
450 సిక్సర్లు.. 2109 ఫోర్లు
గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రపంచ కప్ 2015లో పరుగుల వర్షం పోటెత్తింది. అత్యధిక సెంచరీలు నమోదయ్యాయి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఆతిథ్యమిచ్చిన ఈమెగా ఈవెంట్కు మరింత ఆకర్షణ తెచ్చేందుకు పిచ్లను బ్యాటింగ్కు అనుకూలించేలా రూపొందించారు. దీంతో ఫోర్లు, సిక్సర్లతో అభిమానులు తడిసి ముద్దయ్యారు.
వన్డే ప్రపంచ కప్లో మొత్తం 21,614 పరుగులు చేశారు. బౌండరీల రూపంలో 11,136 పరుగులు వచ్చాయి. 450 సిక్సర్లు, 2109 ఫోర్లు నమోదయ్యాయి.38 సెంచరీలు, 107 హాఫ్ సెంచరీలు చేయడం విశేషం. ఇక ఈ ఈవెంట్లో 687 వికెట్లు పడగొట్టారు. ఇందులో 497 క్యాచ్ల రూపంలో అవుట్ చేశారు. మొత్తానికి వన్డే ప్రపంచ కప్లో బ్యాట్స్మెన్దే హవా.