా పరిమిత ఓవర్ల సిరీస్‌లు ఆడనుంది. 3 వన్డేలు, 5 టీ20ల సిరీస్‌లు అక్టోబర్ 19న ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది హోం సమ్మర్ షెడ్యూల్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా నిన్న (మార్చి 30) విడుదల చేసింది. ఈసారి హోం సమ్మర్లో ఆస్ట్రేలియా ప్రతి రాష్ట్రాన్ని, టెరిటరీని కవర్ చేస్తుంది. దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఈ మ్యాచ్‌లు జరుగనున్నాయి.భారత్‌తో సిరీస్‌లకు ముందు ఆస్ట్రేలియా సౌతాఫ్రికాకు ఆతిథ్యమివ్వనుంది. సౌతాఫ్రికా.. ఆస్ట్రేలియాతో 3 టీ20లు, 3 వన్డేలు ఆడనుంది. ఆగస్ట్ 10న ఈ సిరీస్‌లు ప్రారంభం కానున్నాయి. ఈ సిరీస్‌లతో డార్విన్ అంతర్జాతీయ క్రికెట్ మైదానం పునఃప్రారంభం కానుంది. 17 ఏళ్ల క్రితం ఈ గ్రౌండ్లో అంతర్జాతీయ మ్యాచ్ ఆడారు. 2008లో ఈ మైదానం బంగ్లాదేశ్‌ను హోస్ట్ చేసింది. డార్విన్‌లో ఆస్ట్రేలియా సౌతాఫ్రికాతో తొలి రెండు టీ20లు ఆడనుంది. ఆతర్వాత మూడో టీ20, తొలి వన్డే కెయిన్స్‌లో జరుగనున్నాయి. చివరి రెండు వన్డేలు మెక్‌కేలో జరుగుతాయి.సౌతాఫ్రికాతో సిరీస్‌ల తర్వాత ఆసీస్ భారత్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లు ఆడుతుంది. ఈ రెండు సిరీస్‌లకు మధ్య దాదాపు రెండు నెలల గ్యాప్ ఉంది. భారత్‌తో సిరీస్‌ల అనంతరం ఆస్ట్రేలియా ఇంగ్లండ్‌తో యాషెస్ సిరీస్ ఆడుతుంది. ఈ సిరీస్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను ఇదివరకే విడుదల చేశారు. నవంబర్ 21న తొలి యాషెస్ టెస్ట్ పెర్త్‌లో జరుగనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరుగనున్న టీ20 వరల్డ్‌కప్‌ను దృష్టిలో పెట్టుకుని ఆస్ట్రేలియా.. సౌతాఫ్రికా, భారత్‌లతో టీ20 సిరీస్‌లను ప్లాన్ చేసింది.ఆస్ట్రేలియాలో సౌతాఫ్రికా పర్యటన షెడ్యూల్..ఆగస్ట్ 10- తొలి టీ20- డార్విన్ఆగస్ట్ 12- రెండో టీ20- డార్విన్ఆగస్ట్ 16- మూడో టీ20- కెయిన్స్ఆగస్ట్ 19- తొలి వన్డే (డే అండ్ నైట్)- కెయిన్స్ఆగస్ట్ 22- రెండో వన్డే (డే అండ్ నైట్)- మెక్కేఆగస్ట్ 24- మూడో వన్డే (డే అండ్ నైట్)- మెక్కేఆస్ట్రేలియాలో భారత్ పర్యటన షెడ్యూల్..అక్టోబర్ 19- తొలి వన్డే (డే అండ్ నైట్)- పెర్త్‌అక్టోబర్ 23- రెండో వన్డే (డే అండ్ నైట్)- అడిలైడ్‌అక్టోబర్ 25- మూడో వన్డే (డే అండ్ నైట్)- సిడ్నీఅక్టోబర్ 29- తొలి టీ20- కాన్‌బెర్రాఅక్టోబర్ 31- రెండో టీ20- మెల్‌బోర్న్‌నవంబర్ 2- మూడో టీ20- హోబర్ట్‌నవంబర్ 6- నాలుగో టీ20- గోల్డ్ కోస్ట్‌నవంబర్ 8- ఐదో టీ20- బ్రిస్బేన్

‘మయామి’ క్వీన్ సబలెంకా
ఫ్లోరిడా: ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్ హోదాకు తగ్గట్టు రాణించిన బెలారస్ టెన్నిస్ స్టార్ సబలెంకా తన కెరీర్లో 19వ సింగిల్స్ టైటిల్‌ను సాధించింది. ఆదివారం ముగిసిన మయామి ఓపెన్ డబ్ల్యూటీఏ–1000 లెవెల్ టోరీ్నలో సబలెంకా తొలిసారి చాంపియన్‌గా అవతరించింది. 88 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో టాప్ సీడ్ సబలెంకా 7–5, 6–2తో ప్రపంచ నాలుగో ర్యాంకర్ జెస్సికా పెగూలా (అమెరికా)పై గెలిచింది. విజేత సబలెంకాకు 11,24,380 డాలర్ల (రూ. 9 కోట్ల 61 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు... రన్నరప్ పెగూలాకు 5,97,890 డాలర్ల (రూ. 5 కోట్ల 11 లక్షలు) ప్రైజ్‌మనీ 650 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. టైటిల్ గెలిచే క్రమంలో సబలెంకా తన ప్రత్యర్థులకు ఒక్క సెట్ కూడా కోల్పోకపోవడం గమనార్హం. సబలెంకా సాధించిన 19 టైటిల్స్‌లో 17 టైటిల్స్ హార్డ్కోర్టులపై రావడం విశేషం.

Asian Wrestling 2025: భారత రెజ్లర్లకు మూడు పతకాలు
అమ్మాన్ (జోర్డాన్): ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో చివరిరోజు ఆదివారం భారత్‌కు మూడు పతకాలు లభించాయి. పురుషుల ఫ్రీస్టయిల్ విభాగంలో దీపక్ పూనియా (92 కేజీలు), ఉదిత్ (61 కేజీలు) రజత పతకాలు నెగ్గగా... దినేశ్ (125 కేజీలు) కాంస్య పతకాన్ని సాధించాడు. ఫైనల్స్‌లో దీపక్ పూనియా 0–10 పాయింట్ల తేడాతో అమీర్‌హుస్సేన్ (ఇరాన్) చేతిలో... ఉదిత్ 4–6 పాయింట్ల తేడాతో టకారా సుడా (జపాన్) చేతిలో ఓడిపోయారు. కాంస్య పతక బౌట్లో దినేశ్ తుర్క్మెనిస్తాన్ రెజ్లర్ సపరోవ్ను ఓడించాడు. ఆసియా చాంపియన్‌షిప్ చరిత్రలో 25 ఏళ్ల దీపక్ పూనియాకిది ఐదో పతకం కావడం విశేషం. 2021, 2022లలో రజతాలు నెగ్గిన దీపక్... 2019, 2020లలో కాంస్య పతకాలు సాధించాడు.
బిజినెస్

బ్యాంక్టెక్లో బిలియన్ డాలర్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: బ్యాంక్‌టెక్ రంగంలోకి పెట్టుబడులు 2027 నాటికి బిలియన్ డాలర్లకు (సుమారు రూ.8,600 కోట్లు) చేరతాయని వెంచర్ క్యాపిటల్ సంస్థ ‘సెడార్–ఐబీఎస్‌ఐ క్యాపిటల్’ తన అంచనాను వెల్లడించింది. 2030 నాటికి భారత్ 7 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించే క్రమంలో వృద్ధిని నడిపించడంలో బ్యాంకింగ్ రంగం కీలక పాత్ర పోషించనున్నట్టు తెలిపింది.విప్లవాత్మక టెక్నాలజీలు భారత్‌లో బ్యాంకింగ్ సేవలను సమూలంగా మార్చేస్తున్నట్టు సెడార్ ఐబీఎస్‌ఐ వ్యవస్థాపకుడు, ఎండీ సాహిల్ ఆనంద్ తెలిపారు. సంప్రదాయ బ్యాంకింగ్ సేవల్లో 80 శాతాన్ని ప్రస్తుతం డిజిటల్‌గా నిర్వహిస్తున్నట్టు ఓ పరిశోధన వివరాలను గుర్తు చేశారు. అందరికీ ఆర్థిక సేవలను చేరువ చేయడంలో టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తున్నట్టు చెప్పారు.వీటి ఫలితంగా మారుమూల ప్రాంతాల్లోని వారికీ బ్యాంకింగ్ సేవలు అందుతున్నట్టు పేర్కొన్నారు. బ్యాంకింగ్ రంగాన్ని డిజిటల్‌గా మార్చడంలో క్లౌడ్ కంప్యూటింగ్ కీలకంగా పనిచేస్తోందంటూ.. సేవల విస్తరణ, చురుకుదనం, వ్యయాల కట్టడి ప్రయోజనాలు దీంతో లభిస్తున్నట్టు వివరించారు. సురక్షితమైన, పారదర్శకమైన లావాదేవీలకు బ్లాక్‌చైన్ టెక్నాలజీ సాయపడుతన్నట్టు ఆనంద్ వెల్లడించారు.ముఖ్యంగా సప్లయ్ చైన్ ఫైనాన్స్, గుర్తింపు నిర్వహణలో ఇది ఎంతో మార్పును తీసుకొస్తున్నట్టు చెప్పారు. సెడార్–ఐబీఎస్‌ఐ క్యాపిటల్ ఇప్పటికే బ్యంక్టెక్ రంగంలో రెండు లావాదేవీలతో మొత్తం రూ.240 కోట్ల పెట్టుబడులు పెట్టిందని.. తమ పోర్ట్‌ఫోలియోని 10–15 స్టార్టప్‌లకు విస్తరించనున్నట్టు ఆనంద్ ప్రకటించారు.

ఇండస్‌ఇండ్‌పై ఆర్‌క్యాప్ రుణదాతల పిటిషన్ వాపస్
న్యూఢిల్లీ: జాతీయ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ)లో ఇండస్ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్(ఐఐహెచ్ఎల్)పై దాఖలు చేసిన పిటిషన్‌ను రిలయన్స్ కాపిటల్ రుణదాతల కమిటీ (సీఓసీ) ఉపసంహరించుకుంది. పూర్తిగా చెల్లింపులు జరిపి ఇందుకు సంబంధించి నిర్దిష్ట ప్రణాళికను అమలు చేసినందున, ఐఐహెచ్ఎల్పై పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు అపీలేట్ ట్రిబ్యునల్‌కు ఆర్‌క్యాప్ సీఓసీ తెలిపింది. సీఓసీ పిటిషన్‌ను జస్టిస్ యోగేష్ ఖన్నా, జస్టిస్ అజయ్ దాస్ మెహ్రోత్రాలతో కూడిన ట్రిబ్యునల్ ద్విసభ్య థర్మాసనం ఆమోదించింది. కేసు వివరాల్లోకి వెళితే, దివాలా కోడ్ చట్టం కింద ఐఐహెచ్ఎల్ ఆర్థిక సేవల సంస్థ– రిలయన్స్ క్యాపిటల్ కొనుగోలుకు 2023 ఏప్రిల్‌లో రూ.9,650 కోట్లతో అత్యధిక బిడ్‌ను నమోదుచేసింది. దీని ప్రకారం దివాలా పరిష్కార ప్రణాళికను ఐఐహెచ్ఎల్ 2924 మే 27 లోపు పూర్తి చేయాల్సి ఉంది. అటు తర్వాత ఈ కాల పరిమితిని 2024 ఆగస్టు 10 వరకూ పొడిగించడం జరిగింది.

వొడాఫోన్‌లో ప్రభుత్వ వాటా అప్
న్యూఢిల్లీ: రుణ భారంతో కుదేలైన మొబైల్ టెలికం దిగ్గజం వొడాఫోన్ ఐడియాలో తాజాగా ప్రభుత్వం రూ. 36,950 కోట్ల విలువైన షేర్లను సొంతం చేసుకోనుంది. దీంతో కంపెనీలో ప్రభుత్వ వాటా 48.99 శాతానికి బలపడనున్నట్లు వొడాఫోన్ ఐడియా తాజాగా పేర్కొంది. ఇప్పటికే కంపెనీలో 22.6 శాతం వాటాతో ప్రభుత్వం అతిపెద్ద వాటాదారుగా నిలుస్తోంది. ప్రమోటర్లుగా కంపెనీలో వొడాఫోన్ గ్రూప్ 14.76 శాతం, ఆదిత్య బిర్లా గ్రూప్ 22.56 శాతం చొప్పున వాటాలు కలిగి ఉన్నాయి. తాజా పెట్టుబడులతో ప్రభుత్వం ప్రమోటర్ల సంయుక్త వాటాను సైతం అధిగమించనుంది. కమ్యూనికేషన్ల శాఖ 2021 సెప్టెంబర్‌లో ప్రకటించిన టెలిరం రంగ సహాయక ప్యాకేజీలో భాగంగా ప్రభుత్వం రూ. 36,950 కోట్లను ఈక్విటీ షేర్లుగా మారి్పడి చేసుకుంటున్నట్లు వొడాఫోన్ ఐడియా తాజాగా వెల్లడించింది. వెరసి కంపెనీ 30 రోజుల్లోగా ప్రభుత్వానికి 3,695 కోట్ల ఈక్విటీ షేర్లు జారీ చేయనుంది. 2026కల్లా వొడాఫోన్ ఐడియా చెల్లించవలసిన స్పెక్ట్రమ్, స్థూల ఆదాయ సర్దుబాటు(ఏజీఆర్) విలువ రూ. 32,724 కోట్లుకాగా.. ప్రభుత్వానికి తాజాగా ఈక్విటీ జారీ చేయనుంది.

మార్కెట్‌కు గణాంకాలే కీలకం
ముంబై: దేశీ స్టాక్ మార్కెట్లలో ట్రెండ్ ఈ వారం ప్రధానంగా గణాంకాలపై ఆధారపడనుంది. దేశ, విదేశీ తయారీ, సర్వీసు రంగ గణాంకాలు ఈ వారంలో విడుదలకానున్నాయి. దీనికితోడు పలు దేశాలపై యూఎస్ ప్రభుత్వ తాజా టారిఫ్‌లు బుధవారం(2)నుంచి అమల్లోకి రానున్నాయి. వెరసి ఈ వారం మార్కెట్లు ఆటుపోట్లను చవిచూసే వీలున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. రంజాన్ పర్వదినం సందర్భంగా నేడు(31న) స్టాక్ మార్కెట్లు పనిచేయవు. దీంతో ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితంకానుంది. ఇతర వివరాలు చూద్దాం.జీడీపీ ఎఫెక్ట్ గత కేలండర్ ఏడాది(2024) చివరి త్రైమాసికం(అక్టోబర్–డిసెంబర్)లో యూఎస్ జీడీపీ అంచనాలకు అనుగుణంగా నెమ్మదించింది. తుది అంచనాల ప్రకారం వార్షిక ప్రాతిపదికన వృద్ధి 3.1 శాతం నుంచి 2.4 శాతానికి మందగించింది. అయితే కొత్త ప్రెసిడెంట్ ట్రంప్ తెరతీస్తున్న టారిఫ్‌లు ఆర్థిక వ్యవస్థకు మరిన్ని సవాళ్లు విసరనున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. బిజినెస్ ప్రణాళికలు, కన్జూమర్ వినియోగం తదితరాలపై ప్రతికూల ప్రభావం చూపే వీలున్నట్లు పేర్కొన్నారు. వెరసి ఈ ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలపై ప్రసరించనున్నట్లు అభిప్రాయపడ్డారు. సుంకాలపై కన్ను ఈ వారం అమల్లోకిరానున్న ట్రంప్ సుంకాల(టారిఫ్‌లు)పై ప్రపంచవ్తాప్తంగా ఇన్వెస్టర్లు దృష్టిసారించనున్నట్లు మెహతా ఈక్విటీస్ రీసెర్చ్ సీనియర్ వీపీ ప్రశాంత్ తాప్సే పేర్కొన్నారు. వీటితోపాటు గణాంకాలను సైతం పరిగణనలోకి తీసుకోనున్నట్లు జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయ్‌కుమార్ తెలియజేశారు. మార్కెట్ ప్రభావిత అంశాలు కరవుకావడంతో గణాంకాలు, కీలక వాణిజ్య దేశాలపై యూఎస్ టారిఫ్‌లకు ప్రాధాన్యత ఏర్పడినట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా సైతం వివరించారు. అయితే గతేడాది క్యూ4 జీడీపీ నీరసించిన నేపథ్యంలో ట్రంప్ ప్రభుత్వం టారిఫ్‌లపై కఠినంగా వ్యవహరించకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడ్డారు. హెచ్ఎస్బీసీ పీఎంఐ బుధవారం మార్చి నెలకు హెచ్ఎస్బీసీ ఇండియా తయారీ పీఎంఐ గణాంకాలు వెల్లడికానున్నాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం 56.3 నుంచి 57.6కు బలపడింది. అయితే శుక్రవారం(4న) విడుదలకానున్న మార్చి సర్వీసుల రంగ ఇండెక్స్ తొలి అంచనాలలో 59 నుంచి 57.7కు బలహీనపడింది. కాంపోజిటల్ పీఎంఐ సైతం 58.8 నుంచి 58.6కు స్వల్పంగా వెనకడుగు వేసింది. ఇక విదేశీ మారక నిల్వల వివరాలు సైతం 4న వెల్లడికానున్నాయి. ఇక ప్రపంచ దేశాలలో చైనా ఎన్బీఎస్, కైగ్జిన్ తయారీ గణాంకాలు మార్చి నెలకు సోమవారం(నేడు), మంగళవారం(1న) విడుదలకానున్నాయి. ఈ బాటలో ఫిబవ్రరి నెలకు యూరో దేశాల రిటైల్ ధరల ద్రవ్యోల్బణ రేటు 1న వెల్లడికానుంది. ఫిబ్రవరిలో కన్జూమర్ ధరల రేటు తొలి అంచనాల ప్రకారం 2.3 శాతంగా నమోదైంది. ఇదేరోజు యూఎస్ ఫిబ్రవరి ఐఎస్ఎం తయారీ ఇండెక్స్, ఉపాధి కల్పన గణాంకాలు విడుదలకానున్నాయి. 3న యూఎస్ ఐఎస్ఎం సర్వీసుల పీఎంఐ వెల్లడికానుంది. వారాంతాన(4న) వ్యవసాయేతర ఉపాధి, నిరుద్యోగిత గణాంకాలు వెల్లడికానున్నాయి. ఇతర అంశాలు టారిఫ్‌లు, గణాంకాలతోపాటు.. ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లలో పలు ఇతర అంశాలు సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు విశ్లేషకులు వివరించారు. గతేడాది(2024) అక్టోబర్ నుంచీ అమ్మకాల యూటర్న్ తీసుకున్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) ఉన్నట్టుండి గత వారం నికర పెట్టుబడిదారులుగా స్టాక్స్ కొనుగోలు చేశారు. అయితే వారాంతాన(28న) తిరిగి భారీగా అమ్మకాలు చేపట్టారు. దీంతో ఎఫ్‌పీఐల పెట్టుబడులు లేదా అమ్మకాలకు ప్రాధాన్యత ఉన్నట్లు తెలియజేశారు. ఇదేసమయంలో డాలరు ఇండెక్స్ బలహీనపడటం, దేశీ కరెన్సీ ఒక్కసారిగా బలపడటం మార్కెట్లకు జోష్నిచి్చనట్లు పేర్కొన్నారు. దిగుమతుల బిల్లుపై ప్రభావం చూపే ముడిచమురు ధరలు వెనకడుగు వేస్తున్నప్పటికీ బంగారం ధరలు మెరుస్తుండటం కొంత ప్రతికూలమేనని తెలియజేశారు.గత వారమిలా.. గత వారం(24–28) దేశీ స్టాక్ మార్కెట్లు ఆటుపోట్ల మధ్య నికరంగా లాభపడ్డాయి. సెన్సెక్స్ 509 పాయింట్లు(0.7 శాతం) పుంజుకుని 77,415 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 169 పాయింట్లు(0.7%) బలపడి 23,519 వద్ద నిలిచింది. అయితే తిరిగి చిన్న షేర్లలో అమ్మకాలు తలెత్తడంతో బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.7 శాతం నీరసించింది. స్మాల్‌క్యాప్ మరింత అధికంగా 1.4% క్షీణించింది. తాజాగా ముగిసిన ఆర్థిక సంవత్సరం(2024–25)లో సెన్సెక్స్ 3,764 పాయింట్లు (5.1%) ర్యాలీ చేయగా.. నిఫ్టీ 1,192 పాయింట్లు (5.3 శాతం) లాభపడింది. ఈ బాటలో బీఎస్ఈ మిడ్‌క్యాప్ 5.6%, స్మాల్ క్యాప్ 8 శాతం చొప్పున ఎగశాయి. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) 25,90,547 కోట్లు పెరిగి 4,12,87,647 కోట్ల(4.82 లక్షల కోట్ల డాలర్లు)కు చేరింది.ఎఫ్‌పీఐల కొనుగోళ్లుకొద్ది నెలుగా అమ్మకాలకే అధికంగా ఆసక్తి చూపుతున్న విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) ఇటీవల పెట్టుబడులవైపు దృష్టి మరల్చారు. వెరసి గత ఆరు సెషన్లలో నికరంగా రూ. 31,000 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు. పలు కంపెనీల షేర్లు అందుబాటు ధరల్లోకి రావడంతో పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. దీంతో ఇటీవల మార్కెట్లు భారీ నష్టాల నుంచి బయటపడి 6 శాతం పుంజుకోడం గమనార్హం. కాగా.. తాజా పెట్టుబడుల ప్రభావంతో మార్చి నెలలో ఎఫ్‌పీఐల నికర అమ్మకాలు రూ. 3,973 కోట్లకు పరిమితమయ్యాయి! ఫిబ్రవరిలో రూ. 34,574 కోట్లు, జనవరిలో మరింత అధికంగా రూ. 78,027 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్న విషయం విదితమే.
ఫ్యామిలీ

ఈ జాబ్ చాలా లక్కీ!: ఐపీఎస్ అంకిత సురానా
సాక్షి, పార్వతీపురం మన్యం: ‘‘మహిళలను వెన్నుతట్టి ప్రోత్సహిస్తే ఏ రంగంలోనైనా విజేతలవుతారు. అమ్మాయిలు ఇష్టమైన రంగాన్ని ఎంచుకోవాలి. డాక్టర్, పోలీస్, ఇంజినీర్.. ఇలా ఏదైనా సరే! దాన్ని సాధించేందుకు ఎదురైన ప్రతి సవాల్‌నూ ఛాలెంజింగ్‌గా తీసుకోవాలి. ఎర్విరిథింగ్ ఈజ్ పాజిబుల్.. కష్టపడితే గెలుపు మన ముందు వచ్చి వాలుతుంది..’’ ‘‘పార్వతీపురం మన్యం జిల్లా లాంటి ఏజెన్సీ ప్రాంతంలో పని చేయడం గొప్ప అనుభూతినిస్తోంది. ఇక్కడ గిరిజన జనాభా అధికం. నిరక్షరాస్యత కూడా ఉంది. గత కొన్నేళ్లుగా కొంత మార్పు కనిపిస్తోంది. బాలికలు విద్య, క్రీడలు, ఇతర రంగాల్లో ప్రావీణ్యం పొందుతున్నారు. వారిలో మరింత చైతన్యం తీసుకొచ్చేందుకు నా వంతుగా ప్రయత్నినస్తున్నా. పాఠశాలలు, కళాశాలలకు స్వయంగా వెళ్లి వివిధ అంశాలపై వివరిస్తున్నా. కేవలం భద్రతనే కాదు.. కెరియర్ కోసం కూడా వివరిస్తుండటం సంతృప్తినిస్తోంది.’’ చిన్నప్పుడు అందరిలానే తనూ ఒక సాధారణ అమ్మాయి. చదువు, ఆటపాటలే లోకం. డిగ్రీ చదువుతున్న సమయంలో.. సమాజంలో తన పాత్ర ఏమిటో అవగతమైంది. ఈ సొసైటీకి.. ప్రధానంగా మహిళలు, బాలికల కోసం ఏం చేయాలన్న ప్రశ్నలోనే.. ‘ఐపీఎస్’ అన్న లక్ష్యం బోధపడింది. ఆమే.. యువ ఐపీఎస్ అధికారిణి, పార్వతీపురం ఏఎస్పీ అంకిత సురాన. అత్యున్నతమైన ఇండియన్ పోలీస్ సర్వీస్ కు ఎంపిక కావడమే కాదు.. శిక్షణలోనూ ప్రతిభను చూపారు. నేడు విధి నిర్వహణలోనూ ‘ఫ్రెండ్లీ పోలీస్’ అన్న పదానికి అసలైన నిర్వచనం చెబుతూ, క్లిష్టమైన కేసుల్లోనూ తన మార్కు చూపిస్తూ.. విజయవంతమైన అధికారిణిగా గుర్తింపు పొందారు. రాష్ట్రానికి మారుమూలన ఉన్న పార్వతీపురం మన్యం జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, యువతకు దిశానిర్దేశం చేయడంలో ముందుంటున్నారు. తన కుటుంబ నేపథ్యం, ఈ రంగంలోకి రావడానికి కారణం, విధి నిర్వహణలో సక్సెస్ఫుల్ జర్నీని ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే... శిక్షణ తర్వాత చాలా మార్పు సివిల్స్ సాధించిన తర్వాత శిక్షణ పూర్తయ్యాక నాలో చాలా మార్పు వచ్చింది. పట్టుదల పెరిగింది. ప్రజలకు సేవ చేయడాన్ని స్ఫూర్తిగా తీసుకున్నా. బాలలు, మహిళల రక్షణ కోసం పని చేయాలని అనిపించింది. ఈ రంగంలో తల్లిదండ్రులు ఎంతగానో ప్రోత్సహించారు. 2023లో గ్రేహౌండ్స్‌లో విశాఖలో విధుల్లో చేరా. తర్వాత పార్వతీపురం ఏఎస్పీగా వచ్చా. ఈ జాబ్ పొందడం చాలా లక్కీ! మరిచిపోలేని అనుభూతి.. రాష్ట్రస్థాయి రిపబ్లిక్‌డే వేడుకల పరేడ్ కమాండర్‌గా వ్యవహరించడం మరిచిపోలేని అనుభూతి. గర్వపడే సందర్భం. చాలా ఆనందం అనిపించింది. ఒక వారం శిక్షణ పొంది విజయవంతంగా పరేడ్ పూర్తి చేయగలిగాం. నాకు అవకాశమిచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. నేటి తరానికి ఇచ్చే సందేశం.. నథింగ్ ఈజ్ ఇంపాజిబుల్. ఎవి్వరిథింగ్ ఈజ్ పాజిబుల్. నేటి తరం బాలికలు, యువతకు చెప్పేదొకటే. విద్యార్థి దశలో చదువు, కెరియర్‌పైనే దృష్టి పెట్టాలి. మీరు ఏ రంగంలో రాణించాలనుకుంటున్నారో గట్టిగా నిర్ణయించుకోవాలి. దాని సాధన దిశగా సాగాలి. పదో తరగతి తర్వాత కెరియర్ కౌన్సెలింగ్ చాలా ముఖ్యం. ఈ దశలో ఇతర విషయాల జోలికి వెళ్లకుండా, అనవసరంగా సమయం వృథా చేయకుండా భవిష్యత్తు కోసం ఆలోచిస్తే.. మంచి జీవితం లభిస్తుంది. కుటుంబ నేపథ్యం.. మా సొంత ప్రాంతం మహారాష్ట్ర. పదో తరగతి వరకు అక్కడే చదివా. తర్వాత కుటుంబం హైదరాబాద్‌లో స్థిరపడింది. ఇంటర్ (బైపీసీ) తర్వాత హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో బీఎస్సీ బయోకెమిస్ట్రీ డిగ్రీ, సల్సార్ యూనివర్సిటీలో క్రిమినల్ జస్టిస్ మేనేజ్మెంట్లో పీజీ పూర్తిచేశా. తల్లిదండ్రులు కౌసల్య, మహవీర్ సురానా. నాన్న వ్యాపార రంగంలో ఉన్నారు. ఇంట్లో ఎవరూ ప్రభుత్వ ఉద్యోగంలో లేరు. అందరూ ప్రైవేట్ ఉద్యోగాలు, వ్యాపారాలే. మా కుటుంబం నుంచి నేను మొదటి పోలీస్ అధికారి కావడంతో మా కుటుంబ సభ్యులు ఎంతో సంతోషంగా ఉన్నారు. డిగ్రీలో ఉంటుండగానే కెరియర్ కోసం ఆలోచించా. సమాజానికి సేవ చేయాలని, ప్రజలకు దగ్గరగా ఉండే వృత్తిలో చేరాలని కోరిక. ఆ క్రమంలోనే సివిల్స్ వైపు వెళ్లాలని నిర్ణయించుకున్నా. డిగ్రీ చదువుతూనే.. సివిల్స్ ప్రిపరేషన్ ప్రారంభించాను. లక్ష్యంపైనే గురి. మూడుసార్లు విజయం రాకపోయినా ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. నాలుగో ప్రయత్నంలో సివిల్స్ సాధించాను. 398వ ర్యాంకు వచ్చింది. ఐపీఎస్‌కు ఎంపికయ్యా. 2021 బ్యాచ్ మాది. ప్రజల సహకారం ఉంటేనే.. ప్రజలను సురక్షితంగా ఉంచడం బాధ్యత. ఇదే సమయంలో శాంతి¿¶ద్రతల పరిరక్షణలో పోలీస్ శాఖపరంగా ఎంత చేసినా.. ప్రజల నుంచీ సహకారం అవసరం. ట్రాఫిక్ రూల్స్ పాటించడం, ప్రయాణ సమయంలో హెల్మెట్ ధారణ వంటివాటిలో ఎవరికివారు బాధ్యతగా వ్యవహరించాలి. పిల్లలు తప్పుడు దారిలో వెళ్లకుండా తల్లిదండ్రులు పర్యవేక్షణ చేయాలి. సమాజంలో ప్రధానంగా పోలీసులంటే భయం పోవాలి. 24 గంటలూ పోలీసులు అందుబాటులో ఉంటారు. ఏ సమయంలోనైనా ధైర్యంగా ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావాలి. చుట్టుపక్కల అసాంఘిక కార్యకలాపాలు జరిగినా.. ఒక్క ఫొటో ద్వారానైనా శక్తి యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ఇతర పోలీస్ శాఖ టోల్‌ఫ్రీ నంబర్లనూ వినియోగించవచ్చు. శక్తి యాప్.. సేఫ్టీయాప్. ప్రధానంగా మహిళల వద్ద ఉండాలి. ఒక్క బటన్ ప్రెస్ చేస్తే పోలీసులు ఉంటారు. ప్రజలకు పోలీసులు ఉన్నారన్న నమ్మకం పెరగాలి నేను ఎక్కడ పనిచేసినా.. అక్కడ ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు, చిన్నారులకు భద్రత కల్పించగలిగితే చాలు.. అంతకంటే సంతృప్తి ఉండదు. ప్రత్యేకించి మహిళలు, చిన్నారులకు పోలీస్‌పై నమ్మకం పెంచేలా పనిచేయగలగాలి. విధి నిర్వహణలో ప్రతి కేసునూ సవాల్‌గానే తీసుకుంటా. పోక్సో కేసులు, వరకట్నం, ఎస్సీ, ఎస్టీ కేసులు, శాంతిభద్రతలు.. ఇలా ఏదైనా బాధితులకు న్యాయం చేయాలి. అప్పుడే విధి నిర్వహణలో సంతృప్తి చెందగలం. మహిళల హక్కులు, చట్టాలపైన అవగాహన కల్పింస్తున్నాం. మహిళా దినోత్సవం సందర్భంగా కొవ్వొత్తుల ర్యాలీ, ఇతర కార్యక్రమాలు చేశాం. చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయి. ఏ ఒక్కరూ భయపడకూడదు. ధైర్యంగా ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావాలి. ఇటీవల ఒక పోక్సో కేసు వచ్చింది. ఆ అమ్మాయి చాలా డిప్రెషన్లోకి వెళ్లిపోయింది. వారం రోజులు కౌన్సెలింగ్ ఇచ్చాం. ఇప్పుడు ఆ అమ్మాయి చాలా హ్యాపీగా ఇంటర్ పరీక్షలు రాసుకుంటోంది. శాంతిభద్రతల పరిరక్షణలో... డ్రోన్ నిఘా వ్యవస్థను పటిష్టం చేశాం. ఈవ్‌టీజింగ్, జూదం, గంజాయి, సారా అక్రమ రవాణా వంటివాటిని డ్రోన్ల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తూ, కట్టడి చేస్తున్నాం. ప్రతి ముఖ్య కూడళ్లలోనూ సీసీ కెమెరాలు పెట్టాం. జిల్లాలో టాప్ 20 నేరస్తులను గుర్తించాం. వారిపై నిరంతరం ఓ కన్నేసి ఉంచుతున్నాం. మహిళల రక్షణ కోసం ప్రత్యేకంగా శక్తి యాప్ అందుబాటులోకి వచ్చింది. ఇందుకోసం పార్వతీపురం, పాలకొండ, సాలూరుల్లో టీమ్స్ పని చేస్తున్నాయి. వీరికి ప్రత్యేకంగా ఓ వాహనం ఉంటుంది. 100, 112 నంబర్లకు కూడా అత్యవసర సమయంలో ఫిర్యాదు చేయవచ్చు. నిమిషాల వ్యవధిలోనే పోలీసులు అక్కడ ఉంటారు. గంజాయి, సారా రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నాం. కళాశాలలు, పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. బాలికల కోసం స్వీయ రక్షణ తరగతులు నిర్వహిస్తున్నాం. అత్యవసర పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలి.. ఏ విధంగా రక్షణ పొందాలి, భవిష్యత్తును మంచిగా తీర్చిదిద్దుకోవడం వంటి అంశాలపై అవగాహన కల్పింస్తున్నాం. పాఠశాలల్లో ఈగల్ టీమ్స్ ద్వారానూ అవగాహన పెంచుతున్నాం. చిన్నారులు, మహిళల రక్షణ కోసం వన్‌స్టాప్ సెంటర్ ఉంది. అక్కడ వారికి అవసరమైన అన్ని విధాల మద్దతు కూడా లభిస్తుంది. సైబర్ క్రైమ్ మోసాలు రోజుకో విధంగా కొత్త రూపు సంతరించుకుంటున్నాయి. ప్రజలు వాటి బారిన పడకుండా గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు ఆయా ఎస్‌హెచ్‌వోల ద్వారా చేపడుతున్నాం. పోలీస్ సిబ్బంది సొంత సమస్యలపైనా ప్రతి శుక్రవారం ప్రత్యేకంగా గ్రీవెన్స్ నిర్వహించి, ఫిర్యాదులు స్వీకరిస్తున్నాం.

మామా.. ఆర్డర్ చేస్తున్నా..!
ఏడాది కిందట పెళ్లైన ఓ జంట ఉద్యోగం చేసుకుంటోంది. భర్త చిత్తూరు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తే... భార్య ప్రైవేటుగా పనిచేస్తోంది. ఈ ఇద్దరూ వారి వృత్తిలో బిజీగా గడుపుతున్నారు. వంట చేయడం రాదు. దీంతో కొన్ని నెలలు వంట మనిషిని పెట్టుకున్నారు. రుచి లేదని ఆమెను చాలించారు. ఈ కారణంగా ఎక్కువగా ఫాస్ట్‌పుడ్ సెంటర్లను ఆశ్రయిస్తుంటారు. ఆస్పత్రి ఆవరణం, పలమనేరు రోడ్డు, మురకంబట్టు రోడ్డు, లేకుంటే తమిళనాడులోని వేలూరుకు సైతం వెళుతున్నారు.కొత్త జంటలు వంటపై తంటాలు పడుతోంది. పెళ్లి కూతుర్లు వంటింట్లో అడుగు పెట్టాలంటే తెగ ఫీలైపోతున్నారు. వంట చేయడం రాక కొంత మంది వంట గదికి దూరంగా ఉండిపోతున్నారు. మరికొంత మంది పని ఒత్తిళ్లతో వంట దగ్గరికి వెళ్లలేకపోతున్నారు. ఇంకొంత మంది యూట్యూబ్ పాఠాలతో వంట వండేందుకు అపసోపాలు పడుతున్నారు. వారు వండిందే వారికే నచ్చక సింపుల్‌గా ఆన్లైన్ ఆర్డర్లు పెట్టుకుంటున్నారు. లేకుంటే పాస్ట్ ఫుడ్‌ను వెతుక్కుంటున్నారు. వీటి సంఖ్య జిల్లాలో గణనీయంగా పెరిగింది. ఇలా ఆరగించడం వల్ల అనారోగ్య సమస్యలు తప్పవని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాణిపాకం(చిత్తూరు): ఒకప్పుడు పెళ్లి చూపులంటే.. వరుడు వైపు వరకట్నంతో పాటు అమ్మాయికి వంటా వచ్చా అని అడిగేవాళ్లు. ఏ రకమైనవి ఎక్కువగా వండుతావ్ అని గుచ్చి గుచ్చి ప్రశ్నించేవారు. అప్పట్లో చదువు, ఉద్యోగం చూసేవారు కాదు. అమ్మాయి చక్కగా వండి పెడుతూ..ఇంట్లో ఉంటే చాలనుకునేవారు. ఇప్పుడు అమ్మాయి ఎంత వరకు చదువుకుంది..ఏం చేస్తోంది అని మాత్రమే చూస్తున్నారు. వధువు వైపు నుంచి...వరుడు చదువు, ఉద్యోగం, ఫ్యామిలీ పరిస్థితి చూసి..పెళ్లి ఫిక్స్ చేసేస్తున్నారు. అమ్మాయికి వంట వచ్చా అని అడిగే వాళ్లు పూర్తిగా కరువయ్యారు. చదువులపైనే దృష్టి పెడుతున్నారు.. ఒకప్పుడు ఆడ పిల్లలు 10 ఏళ్ల వయస్సు వచ్చిందంటేనే తల్లులు వంటింటికి తీసుకెళ్లి రకరకాల వంటలు చేయడం నేర్పేవాళ్లు. అత్తారింటికి వెళితే మీ అమ్మ వంట చేయడం నేర్పలేదా అని మమ్మలను చులకనగా మాట్లాడతారని తల్లులు పట్టుబట్టి వాళ్ల పిల్లలకు వంట నేర్పేవాళ్లు. ఇప్పుడు పల్లె, పట్నం అనే తేడా లేకుండా తల్లిదండ్రులు పిల్లలను చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచుతున్నారు. పిల్లల చదువుపై దృష్టి పెడుతున్నారు. బాగా చదివి సాఫ్ట్వేర్ ఉద్యోగం, ప్రభుత్వం ఉద్యోగం, డాక్టర్ అవ్వాలని, ఇతర ఉద్యోగాల కోసం అన్వేషిస్తున్నారు. ఇందులో చాలా మంది ఉన్నత చదువుల కోసం బయట రాష్ట్రాలకు, విదేశాలకు పంపుతున్నారు. ఒకప్పుడు మగ పిల్లలను చదివిస్తే ప్రయోజకుడై..పోషిస్తారని అనుకునేవాళ్లు. ఇప్పుడు మగ పిల్లలతో పాటు ఆడ పిల్లలను సమానంగా చదివిస్తున్నారు. చదువు తప్ప మరేది ముట్టుకోనివ్వడం లేదు. ఈ క్రమంలో ఆడ పిల్లలు వంటింటికి దూరమవుతున్నారు. తల్లులు సైతం పెళ్లైతే వంట నేర్చుకుంటుంది లే అని తేలికగా వదిలేస్తున్నారు. వంట చేయడం రాదు పెళ్లైన కొత్త జంటలు లగ్జరీ లైఫ్ వెతుక్కుంటున్నారు. పెళ్లికి ముందు నుంచే ఏ పని ముట్టుకోకుండా జీవించేయాలని కలలు కంటున్నారు. ముఖ్యంగా ఆడ పిల్లలు పుట్టింట్లో ఉన్నట్లుగా ఉండాలని కోరుకుంటున్నారు. అత్తారింటికి వెళ్లినా.. కాఫీ అంటే బెడ్ రూమ్‌కే వచ్చేయాలనే అనుకుంటున్నారు. వంట వచ్చిన మొగుడైతే ఇంకా బెటర్ అని మొహమాటం లేకుండా చెప్పేస్తున్నారు. ఇలా పుట్టింట్లో వంట నేర్చుకోక కొత్త పెళ్లి కూతుర్లు ఇబ్బందులు పడుతున్నారు. కొత్తగా కాపురం పెట్టిన వారైతే వంట కోసం తంటాలు పడుతున్నారు. కొందరు యూట్యూబ్ చూసి వంట పాఠాలు నేర్చుకోవడానికి ప్రయతి్నస్తున్నారు. ఈ ప్రయత్నంలో చేతులు కాల్చుకుంటూ వద్దురా..ఈ వంట తంటా అంటూ చాలించుకుంటున్నారు. ఆ వండిన వంట రుచికరంగా లేకపోవడంతో అబ్బాయిలు ఆమడదూరం వెళ్లిపోతున్నారు. ఇక ఉద్యోగ రీత్యా దంపతులు ఇద్దరూ వంటింటికి దూరంగా ఉంటున్నారు. 8 గంటల పని, తర్వాత ఇంటి పని, ఇతర పనులు వెరసి అలసిపోతున్నారు.బయట ఫుడ్ డేంజర్..? అధికంగా బయట ఫుడ్ తినడం వల్ల అనారోగ్య సమస్యలు తప్పవని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఊబకాయం, మధుమేహం, అధిక రక్తపోటు, బ్రెయిన్ స్ట్రోక్, క్యాన్సర్, రక్తనాళాల్లో కొలె్రస్టాల్ తదితర సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువగా పెళ్లైన వారు లావు కావడానికి ఇది కూడా ఒక కారణమని వెల్లడిస్తున్నారు. ఫాస్ట్ ఫుడ్‌కు జై కొడుతున్నారు దంపతులు ఇద్దరూ సంపాదన మీద పోటీ పడుతున్నారు. బిజీ లైఫ్‌లో పడిపోతున్నారు. నువ్వా నేనా అంటూ పనుల్లో నిమగ్నమైపోతున్నారు. ఈ తరుణంలో భార్య వంటింటికి దూరమై బయట ఫుడ్ కోసం అన్వేస్తున్నారు. అలాగే చాలా మంది వంట రాక అల్లాడిపోతున్నారు. యూట్యూబ్ చూసి వండిన ఆ టేస్ట్ రాకపోవడంతో ముద్ద మింగుడు పడడం లేదు. దీంతో ఫాస్ట్ ఫుడ్‌పై పడిపోతున్నారు. మూడు పూటల ఫాస్ట్‌ఫుడ్‌ను ఆరగిస్తున్నారు. లేకుంటే దర్జాగా ఇంట్లో కూర్చొని ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్లు పెట్టుకుంటున్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే వాళ్ల పరిస్థితి అయితే అర్ధరాత్రి కూడా ఆర్డర్లు పెట్టుకుని ఆవురావురమని తినేస్తున్నారు. ఫుడ్ దొరక్కపోయినా ఫిజ్జాలు, బర్గర్లు తెప్పించుకుని కడుపు నింపుకుంటున్నారు. దీని ఫలితంగా జిల్లాలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు విచ్చలవిడిగా పుట్టుకొచ్చాయి. బిర్యానీ సెంటర్లు సందుకొక్కటి ఉన్నాయి. వీరి రాకతో ఆ సెంటర్లు, హోటళ్లు నిండిపోతున్నాయి. కొత్త జంటలతో కళకళలాడుతున్నాయి. అనారోగ్యం పాలుకావద్దు ఫాస్ట్ ఫుడ్ ప్రస్తుత సమాజంలో ఫ్యాషన్‌గా మారింది. పేద, మధ్య ధనిక తేడా లేకుండా ప్రాధాన్యం ఇస్తున్నారు. ముఖ్యంగా కొత్తగా పెళ్లైన వారు చాలా మందికి వంట రాదు అని బయట ఫుడ్ తింటున్నారు. ఇది మంచిది కాదు. వీలైనంత వరకు తగ్గించుకుంటే మంచిది. తాజాగా వండి తినడం ఉత్తమం. బయట తినడం వల్ల అనేక రోగాలు మనిషిని చుట్టుముడుతాయి. – వెంకట ప్రసాద్, వైద్య నిపుణుడు, చిత్తూరు

ప్రేమను పంచే శుభదినం ఈద్
ఈదుల్ ఫిత్ర్ లేక రంజాన్ పర్వదినం ప్రపంచంలోని ముస్లిం సమాజానికి అత్యంత పవిత్రమైన, ఆనందకరమైన వేడుక. అత్యంత ఉత్సాహంగా, ఆనందంగా వారు ఈవేడుకను జరుపుకుంటారు. ఈ పర్వదినాన్ని ‘ఈద్’ అని కూడా పిలుస్తారు. ఇస్లామిక్ క్యాలెండర్ ను అనుసరించి రంజాన్ నెల ముగిసిన మరునాడు దీన్ని జరుపుకుంటారు.రంజాన్, ఇస్లామిక్ క్యాలెండర్లో తొమ్మిదవ నెల. ఇది ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సమాజంలో చాలా ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది. ఈ నెలలో ముస్లింలు ప్రత్యేకంగా ఉపవాసం (సియామ్) పాటిస్తారు, అంటే ఉషోదయం నుండి సూర్యాస్తమయం వరకు భోజనం, పానీయాలు, ఇతర శరీర సంబంధిత అవసరాలన్నీ త్యజిస్తారు. ఉపవాసం ఆధ్యాత్మిక దృష్టికోణంలో ఒక శుద్ధి ప్రక్రియగా భావించ బడుతుంది, ఇది స్వీయ నియంత్రణ, ప్రేమ, దయ, జాలి, క్షమ, సహనం, పరోపకారం, త్యాగం లాంటి అనేక సుగుణాలను పెంపొందించడానికి సహాయపడుతుంది. ఈ సందర్భంగా వారు వారి దైనందిన సేవాకార్యక్రమాలను మరింత విస్తరించుకొని, నైతికంగా, ఆధ్యాత్మికంగా తమ వ్యక్తిత్వాలను నిర్మించుకొని దేవుని కృపా కటాక్షాలు పొందడానికి ప్రయత్నిస్తారు. ఈదుల్ ఫిత్ర్ పండుగ సందర్భాన్ని పురస్కరించుకొని, సమాజంలో పేదరికాన్ని తొలగించే ప్రయత్నం కూడా ఎంతోకొంత జరుగుతుంది. దాతృత్వం, సామాజిక సేవలకుప్రాధాన్యం ఇవ్వడం ఈ పండుగ ప్రధాన లక్ష్యం. ప్రతి ఒక్కరూ తమ తోటి సోదరులకు సహకరిస్తూ వారి కష్టసుఖాల్లో పాలు పంచుకోడానికి ప్రయత్నిస్తారు. సదఖ, ఫిత్రా, జకాత్ ల ద్వారా అర్హులైన అవసరార్థులకు ఆర్థిక సహాయం అందిస్తారు.ఈదుల్ ఫిత్ర్ పర్వదినం సమస్త మానవాళి, సర్వ సృష్టిరాశి సుఖ సంతోషాలను కాంక్షించే రోజు. ఆనందం, శాంతి, సంతోషం, సమానత్వం, క్షమ, దయ, జాలి, పరోపకారం, సామాజిక బాధ్యతలను ప్రతిబింబించే ప్రత్యేకమైన రోజు. ఇది కేవలం ఒక ఆథ్యాత్మిక క్రతువు కాదు. సమాజంలో ప్రేమ, సహకారం, పరస్పర మైత్రి, బాధ్యత, ఆనందాలను పంచుకునే వేడుక. రంజాన్ నెల రోజుల శిక్షణ ద్వారానూ, ఈద్ పండుగ ద్వారానూ సమాజం ఆధ్యాత్మికతను, మానవతా విలువలను పునరుద్ధరించుకుంటుంది.పండగ తర్వాత కూడా...ఈద్ తో రోజాలకు వీడ్కోలు పలికినప్పటికీ, నెలరోజులపాటు అది ఇచ్చినటువంటి తర్ఫీదు అనంతర కాలంలోనూ తొణికిస లాడాలి. పవిత్ర రంజాన్ లో పొందిన దైవభీతి శిక్షణ, దయాగుణం, సహనం, సోదరభావం, పరస్పర సహకార, సామరస్య భావన, ఒకరి కష్టసుఖాల్లో ఒకరు పాలు పంచుకునే గుణం, పరమత సహనం, సర్వ మానవ సమానత్వం లాంటి అనేక సదాచార సుగుణాలకు సంబంధించిన తర్ఫీదు ప్రభావం మిగతా పదకొండు నెలలకూ విస్తరించి, తద్వారా భావి జీవితమంతా మానవీయ విలువలే ప్రతిబింబించాలి. సమస్త మానవాళికీ సన్మార్గభాగ్యం ప్రాప్తమై, ఎలాంటి వివక్ష, అసమానతలులేని, దైవభీతి, మానవీయ విలువల పునాదులపై ఓ సుందర సమ సమాజం, సత్సమాజ నిర్మాణం జరగాలి. ఇహపర లోకాల్లో అందరూ సాఫల్యం పొందాలి. ఇదే రంజాన్ ధ్యేయం.ఈ రోజు ముస్లింలు ఉదయాన్నే నిద్రలేచి పరిశుభ్రతను పొందుతారు. ఈద్ నమాజ్ /ప్రార్థన ఆచరించి కుటుంబంతో, స్నేహితులతో కలిసి పండుగను జరుపుకుంటారు. ప్రతి ఒక్కరూ ఈ రోజున వారి వారిస్థోమత మేరకు కొత్త దుస్తులు ధరించి, పలు రకాల తీపి వంటకాలు ముఖ్యంగా సేమియా/షీర్ ఖుర్మా తీసుకుంటారు. ఈదుల్ ఫిత్ర్ పండుగ కేవలం ఒక వేడుక మాత్రమే కాదు, సమాజంలో నైతిక, ఆధ్యాత్మిక, మానవీయ సుగుణాలను పునరుధ్ధరించే మహత్తరమైన రోజు. ఈ పండుగ రోజున ముస్లిం సమాజం జకాతుల్ ఫిత్ర్ అనే దానం కూడా ఇస్తారు. పేదసాదలను గుర్తించి వారికి ఫిత్రా దానాలు చెల్లించడం ద్వారా తమ దాతృత్వాన్ని చాటుకోవడం కాకుండా తమ బాధ్యతను నెరవేర్చామని భావిస్తారు.రంజాన్ నెల ముగియగానే, షవ్వాల్ నెల మొదటి రోజు ముస్లిం సోదరులు ‘ఈదుల్ ఫిత్ర్’ పర్వదినం జరుపుకుంటారు. ‘ఫిత్ర్’ అంటే దానం, పవిత్రత లేదా శుద్ధి అని కూడా అంటారు. ఇది ఉపవాసం,ప్రార్థనల ధార్మిక విధిని పూర్తి చేసుకున్న శుభ సందర్భాన్ని పురస్కరించుకొని దైవానికి కృతజ్ఞతలు తెలుపుకునే అపురూప సందర్భం.– మదీహా అర్జుమంద్

వర్క్ షేరింగ్.. హ్యాపీనెస్ లోడింగ్
రోజంతా బండెడు చాకిరీ చేసే భార్యకు ఇంటి పనిలో భర్త చేసే చిన్నపాటి సాయం ఎంతో ఉపశమనాన్నిస్తుంది. లేచింది మొదలు పడుకునే వరకు అలుపెరుగని ఆమె శ్రమకు వారంలో ఒక్కరోజైనా విరామం అవసరం. ఆదివారం (Sunday) భర్త ఇంటి పనులు చక్కబెడుతూ ఆమెను మురిపిస్తే వారి సంసార బంధం మరింత బలపడుతుందని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు.సాక్షి, భీమవరం: తెల్లారి లేచింది మొదలు ఆడవాళ్ల చేతులు పనులకు ముడిపడతాయి. ఇంటిని శుభ్రం చేయడం, పిల్లలకు స్నానాలు చేయించడం, భర్త, పిల్లలు రెడీ అయ్యేసరికి టిఫిన్లు సిద్ధం చేసి పెట్టడం. అవి పూర్తయ్యేలోగా లంచ్ బాక్స్‌లు ప్యాకింగ్. ఇలా.. ఉదయం ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు క్షణక్షణం ఉరుకులు పరుగుల జీవితం. భర్తను ఉద్యోగానికి, పిల్లల్ని బడికి సాగనంపాక బండెడు గిన్నులు తోముకుని, ఇంటిల్లపాదివి మాసిన దుస్తులు ఉతుక్కుని, స్నానం చేసి దేవుడికి దణ్ణం పెట్టుకుని.. హమ్మయ్యా అనుకునేసరికి టైం 11 అయిపోతుంది. చాలామంది గృహిణులు ప్రశాంతంగా కూర్చుని టిఫిన్ చేసేది అప్పుడే. సాయంత్రం పిల్లలు, భర్త ఇంటికి తిరిగి వచ్చే వరకు ఏదో పనిలో ఈదుతూనే ఉంటారు. పిల్లలతో హోం వర్క్ చేయించి రాత్రి అందరూ పడుకున్నాక ఉదయానికి అన్నీ సర్దుకుని అలసిసొలసి అప్పుడు నిద్రలోకి జారుకుంటుంటారు. కుటుంబానికి చేదోడుగా.. భర్త, పిల్లల్ని సాగనంపి కుటుంబ పోషణకు చేదోడుగా ఉద్యోగాలు, పనులు చేస్తున్న మహిళలు ఎందరో ఉన్నారు. వీరిపై పనిభారం మరింత ఎక్కువగా ఉంటుంది. దాదాపు ప్రతి ఇంటిలో తొలి మేలుకొలుపు భార్యదే. రాత్రి బాగా పొద్దిపోయాక నిద్రపోయేది ఆమెనే. పనుల సుడిగుండంలో తనను తాను మరిచిపోయి ఎల్లప్పుడూ కుటుంబ క్షేమం కోరే వ్యక్తి ఇల్లాలు. అలాంటి అర్ధాంగికి ఉపశమనం (Relief) కలిగించేలా వారాంతాలు, ముఖ్యంగా ఆదివారం ఇంటి పనుల్లో భర్త సహాయం చేయడం ద్వారా గృహిణుల మానసిక, శారీరక స్థితులు మ రింత దృఢమవుతాయని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. గృహ సంబంధ బాధ్యతలు పంచుకోవడం మేలని, ఈ దిశగా అందరూ ముందుండాలని అంటున్నారు. ఏమేం చేయాలంటే.. →ఉదయం లేవగానే గదులను తుడవడం, దుమ్ములు దులిపి ఇంటిని శుభ్రం చేయడం. ఇంటి ఆవరణలో పెరిగిన పిచ్చిమొక్కలు తొలగించడం, మొక్కలకు నీరు పెట్టడం. గిన్నెలు తోమడం, కూరగాయలు కోయడం, వంట చేయడం. దుస్తులు ఉతికి ఆరబెట్టడం, ఐరెన్ చేయడం → పిల్లలు ఇంటి వద్దనే ఉంటారు కాబట్టి వారికి స్నానాలు చేయించడం, హోంవర్క్‌లో సాయం చేయడం, వారితో కలిసి సరాదాగా ఆడుకోవడం వంటివి భర్తలు చేస్తుండాలి.ప్రయోజనాలెన్నో.. → ఇంటిపనిలో చేదోడువాదోడుగా ఉండే భర్తని ఇల్లాలు చాలా ఎక్కువగా ప్రేమిస్తుందని నిపుణులు అంటున్నారు. భర్త తనను ఎంత ప్రేమగా, బాధ్యతగా చూసుకుంటున్నాడో అర్థం చేసుకుంటుంది. ఇద్దరి మధ్య ఏమైనా మనస్పర్థలు, అపార్థాలు ఉంటే తొలగిపోతాయి. ఆదివారం వర్క్ షేరింగ్‌తో ఆ ఇంట హ్యాపీనెస్ (Happiness) లోడింగ్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు. → ఇల్లాలు ఆరోగ్యంగా ఉంటేనే ఇంటిల్లిపాది ఆరోగ్యంగా ఉంటారు. విశ్రాంతి వలన ఆమె శారీరక, మానసిక స్థితి మెరుగుపడుతుంది.→ ఇంటి పనులు త్వరగా పూర్తయితే ఇద్దరూ కూర్చుని కబుర్లు చెప్పుకునేందుకు సమయం పెరుగుతుంది. → సెలవురోజున పని అయ్యాక ఇల్లాలని సరదాగా బయటకు తీసుకువెళ్లడం వలన వారికి రీఫ్రెష్ అయిన భావన కలిగి వారమంతా ఉత్సాహంగా ఉండే వీలుంటుంది. → ఇల్లాలు భర్త నుంచి కొంత సమయం కోరుకుంటుంది. అది కూడా స్నేహపూర్వక వాతావరణంలో ఉండాలని భావిస్తుంది. ప్రేమగా వారి పనుల్లో పాలుపంచుకోవడం వలన ఇది సాధ్యపడుతుంది. → ఇంటి పని మహిళలే చేయాలన్న భావన నుంచి బయటపడొచ్చు. చదవండి: పిల్లలు స్కూల్ నుంచి రాగానే వారికి ఏం నేర్పిస్తున్నారు?భార్యకు విశ్రాంతి అవసరం భార్యకు ఒక్కరోజు విశ్రాంతినివ్వడం ఎంతో అవసరం. పని ఒత్తిడి నుంచి వారికి ఉపశమనం కలుగుతుంది. వారిని పట్టించుకోనట్టు ఉంటేనే ఆడవారికి అలకలు, కోపాలు వస్తాయి. భర్త ఇంటి పనుల్లో కలుగజేసుకుని భార్యకు చేసే సాయం వారి బంధానికి మరింత బలమవుతుంది. కౌన్సెలింగ్‌లో భార్యాభర్తలకు ఈ విషయాన్ని చెబుతుంటాం. – చల్లా భారతిదేవి, సైకియాట్రిస్ట్, పాలకొల్లు ఆయనకు సెలవొస్తే..మా వారు పంచాయతీరాజ్ శాఖలో ఉద్యోగి. ఆదివారం, సెలవు రోజుల్లో ఇంటి వద్ద వంట పని, ఇంటి పనుల్లో సాయం చేస్తుంటారు. నా కష్టాన్ని అర్థం చేసుకునే మనస్తత్వం ఆయనకు ఉందని సంతోషం, సంతృప్తి కలుగుతుంటాయి. నేను ఆరోగ్యంగా, ఆనందంగా ఉండటానికి నా భర్త సహకారమే కారణం. – అంబటి అరుణ సూర్యకుమారి, గృహిణి, నరసాపురం తప్పనిసరిగా సహకరించాలి ఇంటి, వంట పనుల్లో భార్యకు తప్పనిసరిగా సహకరించాలి. నేను వ్యాపారరీత్యా ఆరు రోజులు షాపులో ఉన్నా ఆదివారం తప్పనిసరిగా ఇంటి పనుల్లో నా భార్య లక్ష్మీకుమారికి సహాయపడతాను. ఇతర రోజుల్లోనూ ఇతర పనుల్లో సహాయం చేస్తా. భా ర్యలకు సాయం చేయడం బాధ్యతగా భావించాలి తప్ప నామోషిగా ఫీల్ కాకూడదు. – కారుమూరి నర్సింహమూర్తి (బాబు), భీమవరం ఇంటి పనుల్లో సాయపడతాను నేను ప్రభుత్వ హైస్కూల్ ఉపాధ్యాయుడిని. ఉదయం నుంచి రాత్రి వరకూ ఇంటి కోసం కష్టపడే నా సతీమణి కోసం ఆదివారం ఇంటి పనుల్లో సాయపడతాను. అప్పుడు తెలుస్తుంది ఇంటిని చక్కబెట్టేందుకు ఆవిడ ఎంత కష్టపడుతుందోనని. పొద్దస్తమాను పనిచేసే మహిళలకు వారంలో ఒక రోజు విశ్రాంతి అవసరం. – పొద్దోకు గజేంద్ర గడ్కర్, ఉపాధ్యాయుడు, రాయకుదురు
ఫొటోలు


న్యూబిగినింగ్స్, కొత్త సంవత్సరాదికి ప్రేమతో : వైష్ణవి చైతన్య ( ఫోటోలు)


బ్లాక్ శారీలో మెరిసిన కీర్తి సురేష్ (ఫొటోలు)


ఇంద్రకీలాద్రి : బెజవాడ దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు (ఫొటోలు)


విజయవాడ : ముద్దులొలికిన సంప్రదాయం..క్యాట్‌వాక్‌లు (ఫొటోలు)


బాలకృష్ణ 'ఆదిత్య 369' రీరిలీజ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)


హైదరాబాద్ : రంజాన్ వేళ చార్మినార్ వద్ద షాపింగ్ సందడి (ఫొటోలు)


మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అంటున్న నటి ‘అనన్య నాగళ్ల’ (ఫొటోలు)


ఉగాది స్పెషల్ లుక్‌లో మహేశ్‌బాబు గారాలపట్టి సితార (ఫోటోలు)


తిరుమలలో ఉగాది వేడుకలు (ఫొటోలు)


#MEGA157 చిరంజీవి,అనిల్ రావిపూడి కొత్త సినిమా ప్రారంభం (ఫొటోలు)
International

Myanmar earthquake: మయన్మార్‌లో మళ్లీ భూకంపం
మయన్మార్‌లో మళ్లీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 5.1 తీవ్రత నమోదైంది. దీంతో ఇళ్ల నుంచి ప్రజలు భయంతో బయటికి పరుగులు తీశారు. యునైటెడ్ జియోలాజికల్ సర్వే (యూఎస్జీఎస్) ప్రకారం.. ఆదివాయం మధ్యాహ్నం 12గంటల నుంచి 1గంట మధ్యలో మయన్మార్‌ను మరోసారి భూకంపం వణికించింది. మయన్మార్‌లోని మాండలే ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.1గా నమోదైనట్లు తేలింది.మరణాల సంఖ్య పెరుగుతోందిమార్చి 28న మయన్మార్‌ను భారీగా కుదిపేసిన 7.7 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఈ దుర్ఘటనలో మరణాల సంఖ్య సుమారు 1600కు పైకి చేరింది. 3,400 మందికి పైగా అదృశ్యమయ్యారు. యూఎస్జీఎస్ ప్రాథమిక సమాచారం మేరకు మయన్మార్‌లో ఈ భూకంపం వల్ల మరణాల సంఖ్య 10,000 దాటే అవకాశముందని పేర్కొంది.

పుతిన్ కారులో భారీ పేలుడు.. జెలెన్స్కీ భవిష్యవాణి నిజమేనా?
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Russian President Vladimir Putin)కు చెందిన అధికారిక కార్లలో అత్యంత లగ్జరీ కారు లిమోజిన్‌లో భారీ పేలుడు సంభవించింది. మాస్కో నడిబొడ్డున జరిగిన ఈ ఘటన రష్యా అధ్యక్షుని భద్రతపై పలు అనుమానాలు రేకెత్తిస్తోంది. ఈ ఘటనతో ప్రపంచ నేతలంతా ఉలిక్కిపడ్డారు. ‘ది సన్’ తెలిపిన వివరాల ప్రకారం పుతిన్‌కు చెందిన ఈ అత్యంత ఖరీదైన కారు లుబియాంకాలోని ఎఫ్ఎస్బీ ప్రధాన కార్యాలయం సమీపంలో కాలిపోతూ కనిపించింది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం కారు ఇంజిన్ నుండి మంటలు ప్రారంభమై, వాహనం లోనికి వ్యాపించాయి. JUST IN: 🇷🇺 Luxury limousine from Russian President Putin's official motorcade exploded on the streets of Moscow, just blocks from the FSB headquarters.It's unclear if this is an attempted ass*ssination attempt pic.twitter.com/Da4tcUoZEU— BRICS News (@BRICSinfo) March 29, 2025అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపు అక్కడికి సమీపంలోని రెస్టారెంట్‌లోని సిబ్బంది కారుకు అంటుకున్న మంటలను ఆర్పేందుకు ముందుకు వచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజీలో వాహనం నుండి దట్టమైన నల్లటి పొగ రావడం, కారు వెనుక భాగం దెబ్బతిడాన్ని చూడవచ్చు. ఈ పేలుడుకు గల కారణం ఇంకా తెలియరాలేదని, ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని ‘ది సన్’ పేర్కొంది. ఈ కారును ప్రెసిడెన్షియల్ ఎస్టేట్ డిపార్ట్మెంట్ పర్యవేక్షిస్తుంటుంది. ఇదిలావుండగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోగ్యం క్షీణిస్తోందని, ఆయన త్వరలో చనిపోతారని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ (Ukrainian President Volodymyr Zelensky) వ్యాఖ్యానించారు. బుధవారం జరిగిన ఒక ఇంటర్వ్యూలో జెలెన్స్కీ ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు. పుతిన్ కారు తగలబడిన ఘటన నేపధ్యంలో ఆయన మరణాన్ని జెలెన్స్కీ ముందే ఊహించారంటూ పలు కథనాలు వెలువడుతున్నాయి. కైవ్ ఇండిపెండెంట్ వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం యూరోవిజన్ న్యూస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జెలెన్స్కీ మాట్లాడుతూ పుతిన్ త్వరలో చనిపోతారని, ఇరు దేశాల యుద్ధం కూడా త్వరలో ముగుస్తుందని అన్నారు.ఇది కూడా చదవండి: Rajasthan Day: 19 రాచరిక రాష్ట్రాలు కలగలిస్తే..

భూకంపంలో శిశువులను కాపాడిన నర్సులు.. హ్యట్సాప్ అంటూ ప్రశంసలు
మయన్మార్‌లో భూకంప విలయం (Earthquake) కారణంగా భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. అంచనాలకు కూడా అందని నష్టాన్ని మిగిల్చింది. భూకంప కేంద్రమైన మాండలేతో పాటు దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా కుప్పకూలిన భవనాల శిథిలాలే. బాధితుల హాహాకారాలే వినిపిస్తున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం 7.7 తీవ్రతతో విరుచుకుపడ్డ భూకంపానికి బలైన వారి సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. శిథిలాల నుంచి ఇప్పటికే 1,600కు పైగా మృతదేహాలను వెలికితీశారు. 3,500 మందికి పైగా గాయపడినట్టు అధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య 10 వేలు దాటవచ్చని చెబుతున్నారు.మరోవైపు.. భూకంపం సందర్బంగా కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చైనాలోని ఒక చిన్న పిల్లల ఆసుపత్రికి సంబంధించిన వీడియోపై నెటిజన్లు ప్రసంశలు కురిపిస్తున్నారు. భూకంపం సందర్భంగా ఆసుపత్రిలోని మెటర్నిటీ వార్డులో చిన్న పిల్లలను నర్సులు కాపాడారు. భూకంపం ధాటికి భవనంలో కుదుపులు ఎదురైనప్పటికీ వారు కింద పడిపోతున్నా.. ఆసుపత్రిలో ఉన్న శిశువుకు ప్రమాదం జరగకుండా నర్సులు జాగ్రత్తలు తీసుకున్నారు. మరో నర్సు ప్లోర్‌పై కూర్చుని శిశువును పట్టుకుంది. ఎంతో కష్టం మీద కన్న తల్లిలాగా శిశువులను కాపాడారు. ఈ క్రమంలో నర్సుల కష్టంపై నెటిజన్లు స్పందిస్తూ ప్రశంసిస్తున్నారు.ఇదిలా ఉండగా.. మయన్మార్‌తో పాటు థాయ్‌లాండ్‌లో 12 నిమిషాల వ్యవధిలోనే సంభవించిన రెండు భారీ భూకంపాలు (Earthquake) తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఈ భూకంపం 334 అణుబాంబులతో సమానమైన శక్తిని విడుదల చేసి వినాశనం సృష్టించిందని స్థానిక భూవిజ్ఞాన శాస్త్రవేత్త జెస్ ఫీనిక్స్ పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో మరిన్ని ప్రకంపనలు (Aftershocks) వచ్చే ప్రమాదం ఉందని ఆమె హెచ్చరించారు. భారత టెక్టానిక్ ఫలకాలు యురేషియన్ ప్లేట్స్‌ను వరుసగా ఢీకొంటుండడం వల్ల నెలల తరబడి ఆఫ్టర్‌షాక్స్ వచ్చే అవకాశం ఉందని జెస్ ఫీనిక్స్ తెలిపారు. భూ ఉపరితలానికి 10 కి.మీ లోతులోనే ప్రకంపనల కేంద్రాలు ఉన్నాయని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది.Nurses in SW China protect newborn babies during earthquake in Myanmar #ChinaBuzz pic.twitter.com/Yixj3pCtZE— CGTN (@CGTNOfficial) March 30, 2025ప్రపంచ దేశాల ఆపన్న హస్తం..ఈ కష్ట సమయంలో అక్కడి ప్రజలకు ఆపన్న హస్తం అందించేందుకు భారత్ ఇప్పటికే ముందుకొచ్చింది. ‘ఆపరేషన్ బ్రహ్మ’ కింద దాదాపు 15 టన్నుల సహాయ సామగ్రిని అక్కడికి పంపించింది. బాధితులకు అవసరమైన ఆహారపదార్థాలతోపాటు.. తాత్కాలిక నివాసం కోసం టెంట్లు, స్లీపింగ్ బ్యాగ్స్, వాటర్ ప్యూరిఫయర్లు, సోలార్ ల్యాంప్, జనరేటర్లు, అత్యవసర వైద్య పరికరాలను మయన్మార్‌కు పంపించినట్లు సమాచారం. అంతే కాకుండా విపత్తులో ఉన్న ఆ దేశానికి సాయం చేసేందుకు 80 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని అక్కడికి పంపుతున్నట్లు పేర్కొంది. అమెరికా, ఇండోనేషియా, చైనా, ఇతర దేశాలు కూడా అవసరమైన సాయం అందిస్తామని ప్రకటించాయి. ప్రభావిత దేశాలకు సహాయక సామగ్రి పంపుతున్నామని ఐక్యరాజ్యసమితి జనరల్ సెక్రటరీ ఆంటోనియో-గుటెరస్ వెల్లడించారు.Terrifying CCTV video of yesterdays M7.7 earthquake that hit Myanmar. The death toll is at least 1,644, with 3,408 people injured. Numbers are expected to rise. pic.twitter.com/5fAXXXpVDl— Volcaholic 🌋 (@volcaholic1) March 29, 2025 Nature doesn’t care about our strength, borders, or pride. The earthquake in #Thailand & #Myanmar is a stark reminder: no matter how advanced we become, nature still holds the power to shake everything. A brutal reminder of how small we really are. #earthquake pic.twitter.com/wQPZ82MB8j— Hala Jaber (@HalaJaber) March 29, 2025

Myanmar: ఇంకా తప్పని ముప్పు.. 24 గంటల్లో 15 భూ ప్రకంపనలు
నేపిడా: శుక్రవారం సంభవించిన భారీ భూకంపం మయన్మార్(Myanmar)ను అతలాకుతలం చేసింది. నాటి భయం నుంచి అక్కడి ప్రజలు కోలుకోకముందే తిరిగి పలుమార్లు భూ ప్రకంపనలు సంభవించాయి. గడచిన 24 గంటల్లో మయన్మార్‌లో 15 సార్లు భూమి కంపించింది. దీంతో మయన్మార్‌కు ఇంకా భూ ప్రకంపనల ముప్పు తప్పలేదని శాస్త్రవేత్తలు అంటున్నారు.గడచిన 24 గంటల్లో ప్రతి రెండు గంటలకు ఒకసారి భూమి కంపించడాన్ని శాస్త్రవేత్తలు(Scientists) గుర్తించారు. భూకంపం తర్వాత మయన్మార్‌లో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. దీంతో అక్కడి విషాదానికి సంబంధించిన పలు చిత్రాలు, వీడియోలు అందుబాటులోకి రావడం లేదు. భూకంపం తీవ్రతకు పలు భవనాలు, వంతెనలు కూలిపోయాయి. మయన్మార్‌లోని చారిత్రక అవా వంతెన కూడా భూకంపం తీవ్రతకు కూలిపోయింది. ఈ వంతెనను 1934లో నిర్మించారు.ఇదేవిధంగా మయన్మార్‌లోని ప్రముఖ పగోడా ఆలయం కూడా కూలిపోయింది. ఈ ఆలయం యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితా(UNESCO World Heritage List)లో చోటు దక్కించుకుంది. ఈ ఆలయ నిర్మాణశైలి ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటుంది. ఏడాది పొడవునా భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఇప్పుడు ఈ ఆలయం శిథిలమయ్యింది. మయన్మార్‌లో ఇప్పటికీ అంతర్యుద్ధం కొనసాగుతోంది. అటువంటి పరిస్థితిలో తాజాగా సంభవించిన భూకంపం మయన్మార్‌కు దెబ్బ మీద దెబ్బలా తయారయ్యింది. ఈ నేపధ్యంలో భారత్.. మయన్మార్‌కు అండగా నిలిచింది. బాధితులకు సహాయ సామాగ్రిని అందించేందుకు ఆపరేషన్ బ్రహ్మను ప్రారంభించింది.ఇది కూడా చదవండి: చైత్ర నవరాత్రుల సందడి ప్రారంభం
National

Swati Sachdev : కన్నతల్లి గురించి కారుకూతలు .. స్వాతి సచ్‌దేవా వీడియో దుమారం!
ఢిల్లీ: కంటెంట్ క్రియేటర్లు డార్క్ కామెడీ పేరుతో శృతి మించుతున్నారు. లైకులు, వ్యూస్ కోసం తల్లిదండ్రులు, సాన్నిహిత్యం గురించి బహిరంగంగా ప్రస్తావిస్తున్నారు. అబాసుపాలవుతున్నారు. తాజాగా, మహిళా స్టాండప్ కమెడియన్ స్వాతీ సచ్‌దేవా (Swati Sachdev) అదే తరహా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు చేసినందుకు గాను నెటిజన్లు ఆమెపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఇంతకీ ఆమె ఏం మాట్లాడారు. కొద్ది రోజుల క్రితం ‘ఇండియాస్ గాట్ లాటెంట్’ (India's Got Latent) వేదికగా యూట్యూబర్ రణవీర్ అల్హాబాదియా (Ranveer Allahbadia) తల్లిదండ్రుల గురించి, శృంగారంపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు మరువక ముందే తాజాగా,స్టాండప్ కమెడియన్ స్వాతీ సచ్‌దేవా ఇటీవల తనకు, తన తల్లికి మధ్య జరిగిన ఓ సంభాషణ గురించి ప్రస్తావించారు. స్టాండప్ కామెడీతో పేరుతో రాయలేని విధంగా ఆమె చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. నెటిజన్లు సైతం విమర్శలు గుప్పిస్తున్నారు. తల్లిదండ్రుల గురించి ఆ తరహా వ్యాఖ్యలు చేసినందుకు ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.ప్రముఖ హాస్యనటుడు సమయ్ రైనా ఇండియా గాట్ లాటెంట్ పేరుతో ఓ కామెడీ షోని నిర్వహిస్తున్నారు. ఆ షో ముఖ్య ఉద్దేశం.. షోలో పాల్గొన్న కంటెస్టెంట్లు తమలోని హాస్య కోణాన్ని ప్రదర్శించాలి. అయితే, ఆ షోలో రణవీర్ అల్హాబాదియా పాల్గొన్నారు. ఓ కటెంటెస్ట్ను ఉద్దేశించి.. ‘నీ తల్లిదండ్రులు శృంగారంలో పాల్గొంటే జీవితాంతం చూస్తూ ఉండిపోతావా?. లేకుంటే.. ’ అంటూ అతి జుగుప్సాకరమైన ప్రశ్నను సంధించాడు. ఆ వీడియో నెట్టింటకు చేరడంతో అతనిపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. రాజకీయ నేతలతో పాటు సినీ ప్రముఖులు సైతం అతని తీరును తీవ్రంగా ఖండించారు.Probably the most cringeworthy standup 'comedy' you will ever see. Swati Sachdeva talks about her mother discovering her vibrator and wanting to have a talk like friends. "Oh no, mom is 100% going to borrow my vibrator." The only way these liberal 'comedians' can get a laugh out… pic.twitter.com/mSGXorCVVD— Rakesh Krishnan Simha (@ByRakeshSimha) March 29, 2025

పెన్సిల్ విలేజ్ ఆఫ్ ఇండియా గురించి తెలుసా?
ఏపీ సెంట్రల్ డెస్క్: జమ్ము కశ్మీర్‌లోని పుల్వామా జిల్లా ఓఖూ గ్రామం పెన్సిల్ విలేజ్ ఆఫ్ ఇండియాగా వినుతికెక్కింది. దేశం నుంచి పెన్సిల్ ఉత్పత్తికి కావాల్సిన 90 శాతం ముడి కలప ఇక్కడి నుంచే కంపెనీలకు ఎగుమతవుతోంది. పెన్సిళ్ల తయారీకి అవసరమైన కలపను ఒకప్పుడు చైనా, జర్మనీ నుంచి ఇక్కడివారు దిగుమతి చేసుకునేవారు. ఇప్పుడా అవసరం లేకుండా స్థానికంగా లభించే కలపను సమర్థవంతంగా నియోగించుకుంటున్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో తమదైన ముద్ర వేసుకుంటున్నారు. మార్చి 30 జాతీయ పెన్సిల్ దినోత్సవం. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం పాఠకుల కోసం.ప్రధాని ప్రస్థానంతో వెలుగులోకి.. దేశ ప్రధాని నరేంద్రమోదీ తన మనసులోని భావాలను ఆవిష్కరించే మన్ కీ బాత్ (mann ki baat) లో పెన్సిల్ విలేజ్ ఆఫ్ ఇండియాగా ఓఖూను అభివర్ణించారు. దీంతో ఈ గ్రామం వెలుగులోకి వచ్చింది. పుల్వామా జిల్లాలోని ఈ గ్రామం పెన్సిల్ తయారీకి ప్రధాన కేంద్రంగా గుర్తింపుపొందింది. దేశాన్ని విద్యావంతులుగా తీర్చిదిద్దడంలో పుల్వామా కీలక భూమిక పోషిస్తోందని, విద్యార్థులు తమ హోంవర్క్ చేయడం, నోట్స్ రాసుకోవడంలో పెన్సిల్ (Pencil) వినియోగించినప్పుడల్లా పుల్వామా జిల్లా స్ఫురణకు వస్తుందని మన్ కీ బాత్ ప్రసంగంలో కితాబిచ్చారు. దిగుమతుల నుంచి ఎగుమతుల దాకా.. 1960 నుంచి ఇక్కడ పరిశ్రమల ప్రస్థానం ప్రారంభమైంది. మొదట్లో పెన్సిల్ తయారీకి దియోదార్ కలపను వినియోగించేవారు. 1992లో ఇక్కడి ప్రభుత్వం దియోదార్ వినియోగాన్ని నిషేధించడంతో చైనా, జర్మనీ దేశాల నుంచి కలపను దిగుమతి చేసుకునేవారు. అయితే ఇది వ్యయ ప్రయాసలతో కూడినది కావడంతో ప్రత్యామ్నాయానికి అన్వేషించారు. అలాంటి సమయంలో ఇక్కడ లోయల్లో లభించే పోప్లర్ కలప వీరికి వరంలా మారింది. ఆ కలపతో పెన్సిల్ పలకలను తయారుచేయడం మొదలెట్టారు. పోప్లర్ కలప పెన్సిల్ నాణ్యతను పెంచడంతో దిగుమతుల దశ నుంచి ఎగుమతి చేసుకునే స్థాయికి చేరింది. యూఏఈ, మెక్సికో, నేపాల్, పోలాండ్, ఫ్రాన్స్, భూటాన్, యూకే, బెల్జియం, మారిషస్, లెబనాన్, మాల్దీవులు, గ్రీక్, శ్రీలంక, బంగ్లాదేశ్ తోపాటు 85 దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. నిరుద్యోగుల కల్పతరువు... ఓఖూ ఓఖూ... పుల్వామా జిల్లాకు చెందిన ఓ మారుమూల గ్రామం. ప్రపంచ స్థాయి మార్కెట్లో ఒకటిగా వెలుగొందుతోంది. గతంలో ముడి కలపను జమ్ము, చండీగఢ్‌లో ముక్కలుగా చేసి తెప్పించేవారు.స్థానిక ప్రభుత్వం వీరికి ఆధునికతను అందుబాటులోకి తీసుకురావడంతో పెన్సిల్ పలకలను ఇక్కడే తయారు చేస్తున్నారు. పెన్సిల్ రూపకల్పనకు అవసరమైన పలకలను ఎండబెడతారు. ఇవి బాగా ఆరాక ఒక్కో పెట్టెలో 800 పలకల లెక్కన ప్యాక్ చేస్తారు. నటరాజ్, అప్సర, హిందూస్థాన్ పెన్సిళ్ల తయారీ కర్మాగారాలకు ఇక్కడి నుంచే కలప వెళ్తోంది. ఏనాటికైనా కశ్మీర్ లోనే పూర్తిస్థాయి పెన్సిల్ ప్లాంట్ అందుబాటులోకి రావాలని, ప్రపంచ స్థాయిలో పెన్సిల్ ఉత్పత్తిలో దేశాన్ని అగ్రగామిగా నిలపాలన్నది ఓఖూ గ్రామస్తుల ఆకాంక్ష.చదవండి: వర్క్ షేరింగ్.. హ్యాపీనెస్ లోడింగ్

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. బీజాపూర్ ఎస్పీ ఎదుట 50 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో 10 మంది మహిళలు ఉన్నారు. వారిలో ఆరుగురిపై రూ.8లక్షల, 13మందిపై రూ.68లక్షల రివార్డ్ ఉంది.మావోయిస్టు సిద్ధాంతాలకు దూరంగా ఉండాలని నిశ్చయించుకువడం, వారి సీనియర్ కేడర్ స్థానిక గిరిజనుల్ని దోచుకోవడం, అంతర్గత విభేదాల కారణంగా లొంగిపోయినట్లు బీజాపూర్ సీనియర్ ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా వారికి పునరావసం కల్పిస్తామని చెప్పారు.అయితే, మార్చి 31, 2026లోపు నక్సలిజాన్ని నిర్మూలించేందుకు కేంద్రం కట్టుబడి ఉంది. ఆ దిశగా మావోయిస్టులను ఏరిపారేస్తుంది. శనివారం శనివారం ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా, బీజాపూర్ జిల్లాల్లో భద్రతా దళాలు రెండు ప్రాంతాల్లో జరిపిన ఎదురుకాల్పుల్లో 18 మావోయిస్టులను మట్టుబెట్టాయి. వీరిలో 11 మంది మహిళలు ఉన్నారు. ఆ భారీ ఎన్కౌంటర్ జరిగిన కొన్ని గంటల వ్యవధిలో మావోయిస్టులు లొంగిపోయారు.#Chhattisgarh: 50 Maoists have surrendered in Bijapur district. Out of these, 13 Maoists had a reward of Rs. 68 lakhs declared on their heads.For the first time in the state, such a large number of Maoists have surrendered together.Bijapur district's Superintendent of Police… pic.twitter.com/aAfakC1FJA— All India Radio News (@airnewsalerts) March 30, 2025కాగా,ఈ ఏడాది ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 134 మావోయిస్టులు ఎదురుకాల్పుల్లో హతమయ్యారు. వీరిలో 118 మంది బస్తర్ డివిజన్‌లోనే మృతి చెందారు.2024లో, బస్తర్ ప్రాంతంలోని ఏడు జిల్లాల్లో కలిపి మొత్తం 792 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు.

ఒడిశాలో రైలు ప్రమాదం
భువనేశ్వర్ : ఒడిశాలో రైలు ప్రమాదం జరిగింది. నెర్గుండి సమీపంలో కామాఖ్య ఎక్స్‌ప్రెస్ ట్రైన్ పట్టాలు తప్పింది. ఈ ఘటనలో 11 బోగీలు పక్కకు పడిపోయాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. ఈస్ట్‌కోస్ట్ రైల్వే సీపీఆర్వో అశోక్ కుమార్ మిశ్రా వివరాల మేరకు.. కటక్‌లోని నెర్గుండి రైల్వే స్టేషన్ సమీపంలో ట్రైన్ నెంబర్ 12551 కామాఖ్య సూపర్ పాస్ట్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది.ట్రైన్ ప్రమాదం జరిగిన వెంటనే మెడికల్ ఎమర్జెన్సీ టీం ఘటనా స్థలానికి చేరుకుంది. గాయపడిన క్షతగాత్రులకు చికిత్స అందించారు. సీనియర్ రైల్వే అధికారులు సైతం ఘటన స్థలానికి చేరుకున్నారు.ప్రమాదానికి గల కారణాల్ని ఆరా తీస్తున్నారు. మరోవైపు, రైల్వే రాకపోకలకు ఎలాంటి అంతరాయం జరగకుండా రూట్లను మళ్లించారు. #WATCH | Bhubaneswar, Odisha: On Kamakhya Express train derailed near Nergundi Railway Station in Cuttack, Ashoka Kumar Mishra, CPRO, East Coast Railway says "We got information about the derailment of some coaches of 12551 Kamakhya Superfast Express. As of now, we have the… pic.twitter.com/olrYv7CRRX— ANI (@ANI) March 30, 2025
NRI

ఫిలడెల్ఫియాలో తానా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
తానా మిడ్-అట్లాంటిక్ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఫిలడెల్ఫియాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. పెన్సిల్వేనియా రాష్ట్రంలోని వెస్ట్ చెస్టర్ నగరంలో పియర్స్ మిడిల్ స్కూల్ లో నిర్వహించిన ఈ వేడుకలకు వెయ్యికి మందికి పైగా హాజరై సాంస్కృతిక కార్యక్రమాలు, స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలు, డైనమిక్ ఫ్యాషన్ షో, స్టాల్ల్స్, రుచికరమైన విందుతో ఆరు గంటల నాన్ స్టాప్ వినోదాన్ని ఆస్వాదించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గత ఐదున్నర దశాబ్దాల నుండి డెలావేర్ రాష్ట్రంలోని డోవర్ నగరంలో విశేషసేవలు అందిస్తున్న ప్రముఖ చిన్న పిల్లల వైద్యురాలు డాక్టర్ జానకి కాజా గారిని తానా బోర్డు ఆఫ్ డైరెక్టర్ రవి పొట్లూరి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డాక్టర్ జానకి కాజా అమెరికా వచ్చినప్పటి నుంచి అనుభవాలను వివరిస్తూ స్ఫూర్తిదాయకమైన ప్రసంగం చేసారు. మన జన్మభూమి భారతదేశం లాగానే కర్మభూమి అమెరికా చాలా గొప్ప దేశమని 1971 లో అమెరికా లో అడుగుపెట్టినప్పటి నుండి ఈరోజు వరకు ఆసుపత్రికి వెళ్లినా, 86 దేశాలు పర్యటించినా మన భారతీయ సంప్రదాయం మరచిపోకుండా తాను ఇప్పటికీ చీర మాత్రమే ధరిస్తానని చీర మన సాంస్కృతిక గర్వానికి చిహ్నంగా ఉంటుందని పేర్కొంటూ మహిళల జీవితం సవాళ్లతో కూడినదని పట్టుదలతో, దృఢసంకల్పంతో అవకాశాలు అందిపుచ్చుకుని జీవితంలో ఎదగాలని ఆకాంక్షించారు. తానా మిడ్ అట్లాంటిక్ మహిళల బృందం ఈ కార్యక్రమం విజయవంతం కోసం అవిశ్రాంతంగా పనిచేసింది. మిడ్-అట్లాంటిక్ మహిళా కమిటీ ఛైర్ సరోజా పావులూరి నేతృత్వంలోని బృందం ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు. వ్యాఖ్యాత లక్ష్మి మంద ఎనర్జిటిక్ హోస్టింగ్‌తో అలరించారు. రాజేశ్వరి కొడాలి, భవాని క్రొత్తపల్లి, సౌజన్య కోగంటి, రవీనా తుమ్మల, భవానీ మామిడి, మైత్రి రెడ్డి నూకల, నీలిమ వోలేటి , రమ్య మాలెంపాటి, బిందు లంక, దీప్తి కోకా తదితరుల కృషిని హాజరైన వారందరూ అభినందించారు.తానా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ రవి పొట్లూరి తన ప్రసంగంలో మహిళలకు అభినందనలు తెలిపారు. తానా ఫౌండేషన్ మరియు ఇతర సేవా సంస్థల ద్వారా అమెరికాలోనే కాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా మిలియన్ల డాలర్లు వెచ్చించి ఎనలేని సేవలందిస్తున్న బాబు రావు, డాక్టర్ జానకి కాజా దంపతులు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని తెలిపారు. డెలావేర్ మిడిల్ టౌన్ నమస్తే ఇండియా రెస్టారంట్ సహా వాలంటీర్లు మరియు క్రాస్ రోడ్స్ రెస్టారంట్, జో కేధార్, రాజన్ అబ్రహం ఇతర దాతలకు అభినందనలు తెలిపారు.2025 జూలై 3 నుంచి 5 వరకు డెట్రాయిట్లో 24వ తానా మహాసభలు జరగబోతున్నాయని తెలిపారు. అందమైన అలంకరణలకు ఫణి కంతేటి మరియు సంగీతాన్ని అందించినందుకు మూర్తి నూతనపాటి, రమణ రాకోతు, ఫోటోగ్రఫీ విశ్వనాధ్ కోగంటిలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తానా మిడ్ అట్లాంటిక్ ప్రాంతీయ ప్రతినిధి వెంకట్ సింగు, సతీష్ తుమ్మల, సునీల్ కోగంటి, టీం స్క్వేర్ చైర్మన్ కిరణ్ కొత్తపల్లి, కృష్ణ నందమూరి, రంజిత్ మామిడి, గోపి వాగ్వాల, సురేష్ యలమంచి, చలం పావులూరి, ప్రసాద్ క్రొత్తపల్లి, కోటి యాగంటి, రవి ముత్తు, రాజు గుండాల, శ్రీనివాస్ అబ్బూరి, సుబ్బా ముప్పా, లీలాకృష్ణ దావులూరి, జాన్ ఆల్ఫ్రెడ్, హేమంత్ ఎర్నేని, సనత్ వేమూరి, హరీష్ అన్నాబత్తిన, రంజిత్ కోమటి, సంతోష్ రౌతు, ఉత్తమ్, హేమరాజ్, రాజా గందె, నాగ రమేష్, కృషిత నందమూరి, ప్రసాద్ కస్తూరి తదితరులు ఈ వేడుకలను విజయవంతం చేయడంలో కృషి చేశారు.

టీటీఏ (TTA) న్యూయార్క్ చాప్టర్ రీజినల్ వైస్ ప్రెసిడెంట్‌గా జయప్రకాష్ ఎంజపురి
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్(TTA) న్యూయార్క్ చాప్టర్‌కి రీజినల్ వైస్ ప్రెసిడెంట్ (RVP)గా జయప్రకాష్ ఎంజపురి ఎంపికయ్యారు. టీటీఏ వ్యవస్థాపకులు డాక్టర్ పైళ్ల మల్లా రెడ్డి నాయకత్వంలో 2025-2026 కాలానికి ఈ ఎంపిక జరిగిందని కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది. TTA వ్యవస్థాపకుడు, సలహా మండలి, TTA అధ్యక్షుడు, కార్యనిర్వాహక కమిటీ, డైరెక్టర్ల బోర్డు, స్టాండింగ్ కమిటీలు (SCలు) ప్రాంతీయ ఉపాధ్యక్షులు (RVP) ల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. అలాగే పదవీ విరమణ చేస్తున్న RVP సత్య ఎన్ రెడ్డి గగ్గెనపల్లి అందించిన సేవలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది.జయప్రకాష్ ఎంజపురి (జే)కు వివిధ సంస్థలలో సమాజ సేవలో 16 సంవత్సరాలకు పైగా అనుభవముందని ప్రపంచ మారథానర్ టీటీఏ వెల్లడించింది. న్యూయార్క్‌లోని తెలుగు సాహిత్య మరియు సాంస్కృతిక సంఘం (TLCA) 51వ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆరు ప్రపంచ మేజర్ మారథాన్లను పూర్తి చేసిన మొదటి తెలుగు సంతతి వ్యక్తి, 48వ భారతీయుడు నిలిచారు. ఈ రోజు వరకు, జే ప్రపంచవ్యాప్తంగా 18 మారథాన్లను పూర్తి చేశాడు. క్రీడలకు ఆయన చేసిన కృషికి గుర్తింపుగా, 2022లో న్యూజెర్సీలో జరిగిన TTA మెగా కన్వెన్షన్‌లో "లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ ఇన్ స్పోర్ట్స్" అవార్డుతో అందుకున్నారు. సెప్టెంబర్ 2023లో, అతను ఆఫ్రికాలోని ఎత్తైన శిఖరం , ప్రపంచంలోనే 4వ ఎత్తైన పర్వతం అయిన కిలిమంజారో పర్వత శిఖరాన్ని అధిరోహించారు. అలాగే గత ఏడాది జూన్‌లో పెరూలోని పురాతన పర్వత శిఖరం సల్కాంటే పాస్‌ను జయించాడు. ఈ ఏడాది సెప్టెంబరులో జే తన తదుపరి గొప్ప సాహసయాత్రకు సిద్ధమవుతున్నాడనీ, గొప్ప సాహస యాత్రీకుడుగా ఆయన అద్భుత విజయాలు,ఎంతోమందికి ఔత్సాహికులకు పరిమితులను దాటి ముందుకు సాగడానికి ప్రేరేపిస్తున్నాడని కమిటీ ప్రశంసించింది. NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండిన్యూయార్క్ బృందంలో కొత్త సభ్యులున్యూయార్క్ బృందంలో సహోదర్ పెద్దిరెడ్డి (కోశాధికారి), ఉషా రెడ్డి మన్నెం (మ్యాట్రిమోనియల్ డైరెక్టర్), రంజిత్ క్యాతం (BOD), శ్రీనివాస్ గూడూరు (లిటరరీ & సావనీర్ డైరెక్టర్) ఉన్నారు. మల్లిక్ రెడ్డి, రామ కుమారి వనమా, సత్య న్ రెడ్డి గగ్గెనపల్లి, సునీల్ రెడ్డి గడ్డం, వాణి సింగిరికొండ, హరి చరణ్ బొబ్బిలి, సౌమ్య శ్రీ చిత్తారి, విజేందర్ బాసా, భరత్ వుమ్మన్నగారి మౌనిక బోడిగం. టీటీఏ కోర్ టీమ్ సభ్యులుగా పని చేస్తారు-TTA వ్యవస్థాపకుడు: డాక్టర్ పైళ్ల మల్లా రెడ్డి -సలహా సంఘం:-అధ్యక్షుడు: డాక్టర్ విజయపాల్ రెడ్డి గారు-సహాధ్యక్షులు: డాక్టర్ మోహన్ రెడ్డి పాటలోళ్ల -సభ్యులు: భరత్ రెడ్డి మాదాడి శ్రీని అనుగు-TTA అధ్యక్షుడు: నవీన్ రెడ్డి మల్లిపెద్ది

న్యూజెర్సీలో ఘనంగా ‘మాట’ మహిళా దినోత్సవ వేడుకలు
మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ, మహిళా సాధికారతకు, అభ్యున్నతికి పలు కార్యక్రమాలు చేపడుతున్న మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ - మాట అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించింది. అమెరికాలోని న్యూజెర్సీలో ఉమెన్స్ డే వేడకలను అంగరంగ వైభవంగా నిర్వహించి.. వనితలు తలుచుకుంటే ఏదైనా సాధించగలరని మాట ఉమెన్ కమిటీ మరోసారి రుజువు చేసింది. ప్రముఖ సినీ నటి, ఇంద్రాణి ఫేమ్ అంకితా జాదవ్ ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై.. ప్రసంగించారు. సింగర్ దామిని భట్ల, దీప్తి నాగ్ తో పాటు పలువురు ప్రముఖులు అతిథులుగా హాజరయ్యారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని అంకితా కొనియాడారు. ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించిన మాట కార్యవర్గాన్ని అభినందించారు. అంకితా జాదవ్ నటించిన ఆల్బమ్ సాంగ్స్ ను ఈ వేదికగా ప్రదర్శించారు. ఈ వేడుకల్లో మహిళామణులు పెద్ద సంఖ్యలో పాల్గొని కనువిందు చేశారు. ఇక వేదికపై నిర్వహించిన పలు కార్యక్రమాలు మహిళల సంతోషాల మధ్య ఆహ్లదంగా సాగాయి. యువతులు, మహిళల ఆట, పాటలతో.. సంబరాల సంతోషాలు అంబరాన్నంటాయి. అటు సంప్రదాయం.. ఇటు ఆధునికత ఈ రెండింటిని ప్రతిబింబిస్తూ ఎన్నో కార్యక్రమాలతో మహిళలు ఆకట్టుకున్నారు. శాస్త్రీయ నృత్యం, మోడ్రన్ డ్యాన్స్ రెండింటిలో తమకు సాటి లేదని నిరూపించారు.MS మాట కాంపిటీషన్, ఫ్యాషన్ షో, బ్యూటీ పాజెంట్ వంటి అద్భుతమైన ప్రదర్శనలు ఆహుతులను ఆకర్షించాయి. ఈ ప్రదర్శనల్లో మగువలు పెద్ద సంఖ్యలో పాల్గొని మహిళా శక్తి ఏమిటో నిరూపించారు. అందాల ముద్దుగుమ్మలు హొయలు పోతూ ర్యాంప్‌పై క్యాట్ వాక్ చేశారు. అందాల పోటీలకు నటి అంకితా జాదవ్ తో పాటు పలువురు ప్రముఖులు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. MS మాట కాంపిటీషన్ 2025 విజేతకు కిరీటాన్ని బహూకరించారు. పోటీల్లో పాల్గొన్న మగువలకు బెస్ట్ స్మైల్, బెస్ట్ వాక్ వంటి పలు విభాగాల్లో అవార్డులు అందించారు. ఫోటో బూత్, ఇండో వెస్ట్రన్ అవుట్ ఫిట్, ఫన్ ఫీల్డ్ గేమ్స్, రాఫెల్ టికెట్స్ వంటి కార్యక్రమాలు అమితంగా ఆకట్టుకున్నాయి.వేదికపై మగువలు, చిచ్చర పిడుగులు ప్రదర్శించిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. డ్యాన్స్‌లు, డిజె మ్యూజిక్ కార్యక్రమాలు హోరెత్తించాయి. సంప్రదాయ ఫ్యాషన్ షో, గేమ్స్ తో పాటు ఇతర కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమంలో భాగంగా వెండర్స్ బూత్ ఏర్పాటు చేశారు. మహిళలు షాపింగ్ స్టాల్స్ దగ్గర సందడి చేశారు. తమకు నచ్చిన వస్తువులను కొనుగోలు చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతిఒక్కరికీ పసందైనా విందుభోజనం అందించారు. ఆహా ఏమి రుచి… తినరా మైమరచి.. అనే మాటను నిజం చేస్తూ ఎంతో రుచికరమైన భోజనాలు అందించారు. స్వీట్స్ నుంచి ఐస్ క్రీమ్ వరకు పలు వైరటీలతో రుచికరమైన వంటకాలు ఏర్పాటు చేశారు. మాట మహిళా నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న మహిళా ప్రసంగాలతో పాటు అనేక సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. మాట నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులను సత్కరించారు. సంస్థ మహిళలకు ఇస్తున్న ప్రాధాన్యత, మహిళా సాధికారతకు, అభ్యున్నతికి మాట అధ్వర్యంలో చేపట్టిన ప్రణాళికలను నాయకులు వివరించారు. ఈ సందర్భంగా సంస్థ తరుపున చేస్తున్న పలు కార్యక్రమాలను వివరించారు. స్త్రీలు ప్రతి కష్టాన్ని ధైర్యంగా ఎదుర్కుంటూ ముందుకు సాగాలని పలువురు ప్రముఖులు హితవు పలికారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. మాట పలువురిని అవార్డుతో సత్కరించింది. అలాగే సభా వేదికపై పలువురిని సన్మానించి, సత్కరించారు. మాట కార్యక్రమాలు అండగా ఉంటూ, సహాయసహాకారాలు అందిస్తున్న ప్రతిఒక్కరినీ నిర్వహకులు ప్రశంసించారు. ఈ సంబరాలను అద్భుతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించిన ప్రతిఒక్కరినీ మాట ఉమెన్ కమిటీ ప్రత్యేకంగా అభినందించింది. ఈ వేడుకకు విచ్చేసిన స్త్రీమూర్తులకు నిర్వహకులు కృతజ్ఞతలు తెలియజేశారు. విందు - వినోదాలతో మాట - అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఎంతో ఉత్సహంగా సాగాయి. ఈ సంబరాల్లో మేము సైతం అంటూ వెయ్యి మందికి పైగా మహిళలు ముందుకొచ్చి ఉమెన్స్ డే వేడుకలను గ్రాండ్ సక్సెస్ చేశారు. సంబరమాశ్చర్యాలతో, ఆసాంతం ఆహ్లాద పరిచేలా ఈ వేడుకను కనువిందుగా నిర్వహించారు. వేలాదిగా ఆదర్శ వనితలు ఒక చోటు చేరి, అటపాటలతో, కేరింతలతో హోరేత్తించడం.. మాట విజయానికి మచ్చుతునకగా చెప్పవచ్చు.

ఫ్లోరిడాలో అత్యున్నత స్థాయి ‘హెర్ హెల్త్ ఆంకాలజీ కాంగ్రెస్ 2025’
అమెరికాలోని ఫ్లోరిడాలోని ఓర్లాండో నగరంలో మెడికల్ కాన్ఫరెన్స్ ఘనంగా జరిగింది. 70-80 మంది ఆంకాలజిస్టులు, ప్రైమరి కేర్ డాక్టర్లు హాజరైన ఈ కార్యక్రమం, ఇన్నోవేటివ్ ఎడ్యుకేషన్‌కి ఒక వేదికగా పనిచేసిందని నిర్వాహకులు తెలిపారు. ఈ సదస్సు ప్రముఖ కీనోట్ వక్త, డాక్టర్ బార్బరా మెకనీ, మాజీ AMA ఉపాధ్యక్షురాలు ఆంకాలజి పరిశోధన, పక్షవాతం, పేషంట్ కేర్ మొదలైన అంశాల ప్రాముఖ్యాన్ని వివరించారు.‘హెర్ హెల్త్ ఆంకాలజీ కాంగ్రెస్ 2025 తన విజన్‌ను నిజం చేసింది. మహిళల కోసం క్యాన్సర్ సంరక్షణను ముందుకు తీసుకెళ్లడంలో వైద్య సమాజాన్ని శక్తివంతం చేయడానికి, అవగాహన నిమిత్తందీన్ని రూపొదిచామనీ, ఈమెడ్ ఈవెంట్స్, ఈమెడ్ ఎడ్ సీఈఓగా, శంకర నేత్రాలయ, యూఎస్ఏ సీఎమ్ఈ చైర్‌పర్సన్‌గా(USA CME) ఒక మహిళగా, మహిళా ఆరోగ్య సంరక్షణలో మార్పు తీసుకురావడానికి ఇదొక సదవకాశమని’ డాక్టర్ ప్రియా కొర్రపాటి సంతోషం వ్యక్తం చేశారు. మరిన్ని NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి!చైర్పర్సన్ డాక్టర్ సతీష్ కత్తుల, ఆంకాలజిస్ట్, హెమటాలజిస్ట్, AAPI అధ్యక్షుడు, మహిళలలో సాధారణ క్యాన్సర్లను పరిష్కరించడం, నిరంతర అవగాహన ప్రాముఖ్యతను హైలైట్ చేశారు. కాంగ్రెస్‌లో 10 మంది అత్యున్నత నైపుణ్యం కలిగిన వక్తలు ఉన్నారని, ప్రతి ఒక్కరూ ఆంకాలజీలో పురోగతి, సమగ్ర రోగి సంరక్షణపై దృష్టిపెడుతున్నారని డా. ప్రియా అన్నారు. ఈ కాంగ్రెస్‌ను కేవలం ఒక కార్యక్రమం కాకుండా, కంటిన్యూస్ లర్నింగ్ చేయాలనే తమ లక్ష్యాన్ని బలోపేతం చేశారన్నారు. AAPI, CAPI (టంపా నుండి స్థానిక అధ్యాయం) eMed Ed తో కలిసి చేస్తున్న సహకార ప్రయత్నాలను డా. సతీష్ అభినందించారు. ప్రత్యేక ఆకర్షణలుNFL ఆటగాడు షెప్పర్డ్ స్టెర్లింగ్ ఈ సదస్సు హాజరు కావడం విశేషం. ఆంకాలజీ వంటి క్రిటికల్ కేర్ వైద్యులలో చాలా ఉద్యోగపరైమన ఒత్తిడి అధికంగా ఉంటుంది దాని కోసం ప్రత్యేకంగా ఆంకాలజీ బర్నవుట్ సెషన్ నిర్వహించటం మరో విశేషం. డాక్టర్ వర్షా రాథోడ్, ఇంటిగ్రేటివ్ మెడిసిన్ స్పెషలిస్ట్, ఓర్లాండో, ఫ్లోరిడా ఈ సెషన్ నిర్వహించారు. డాక్టర్ శైలజ ముసునూరి, ఇంటిగ్రేటెడ్ మెడిసిన్, చీఫ్ ఆఫ్ సైకియాట్రి, వుడ్ సర్వీసెస్, పెన్సిల్వేనియా వారు నిర్వహించిన సైకాలజికల్ ఆంకాలజీ సెషన్ ఆకట్టుకుంది. క్యాన్సర్ కేర్ లో మెడికల్ ట్రీట్మెంట్ మాత్రమే కాకుండా, రోగుల మానసిక, భావోద్వేగ స్థితిని కూడా సమర్థంగా నిర్వహించాలని పేర్కొన్నారు.వాలంటీర్ల దృక్పదంస్పీకర్లకి మించి, ఈ కాంగ్రెస్ స్వచ్ఛంద సేవకులకు కూడా గొప్ప అనుభవాన్ని ఇచ్చిందనీ, సెషన్లు, ఆసక్తిక్రమైన చర్చలు జరిగాయి. డాక్టర్లు అనేక ప్రశ్నలను చాలా లోతైన వివరణ, పరిస్కారాలు ఇచ్చారని, క్వెషన్ అండ్ ఆన్సర్ సెషన్ చాలా ఆసక్తిగా, ఉపయోగంగా ఉందని ఆమె తెలిపారు.ఆడియన్స్ అభిప్రాయాలుమహిళల క్యాన్సర్లపై దృష్టి సారించే ఆంకాలజీ సమ్మేళనాలు అరుదుగా ఉన్నాయని, ఈ కార్యక్రమం ఆంకాలజిస్ట్‌లు, ప్రమరి కేర్ డక్టర్లు ఇద్దరికీ ఒక అమూల్యమైన అవకాశం అని అన్నారు. రోగులను ఎప్పుడు రిఫర్ చేయాలి, కొత్త చికిత్సా విధానాల ఏమున్నాయి వంటి అవసరమైన అంశాలను ఎలా నిర్వహించాలనేది తమ అభిప్రాయాల ద్వారా వెల్లడించారు.హెర్ హెల్త్ ఆంకాలజీ కాంగ్రెస్ భవిష్యత్తు హెర్ హెల్త్ ఆంకాలజీ కాంగ్రెస్ 2026 కాంగ్రెస్ ఓహియోలో జరుగుతుందని ప్రకటించారు. ఈ కార్యక్రం విజయానికి సహకరించిన అందరికీ ప్రియా కొర్రపాటి ధన్యవాదాలు తెలిపారు. అలాగే మహిళల కోసం ఆంకాలజీ సంరక్షణను ముందుకు తీసుకెళ్లే మిషన్‌లో ముందుకు సాగడానికి ఇది స్ఫూర్తినిస్తుందని ఇప్పుడున్నఆంకాలజీని ముందుకు ముందుకు తీసుకెళ్ళటానికి కలిసి పనిచేద్దామనిఆమె పిలుపునిచ్చారు.
క్రైమ్

ఇల్లరికం వచ్చిన భర్తను హత్య చేయించిన భార్య
నిజామాబాద్: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తను భార్య అంతమొందించింది. వివరాలు ఇలా ఉన్నాయి. బాన్సువాడ మండలం నాగారం గ్రా మానికి చెందిన అమృతం విఠల్ (38) అనే వ్యక్తి 20 ఏళ్ల కిత్రం సోమేశ్వర్ గ్రామంలోని మేనమామ కూతురు కాశవ్వను పెళ్లి చేసుకొని ఇల్లరికం వచ్చాడు. మేస్త్రీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వీరికి ముగ్గురు కుమార్తెలు కాగా, ఒక్కరికి పెళ్లి అయింది. విఠల్ భార్య కాశవ్వ నాగారం గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయమై భార్యాభర్తల మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి. విఠల్‌ను అంతమొందిస్తే ఏ గొడవా ఉండదని భావించిన కాశవ్వ అదే గ్రామానికి చెందిన అమృతం విఠల్(నిందితుడు), పుల్కంటి విఠల్‌కు విషయం తెలిపింది. శుక్రవారం రాత్రి విఠల్(మృతుడు)ను పొలం వద్దకు తీసుకెళ్లిన అమృతం విఠల్, పుల్కంటి విఠల్ అతిగా మద్యం తాగించి మెడకు టవల్‌తో గట్టిగా బిగించి, పైపులతో కొట్టి చంపారు. అనంతరం విఠల్ మృతదేహాన్ని కొల్లూర్ సబ్‌స్టేషన్ సమీపంలో బాన్సువాడ–బీర్కూర్ ప్రధాన రహదారిపై పడేసి వెళ్లారు. ఉదయం అటుగా వెళ్తున్న కొందరు చూసి పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి అన్న బింగి సాయిలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుడి భార్య కాశవ్వ, అమృతం విఠల్, పుల్కంటి విఠల్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా, విఠల్‌ను తామే హత్య చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారని సీఐ అశోక్ తెలిపారు. నిందితులను రిమాండ్‌కు పంపనున్నట్లు సీఐ పేర్కొన్నారు.

టెన్త్ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో మరో ఐదుగురి అరెస్ట్
నకిరేకల్: పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీ కేసులో మరో ఐదుగురిని శనివారం సాయంత్రం రిమాండ్‌కు తరలించామని నల్లగొండ జిల్లా నకిరేకల్ సీఐ రాజశేఖర్ తెలిపారు. ఈ నెల 21న నకిరేకల్‌లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పదో తరగతి పరీక్ష కేంద్రంలో ఓ యువకుడు తెలుగు ప్రశ్నపత్రాన్ని ఫొటో తీసి సామాజిక మాద్యమాల్లో వైరల్ చేసిన విషయం విధితమే. ఈ ఘటనలో మొత్తం 12 మందిపై కేసు నమోదు చేశారు. వీరిలో ఈ నెల 23న చిట్ల ఆకాష్, బండి శ్రీను, గుడుగుంట్ల శంకర్, బ్రహ్మదేవర రవిశంకర్, ఓ బాలుడుని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. కేసు తదుపరి విచారణ అనంతరం శనివారం నకిరేకల్‌కు చెందిన పోగుల శ్రీరాముల, తలారి అఖిల్‌కుమార్, ముత్యాల వంశీ, పల్స అనిల్‌కుమార్, పళ్ల మనోహర్‌ను శనివారం రిమాండ్‌కు పంపామని, ఓ బాలుడు పరారీలో ఉన్నాడని సీఐ తెలిపారు. రిమాండ్ చేసినవారిలో ఇద్దరు కాంగ్రెస్, ఇద్దరు బీఆర్ఎస్, ఒకరు బీజేపీకి చెందిన వారుగా గుర్తించామని పేర్కొన్నారు.

‘హమ్మయ్యా!’ ఆ ఆరుగురు దొరికారు
అంబేద్కర్ కోనసీమ జిల్లా, సాక్షి: ఆరుగురు విద్యార్థుల మిస్సింగ్ కేసు ఎట్టకేలకు సుఖాంతమైంది. ఐదురోజుల తర్వాత.. శనివారం ఆ పిల్లల ఆచూకీ శనివారం లభ్యమైంది. తల్లిదండ్రులు మందలించారనే వాళ్లు అలా వెళ్లిపోయినట్లు సమాచారం.డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని మండల కేంద్రమైన ఆలమూరు శివారు కండ్రిగ (యానాదుల) పేటకు చెందిన ఆరుగురు విద్యార్థులు ఈ నెల 24వ తేదీన స్కూల్‌కు వెళ్లి తిరిగి రాలేదు. బడి, ఇల్లు తప్ప ఏం తెలియని చిన్నారులు అలా కనిపించకుండా పోయేసరికి అంతా ఆందోళన చెందారు. చుట్టుపక్కల గాలించి.. బంధువులను ఆరా తీసి చివరకు స్థానిక పోలీసులను అశ్రయించారు.ఈ ఉదంతం స్థానికంగా కలకలం రేపింది. వాళ్లంతా బొబ్బా జయశ్రీ బాలికోన్నత పాఠశాలలోనే చదువుతున్నారు. స్థానికుల సాయంతో పోలీసులు చుట్టుపక్కల గాలించారు. వాళ్ల ఫొటోలను మీడియాలో, సోషల్ మీడియాలో వైరల్ చేశారు. డ్రోన్ సాయంతో పరిసర ప్రాంతాల్లో అన్వేషించారు. నాలుగు రోజులైనా ఆచూకీ తెలియరాకపోవడంతో అంతా కంగారుపడ్డారు.చివరకు పి.గన్నవరం మండలం పెదమాల లంకలో మొక్కజొన్న రైతులకు విద్యార్థులు కనిపించారు. అయితే వాళ్లు ఆకలితో ఉండడంతో భోజనం పెట్టి పంపించి వేశారు. ఈ క్రమంలో సిద్ధాంతం వద్ద ఉన్న లంకలో బాలబాలికను గుర్తించిన పోలీసులు చివరకు ఆలమూరుకు తరలించారు. తల్లిదండ్రులకు అప్పగించడంతో కథ సుఖాంతమైంది.

వీడు మనిద్దరికి పుట్టిన బిడ్డేనా?
అన్నానగర్: భార్యపై అనుమానం పెనుభూతమైంది. తామిద్దరూ నల్లగా ఉన్నా.. బిడ్డ మాత్రం మంచి రంగుతో జన్మించడంపై సందేహించాడు. బిడ్డ ఎదిగే కొద్దీ అనుమానం కూడా అదే తీరులో బలపడింది. చివరకు ఆ రెండున్నరేళ్ల చిన్నారిని గొంతు నులిమి హతమార్చాడు. ఊయల తాడు బిగుసుకుని మరణించిందని బుకాయించాడు. అయితే పోస్టుమార్టం నివేదికలో గొంతు నులమడం వల్లే చనిపోయిందని తేలడంతో ఆ కసాయి కటకటాలపాలయ్యాడు. వివరాలు..చెన్నై మన్నడి లింగుచెట్టి వీధికి చెందిన అక్రమ్ జావిద్ (33) పత్తి దుకాణంలో పని చేసేవాడు. అతని భార్య నిలోఫర్. వీరికి పెళ్లయి నాలుగేళ్లైంది. వీరికి రెండున్నరేళ్ల వయసున్న కుమార్తె పాహిమా ఉంది. గత 26వ తేదీ రాత్రి నీలోఫర్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఇఫ్తార్ ఉపవాసం విరమించేందుకు సమీపంలోని మసీదుకు వెళ్లింది. కుమార్తెతో ఇంట్లోనే జావిద్ ఉండిపోయాడు. ఇఫ్తార్ అనంతరం ఇంటికి తిరిగొచ్చిన నీలోఫర్‌కు పాహిమా మెడ తొట్టి తాడుతో ఊపిరాడక అపస్మారక స్థితికి చేరుకుందని అక్రమ్ జావిద్ తెలిపారు. వెంటనే చిన్నారిని స్టాన్లీ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ పరిశీలించిన వైద్యులు అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు నిర్ధారించారు. సమాచారం మేరకు నార్త్ కోస్ట్ పోలీస్ ఇన్స్పెక్టర్ విజయకాంత్ కేసు నమోదు చేసి చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. జావిద్‌ను ప్రశ్నిస్తే ఊయల తాడు మెడకు బిగుసుకుపోవడం వల్లే చనిపోయిందని చెప్పుకొచ్చాడు. అయితే శుక్రవారం అందిన పోస్టుమార్టం నివేదికలో చిన్నారిని గొంతు నులిమి హత్య చేసిన ఆనవాళ్లు ఉన్నాయని వెల్లడైంది. దీంతో తమదైన శైలిలో విచారణ చేసేసరికి తానే బిడ్డను గొంతు నులిమి హతమార్చినట్టు జావిత్ అంగీకరించాడు. తాను, తన భార్య నల్లగా ఉన్నప్పటికీ పుట్టిన బిడ్డ మాత్రం మంచి రంగుతో ఉండడంతో తన భార్యపై అనుమానంతోనే హత్య చేసినట్లు వాంగ్మూలమిచ్చాడు.
వీడియోలు


Pawan Kalyan: నాకు సత్తా లేదు..


హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై టోల్ ఛార్జీలు పెంపు


కుప్పంలో బాబుకు షాక్.. వర్ఫ్ బోర్డు బిల్లుకు వ్యతిరేకంగా నిరసనలు


కూటమి హయాంలో దేవదేవుడికే నిద్ర లేకుండా పోతుంది: రోజా


HCU భూములమ్మి రాష్ట్రాన్ని పాలిస్తారా?: బండి సంజయ్


ధనుష్ దర్శకత్వంలో అజిత్ సినిమా ?


సన్‌రైజర్స్ న్యూ హీరో


కర్నూల్ లో రంజాన్ వేడుకలు.. నల్ల రిబ్బన్లతో నిరసన


KSR Live Show: అర్థమైందా రాజా.. మీ తండ్రి ఏం చేశారో గుర్తుచేసుకో


మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఇంటి వద్ద ఉద్రిక్తత