భారత్ హాకీ జట్టుకు మరో ఓటమి | Australia thrash India 4-0 in Hockey World Cup | Sakshi
Sakshi News home page

భారత్ హాకీ జట్టుకు మరో ఓటమి

Published Mon, Jun 9 2014 7:22 PM | Last Updated on Sat, Sep 2 2017 8:33 AM

Australia thrash India 4-0 in Hockey World Cup

హేగ్: పురుషుల హాకీ ప్రపంచ కప్ చివరి గ్రూప్ మ్యాచ్లో భారత్ ఓటమి చవిచూసింది. సోమవారమిక్కడ జరిగిన మ్యాచ్లో భారత్ 0-4తో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా చేతిలో చిత్తుగా ఓడిపోయింది. లీగ్ దశలో ఓ విజయం, మరో డ్రాతో నాలుగు పాయింట్లు మాత్రమే సాధించిన భారత్ నాకౌట్ రేసు నుంచి వైదొలిగింది. భారత్కు దక్కేది నాలుగో స్థానమా లేకా ఐదా అన్నది స్పెయిన్-మలేసియా మ్యాచ్ ఫలితంపై ఆధారపడి ఉంటుంది.

చివరి మ్యాచ్లో ఆద్యంతం ఆస్ట్రేలియా తిరుగులేని ఆధిక్యం ప్రదర్శించింది. కాగా భారత ఆటగాళ్లు బోణీ కూడా కొట్టలేకపోయారు. గ్రూప్-ఎలో వరుసగా ఐదు విజయాలు సాధించిన ఆస్ట్రేలియా 15 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement