![Australia’s away performances will be judged in South Africa, Waugh - Sakshi](/styles/webp/s3/article_images/2018/03/1/steave%20match.jpg.webp?itok=TIPrBSHj)
ఆసీస్ క్రికెట్ జట్టు(ఫైల్‌ఫొటో)
మోంటేకార్లో (మొనాకో): స్వదేశంలో మంచి రికార్డు ఉన్న తమ జట్టు అసలు సత్తా ఏమిటో దక్షిణాఫ్రికా పర్యటనలో తేలనుందని ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ వా పేర్కొన్నాడు. ప్రస్తుత ఆసీస్ జట్టు విదేశాల్లో నిరూపించుకోవడానికి సఫారీ పర్యటన ఒక అవకాశమన్నాడు. మేమే ఎలా ఉన్నమనేది దక్షిణాఫ్రికాలో తేలిపోతుందన్నాడు. 2018 లారెస్ స్పోర్ట్స్ అవార్డుల ప్రదానోత్సవ అవార్డుల కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన స్టీవ్ వా మాట్లాడుతూ.. దక్షిణాఫ్రికా పర్యటన అనేది కచ్చితంగా ఆసీస్‌కు ఒక పరీక్షలాంటిదేనన్నాడు. స్వదేశంలో బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో సత్తాచాటే స్మిత్ సేనకు సఫారీలతో సిరీస్‌లో సవాల్ తప్పదన్నాడు. ఒకవేళ ఇక్కడ రాణిస్తే మాత్రం మిగతా విదేశీ పర్యటనల కూడా ఆసీస్‌కు సానుకూలంగా ఉంటాయని స్టీవ్ వా విశ్లేషించాడు.
ఇటీవల న్యూజిలాండ్-ఇంగ్లండ్‌లతో జరిగిన ముక్కోణపు టీ20 సిరీస్‌ల్లో ఒక్క అపజయం కూడా లేకుండా టైటిల్‌ను సాధించిన సంగతి తెలిసిందే. ఆ టైటిల్ సాధించిన తర్వాత ఆసీస్‌కు ఇదే తొలి పర్యటన.
Comments
Please login to add a commentAdd a comment