
కంగారూల 'లెక్క' కుదిరింది
ఆస్ట్రేలియా లెక్క కుదరింది.
సిడ్నీ: ఆస్ట్రేలియా లెక్క కుదరింది. ప్రపంచ కప్ సెమీస్ పోరులో ఇప్పటి దాకా ఓటమెరుగని కంగారూలు.. భారత్పైనా అదే ఫీట్ రిపీట్ చేశారు. ప్రపంచ కప్లో ఏడోసారి ఫైనల్ చేరారు.
ప్రపంచ కప్లో గతంలో ఆరుసార్లు సెమస్ చేరిన ఆసీస్ అన్నిసార్లూ నెగ్గి ఫైనల్ బెర్తు కొట్టేసింది. అయితే సెమీస్లో కంగారూలకు టీమిండియా ఎదురుపడటం ఇదే తొలిసారి. ఇక సిడ్నీ గ్రౌండ్లో కంగారూలకు తిరుగులేని రికార్డు ఉంది. ఈ వేదికపై ఆసీస్, భారత్ 14 వన్డేలాడగా.. కంగారూలు 13 మ్యాచ్ల్లో నెగ్గారు.