![Asian Hockey Championship 2018: India 0 | 0 Malaysia at full time - Sakshi](/styles/webp/s3/article_images/2018/10/24/Untitled-29.jpg.webp?itok=n6i0MbAe)
మస్కట్ (ఒమన్): ఆసియా హాకీ చాంపియన్స్ ట్రోఫీలో వరుసగా నాలుగో విజయం సాధించాలని ఆశించిన భారత్‌ను మలేసియా జట్టు నిలువరించింది. నిర్ణీత సమయంలో రెండు జట్లు గోల్ చేయకపోవడంతో మ్యాచ్ 0–0తో ‘డ్రా’గా ముగిసింది. భారత్‌కు రెండు పెనాల్టీ కార్నర్‌లు లభించినా వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయింది.
నాలుగేసి లీగ్ మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న భారత్, మలేసియా జట్లు మూడు విజయాలు సాధించి ఒక ‘డ్రా’ నమోదు చేశాయి. ఇరుజట్లు 10 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాయి. నేడు జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో దక్షిణ కొరియాతో భారత్ తలపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment