మెల్ బోర్న్: వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ తమ ముందు ఉంచిన 184 పరుగుల లక్ష్యాన్ని చేరుకునేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 21 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 100 పరుగులు చేసింది. స్మిత్(26), క్లార్క్(23) క్రీజ్ లో ఉన్నారు. వార్నర్(45) రెండో వికెట్ గా అవుటయ్యాడు. మరో ఓపెనర్ అరోన్ ఫించ్ డకౌట్ అవుటయ్యాడు.