
కరాచీ: ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్ నిర్ణయాత్మక మూడో వన్డేలో టీమిండియా జూలు విదిల్చి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆసీస్ నిర్దేశించిన 287 పరుగుల లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ ఛేదించిన టీమిండియా మ్యాచ్‌తో పాటు సిరీస్‌ను కూడా 2-1 తేడాతో కైవసం చేసుకుంది. రోహిత్ శర్మ 119 పరుగులతో రాణించి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే రోహిత్ ఈ పరుగుల్ని సాధించే క్రమంలో 8 ఫోర్లు, 6 సిక్సర్లను కొట్టాడు. ఆసీస్ పేసర్లు మిచెల్ స్టార్క్, కమ్మిన్స్ బౌలింగ్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ రోహిత్ కొట్టిన కొన్ని అప్పర్ కట్ సిక్స్‌లపై పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ ప్రశంసలు కురిపించాడు.(ఇక్కడ చదవండి: ఇక కీపర్‌గా కేఎల్ రాహుల్: కోహ్లి)
‘ఒకసారి రోహిత్ టచ్‌లోకి వచ్చాడంటే అతన్ని ఆపడం కష్టం. అది మంచి బంతా.. చెడ్డ బంతా అనే ఆలోచనే ఉండదు. రోహిత్ బ్యాట్ నుంచి షాట్లు చాలా ఈజీగా వస్తాయి. ఫాస్ట్ బౌలింగ్‌లో రోహిత్ కొట్టిన అప్పర్ కట్ సిక్స్‌లతో నువ్వు సచిన్‌ను గుర్తు చేశావ్. 2003 వరల్డ్‌కప్‌లో సచిన్ టెండూల్కర్ నా బౌలింగ్‌లో ఇలానే సిక్స్‌లు కొట్టాడు. సెంచూరియన్‌లో జరిగిన మ్యాచ్‌లో సచిన్ థర్డ్ మ్యాన్ దిశగా కొట్టిన అప్పర్ కట్ షాట్ ఇప్పటికీ నాకు గుర్తే. దాన్ని మరోసారి నువ్వు తలపించావ్. స్టార్క్, కమ్మిన్స్ బౌలింగ్‌లో కొట్టిన ఆ షాట్లతో సచిన్ ఆడిన ఆనాటి షాట్లను జ్ఞప్తికి తెచ్చావ్’ అంటూ అక్తర్ పేర్కొన్నాడు. (ఇక్కడ చదవండి: ‘రాహుల్ ఔటైన తర్వాత అదే అనుకున్నాం’)
Comments
Please login to add a commentAdd a comment