వచ్చే ప్రపంచ కప్ ఇంగ్లండ్లో.. | 2019 world cup in England | Sakshi
Sakshi News home page

వచ్చే ప్రపంచ కప్ ఇంగ్లండ్లో..

Published Sun, Mar 29 2015 3:35 PM | Last Updated on Sat, Sep 2 2017 11:33 PM

వచ్చే ప్రపంచ కప్ ఇంగ్లండ్లో..

వచ్చే ప్రపంచ కప్ ఇంగ్లండ్లో..

దాదాపు నెలన్నర రోజుల పాటు అభిమానులను ఉర్రూతలూగించిన 11వ వన్డే ప్రపంచ కప్ ముగిసింది. క్రిస్ గేల్ డబుల్ సెంచరీ.. గప్టిల్ ప్రపంచ కప్ రికార్డు వ్యక్తిగత స్కోరు.. సంగక్కర వరుస సెంచరీల చరిత్ర.. టోర్నీలో అత్యధిక సెంచరీలు..  సరికొత్త రికార్డులు..  ధోనీసేన అత్యధిక వరుస విజయాలు.. న్యూజిలాండ్ జైత్రయాత్ర.. దిగ్గజాల వీడ్కోలు.. ఇలా ఎన్నో చిరస్మరణీయ జ్ఞాపకాలను మిగిల్చింది.

సెమీస్లో దక్షిణాఫ్రికా ఓటమి.. ఆఖరి మెట్టుపై న్యూజిలాండ్ నిష్ర్కమణ వంటి గుండెల్ని పిండే క్షణాలు.. ఆసీస్ ఐదోసారి ప్రపంచ కప్ అందుకోవడం అభిమానులకు గుర్తుండిపోతాయి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన 2015 ప్రపంచ కప్ అభిమానులకు ఎన్నో చేదు, మధుర స్మృతులను మిగిల్చింది. ఫిబ్రవరి 14న ఆరంభమైన ఈ మెగా ఈవెంట్ మార్చి 29న గ్రాండ్ ఫైనల్తో విజయవంతంగా ముగిసింది. వచ్చే వన్డే ప్రపంచ కప్ 2019లో ఇంగ్లండ్, వేల్స్ లో జరగనుంది. మరో వన్డే క్రికెట్ పండుగ కోసం అప్పటి దాకా ఎదురు చూద్దాం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement