
న్యూఢిల్లీ: వరల్డ్‌కప్ వంటి మెగా టోర్నీలో అందులోనూ విజేతను ప్రకటించే క్రమంలో ‘బౌండరీ రూల్’ ను పాటించడంపై బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ పంచ్‌ల వర్షం కురిపించారు. ఇప్పటికే ఈ విధానంపై పలువురు విస్మయం వ్యక్తం చేయగా, ఆ జాబితాలో ఇప్పుడు బిగ్ బీ కూడా చేరిపోయారు. తన ట్వీటర్ అకౌంట్‌లో ఐసీసీ అవలంభించిన విధానాన్ని కడిగిపారేశారు. ‘నీ వద్ద రెండు వేల రూపాయిలు ఉన్నాయనుకుందాం. నా వద్ద రెండు వేల రూపాయిలు నోటు ఒకటే ఉంటే, అప్పుడు నీ దగ్గర నాలుగు ఐదు వందల నోట్లు ఉన్నాయి. అప్పుడు ఎవరు ధనికులు అవుతారు ఐసీసీ. మీ లెక్కన నాలుగు ఐదు వందల నోట్లు ఉన్న వాడే ధనికుడు అవుతాడా? అంటూ సెటైర్లు వేశారు.
ఐసీసీ రూల్స్‌పై బాలీవుడ్ విలక్షణ నటుడు పరేష్ రావల్ సైతం ఘాటైన కౌంటర్ ఇచ్చారు. ‘ఎంఎస్ ధోని గ్లౌవ్స్ మార్చాలంటూ గగ్గోలు చేసిన ఐసీసీ, ముందు సూపర్ ఓవర్ రూల్స్ మార్చుకుంటే బాగుంటుంది’ అని చురకలంటించారు. న్యూజిలాండ్‌తో జరిగిన వరల్డ్‌కప్ ఫైనల్లో ఇంగ్లండ్ అత్యధిక బౌండరీల ఆధారంగా చాంపియన్‌గా నిలిచింది. మ్యాచ్, సూపర్ ఓవర్ రెండు టై కావడంతో విజేతను తేల్చేందుకు బౌండరీ రూల్‌ను అవలంభించారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.
T 3227 - आपके पास 2000 रूपये, मेरे पास भी 2000 रुपये,
— Amitabh Bachchan (@SrBachchan) 15 July 2019
आपके पास 2000 का एक नोट, मेरे पास 500 के 4 ...
कौन ज्यादा अमीर???
ICC - जिसके पास 500 के 4 नोट वो ज्यादा रईस.. #Iccrules😂😂🤣🤣
प्रणाम गुरुदेव
Ef~NS