సాక్షి, హైదరాబాద్: సౌత్‌జోన్ మహిళల క్రికెట్ టోర్నమెంట్‌లో రెండు వరుస విజయాల తర్వాత హైదరాబాద్ జట్టు పరాజయం పాలైంది. గుంటూరులో ఆంధ్ర జట్టుతో జరిగిన ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. మొదట బ్యా టింగ్ చేసిన హైదరాబాద్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 123 పరుగులు చేసింది.
లక్ష్మీ ప్రసన్న (30) టాప్ స్కోరర్. ఆంధ్ర బౌలర్లలో దేవిక 3, పుష్పలత 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం స్వల్ప లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన ఆంధ్ర జట్టు 30.4 ఓవర్లలో 2 వికెట్లకు 124 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్ దుర్గ (64; 10 ఫోర్లు) అర్ధసెంచరీతో ఆకట్టుకోగా, ఎన్. అనూష (20), పద్మజ (29 నాటౌట్) రాణించారు.
Comments
Please login to add a commentAdd a comment