చెన్నై: వరుసగా రెండు విజయాలతో ఊపు మీదున్న ఆంధ్ర జట్టుకు గుజరాత్ చేతిలో 182 పరుగుల తేడాతో దారుణ పరాజయం ఎదురైంది. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా శుక్రవారం జరిగిన గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో 289 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆంధ్ర 31.5 ఓవర్లలో 106 పరుగులకే కుప్పకూలింది. రవితేజ (64 బంతుల్లో 44; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలవగా... ఓపెనర్ ప్రశాంత్ (26 బంతుల్లో 10)దే ఆ తర్వాత అత్యధిక స్కోరు.
అంతకుముందు బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ జట్టు.. కెప్టెన్ పార్థీవ్ పటేల్ (123 బంతుల్లో 104; 11 ఫోర్లు) సెంచరీ సహాయంతో 50 ఓవర్లలో ఏడు వికెట్లకు 288 పరుగులు చేసింది. మరోవైపు కోల్‌కతాలో జరిగిన గ్రూప్ ‘డి’ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు 21 పరుగుల ఆధిక్యంతో ధోని సారథ్యంలోని జార్ఖండ్ జట్టును ఓడించింది.
ఆంధ్రకు భారీ ఓటమి
Published Sat, Mar 4 2017 1:15 AM | Last Updated on Sat, Jun 2 2018 5:38 PM