క్వార్టర్ ఫైనల్లో అరవింద్ | Arvind enters men's singles quarterfinals of German Open | Sakshi
Sakshi News home page

క్వార్టర్ ఫైనల్లో అరవింద్

Published Fri, Feb 28 2014 1:15 AM | Last Updated on Sat, Sep 2 2017 4:10 AM

Arvind enters men's singles quarterfinals of German Open

జర్మన్ ఓపెన్ గ్రాండ్ ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్
  న్యూఢిల్లీ : జర్మన్ ఓపెన్ గ్రాండ్ ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత ఆటగాడు అరవింద్ భట్ జోరు కొనసాగుతోంది. పురుషుల సింగిల్స్ మూడో రౌండ్‌లో అరవింద్ 21-14, 21-12తో డారెన్ ల్యూ (మలేసియా)పై గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. ఇక అరవింద్ క్వార్టర్స్‌లో విక్టర్ అక్సెల్‌సెన్ (డెన్మార్క్)తో తలపడనున్నాడు.
 
  సింగిల్స్ మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో ఆనంద్ పవార్ (భారత్) 14-21, 11-21తో తిన్ చెన్ (చైనీస్ తైపీ) చేతిలో, హెచ్.ఎస్. ప్రణయ్ (భారత్) 14-21, 15-21తో వాన్ హో సన్ (కొరియా) చేతిలో చిత్తయ్యారు. మహిళల సింగిల్స్ రెండో రౌండ్‌లో అరుంధతి 18-21, 16-21తో ఏడో సీడ్ ఎరికో హిరోస్ (జపాన్) చేతిలో పోరాడి ఓడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement