రోహిత్‌ ట్వీట్‌కు బదులిచ్చిన అనుష్క | Anushka thanks Rohit Sharma for post marriage advice | Sakshi
Sakshi News home page

రోహిత్‌ ట్వీట్‌కు బదులిచ్చిన అనుష్క

Published Fri, Dec 15 2017 11:30 AM | Last Updated on Fri, Nov 9 2018 6:46 PM

Anushka thanks Rohit Sharma for post marriage advice - Sakshi

న్యూఢిల్లీ:కొన్ని రోజుల క్రితం భారత్‌ క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి-బాలీవుడ్‌ నటి అనుష్క శర్మలు ఇటలీలో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం  ఈ జంట హానీమూన్‌ ఎంజాయ్‌ చేస్తుండగా టీమిండియా తాత్కాలిక కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఓ సలహా ఇచ్చాడు. 'మీ ఇద్దరికి కంగ్రాట్స్‌. త్వరలో హ్యాండ్‌బుక్‌ను మీతో షేర్‌ చేసుకుంటా. అనుష్క శర్మా.. ఇంటి పేరును మార్చుకోవద్దు' అని ట్వీట్‌ చేశాడు. శ్రీలంకతో బుధవారం మొహాలీలో జరిగిన రెండో వన్డేకు ముందు విరుష్క జోడికి రోహిత్‌ ఇలా విషెస్‌ తెలియజేశాడు.

అయితే తన సహచరుడి ట్వీట్‌కు కోహ్లీ ఇంకా స్పందించాల్సి ఉన్నా అనుష్క మాత్రం వెంటనే బదులిచ్చింది. 'థ్యాంక్స్‌ రోహిత్‌. నీ అద్భుత ఇన్నింగ్స్‌కు కంగ్రాట్స్‌' అని బదులిచ్చింది. లంకేయులతో రెండో వన్డేలో రోహిత్‌ శర్మ డబుల్‌ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. శ్రీలంక బౌలర్లపై విశ్వరూపం ప్రదర్శించిన రోహిత్‌ చివరి వరకూ క్రీజ్‌లో ఉండి 208 పరుగులు సాధించాడు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement