భారత్‌లో ఉగ్రవాద దాడులకు దిగబడితే పాకిస్తాన్‌తో క్రికెట్ ఆడేది లేదని బీసీసీఐ కారద్యర్శి అనురాగ్ ఠాకూర్ హెచ్చరించారు.
పీసీబీని హెచ్చరించిన బీసీసీఐ
న్యూఢిల్లీ: భారత్‌లో ఉగ్రవాద దాడులకు దిగబడితే పాకిస్తాన్‌తో క్రికెట్ ఆడేది లేదని బీసీసీఐ కారద్యర్శి అనురాగ్ ఠాకూర్ హెచ్చరించారు. భారతీయుల భద్రత విషయంలో రాజీపడేది లేదని ఆయన పీసీబీకి స్పష్టం చేశారు. ‘భారత్‌లో శాంతి భద్రతలకు విఘాతం కలిగితే పాకిస్తాన్‌తో క్రికెట్ ఆడేది లేదనే విషయాన్ని పీసీబీ ముందుగా తెలుసుకోవాలి. క్రీడలకు రాజకీయాలకు సంబంధం లేదనే విషయం తెలుసు. కానీ మా అంతర్గత భద్రత అన్నింటికన్నా ముఖ్యం. రెండు బోర్డుల మధ్యే కాకుండా ఇరు దేశాల మధ్య కూడా పరిష్కరించుకోవాల్సిన సమస్యలు కొన్ని ఉన్నాయి’ అని ఠాకూర్ తెలిపారు.
ఐసీసీ ఎఫ్‌టీపీ ప్రకారం ఇరు జట్లు తటస్థ వేదికపై రెండు టెస్టులు, ఐదు వన్డేలు ఆడాల్సి ఉంది. యూఏ ఈలో జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్న ఈ సిరీస్.. తాజాగా పంజాబ్‌లో పాక్ టైస్టులు దాడులకు తెగబడడంతో పరిస్థితి క్లిష్టంగా మారింది. భారత్, పాక్‌ల మధ్య చివరి టెస్టు 2007లో జరిగింది.