![వయసైపోయింది కదా...](/styles/webp/s3/article_images/2017/09/3/41432410819_625x300.jpg.webp?itok=rK97MssM)
వయసైపోయింది కదా...
ఈ ఏడాది ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ ఆశిష్ నెహ్రా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. ఇప్పటికే 22 వికెట్లతో ధోనిసేన ఫైనల్‌కు చేరడంలో కీలక పాత్ర పోషించాడు. ఇంత అద్భుతంగా ఎలా బౌలింగ్ చేస్తున్నారని అడిగితే నెహ్రా కాస్త భిన్నంగా స్పందించాడు. ‘నేను గత 10 సంవత్సరాలుగా నిలకడగానే ఆడుతున్నాను. ఐపీఎల్‌లో అవకాశం లభించిన ప్రతి సీజన్‌లోనూ రాణించాను. కానీ ఎవరూ గుర్తించలేదు. ఇప్పుడు నా వయసు 36 సంవత్సరాలు. వయసైపోయిన వ్యక్తి వికెట్లు తీస్తున్నాడని ఇప్పుడు నన్ను గుర్తిస్తున్నారనుకుంటా’ అని అన్నాడు.