ప్రతి మ్యాచ్ ఓ తొలి అవకాశం: డివిలియర్స్ | AB De Villiers gives RCB pep talk | Sakshi
Sakshi News home page

ప్రతి మ్యాచ్ ఓ తొలి అవకాశం: డివిలియర్స్

Published Tue, Apr 25 2017 7:10 PM | Last Updated on Tue, Sep 5 2017 9:40 AM

ప్రతి మ్యాచ్ ఓ తొలి అవకాశం: డివిలియర్స్

ప్రతి మ్యాచ్ ఓ తొలి అవకాశం: డివిలియర్స్

బెంగళూరు: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్లు ఇక నుంచి జరిగే ప్రతి మ్యాచ్ ను  తొలి అవకాశంగా  భావించాలని ఆ జట్టు సీనియర్ ఆటగాడు ఏబీ డివిలియర్స్ సహచరులకు సూచించాడు. ఆదివారం కోల్ కతా తో జరిగిన మ్యాచ్ లో బెంగళూరు చిత్తుగా ఓడి ఐపీఎల్ చరిత్రలోనే ఓ చెత్తరికార్డును నమోదు చేసింది. ఈ ఓటమితో ఒత్తిడికి లోనైన ఆటగాళ్లలో స్పూర్తిని కలిగించే ఓ వీడియోను బెంగళూరు జట్టు ఫేస్ బుక్ అఫీషియల్ పేజిలో అప్ లోడ్ చేసింది.

ఈ వీడియోలో డివిలియర్స్ ఆటగాళ్లను ఓటిమిపై ప్రతి ఒక్కరు అద్దంలో చూసుకొని  ఆత్మవిమర్శ చేసుకోవాలన్నాడు. ఇప్పటికి 7 మ్యాచ్ లే అయ్యాయని, మరో 7 మ్యాచ్ లు ఆడాల్సి ఉందన్నాడు. ఇక నుంచి జరిగే ప్రతి మ్యాచ్ ను తొలి అవకాశంగా భావించి విజయాలతో రాణించాలని డివిలియర్స్ పేర్కొన్నాడు. ఈ స్పార్క్ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ నుంచే కొనసాగలని డివిలియర్స్ అభిప్రాయపడ్డాడు.
కోల్ కతా మ్యాచ్ లో కోహ్లీ గొల్డెన్ డక్, డివిలియర్స్, మిగతా బ్యాట్స్ మెన్సంతా సింగిల్ డిజిట్ కు పరిమితమవడంతో బెంగళూరు 49 పరుగులకే కుప్పకూలింది. బెంగళూరు 7 మ్యాచుల్లో 2 మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement