సాక్షి, హైదరాబాద్: బీసీసీఐ సౌత్‌జోన్ ఇంటర్ స్టేట్ అండర్–23 మహిళల టి20 క్రికెట్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ చిత్తుగా ఓడిపోయింది. గుంటూరు జిల్లా మూలపాడులో బుధవారం ఆంధ్రతో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ బ్యాటింగ్‌లో పూర్తిగా విఫలమైంది. 18.4 ఓవర్లలో కేవలం 54 పరుగులకే కుప్పకూలింది. ఒక్కరు కూడా రెండంకెల స్కోరు సాధించలేకపోయారు.
ఆంధ్ర బౌలర్లలో పద్మజ 3 వికెట్లతో చెలరేగగా... కె. జ్యోతి, కె. ధాత్రి చెరో 2 వికెట్లు దక్కించుకున్నారు. అనంతరం ఆంధ్ర జట్టు 16.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 60 పరుగులు చేసి గెలుపొందింది. ఎన్. అనూష (23), ఝాన్సీలక్ష్మి (31) రాణించారు. సౌత్‌జోన్ గ్రూపులో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లాడిన హైదరాబాద్ 2 విజయాలతో 8 పాయింట్లు సాధించి మూడో స్థానంలో ఉంది. ఆంధ్ర (16), కేరళ (12) జట్లు తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment