
ముంబై: రెండు నెలల సుదీర్ఘ పర్యటన కోసం భారత క్రికెట్ జట్టు శుక్రవారం ఆస్ట్రేలియా బయల్దేరి వెళ్లింది. ఈ పర్యటనలో భాగంగా భారత్ 4 టెస్టులు, 3 వన్డేలు, 3 టి20 మ్యాచ్‌లు ఆడుతుంది. ముందుగా ఈ నెల 21 నుంచి టి20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కెప్టెన్ కోహ్లి, రోహిత్ శర్మ తదితర రెగ్యులర్ సభ్యులతో పాటు పొట్టి ఫార్మాట్‌లో మాత్రమే చోటు దక్కించుకున్న ఆటగాళ్లు ముందుగా ఆసీస్ వెళుతున్నారు.
తొలిసారి ఆస్ట్రేలియాలో ఆడబోతున్న యువ క్రికెటర్లు బుమ్రా, కుల్దీప్ యాదవ్, కృనాల్ పాండ్యా తమ ప్రయాణం గురించి ఉత్సాహం ప్రదర్శిస్తూ సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టారు. వచ్చే బుధవారం బ్రిస్బేన్‌లో జరిగే తొలి టి20 మ్యాచ్‌లో ఆసీస్‌తో భారత్ తలపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment