నాలుగో వన్డేలో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. చరిత్రాత్మక ఈడెన్ గార్డెన్స్ మైదానంలో గురువారం భారత్-శ్రీలంక జట్లు తలపడుతున్నాయి.
కోల్‌కతా: నాలుగో వన్డేలో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. చరిత్రాత్మక ఈడెన్ గార్డెన్స్ మైదానంలో గురువారం భారత్-శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. భారత్ ఇప్పటికే 3-0తో సిరీస్‌ను గెలుచుకోవడంతో మరికొందరు రిజర్వ్ ఆటగాళ్లను పరిశీలించాలని భావిస్తుండగా... కనీసం ఒక్క వన్డే అయినా గెలిచి పరువు నిలబెట్టుకోవాలన్న పట్టుదలతో శ్రీలంక ఉంది. మరోవైపు భారత్ జట్టులో మూడు మార్పులు జరిగాయి. శిఖర్ ధావన్, ఇషాంత్ శర్మ, అశ్విన్ స్థానాల్లో రోహిత్ శర్మ, లెగ్‌స్పిన్నర్ కరణ్ కరణ్ శర్మ, స్టువర్ట్ బిన్నీలకు చోటు దక్కింది.