పెర్త్ : ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ మూడో టెస్టులో ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియా ఘనవిజయం సాధించింది. దీంతో ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే ఆసీస్ 3-0 తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ప్రతిసారి అత్యంత ఉత్కంఠగా సాగే యాషెస్ ఈ సారి మాత్రం ఏకపక్షంగా సాగింది. సిరీస్‌ను కాపాడుకోవాల్సిన మూడో టెస్టులో ఇంగ్లండ్ దారుణంగా ఓటమిపాలైంది. 132/4 ఓవర్‌నైట్ స్కోర్‌తో చివరి రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్.. మిచెల్ స్టార్క్, హజల్‌వుడ్‌ల దెబ్బకు విలవిలలాడింది.
తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో రాణించిన మలాన్(54), ఆలౌరౌండర్ క్రిస్ వోక్స్(22)లు మినహా మిగతా బ్యాట్స్‌మన్ చేతులెత్తేయడంతో 218 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఇన్నింగ్స్ 41 పరుగుల తేడాతో ఆసీస్ ఘన విజయం సాధించింది. మొత్తం ఐదు టెస్టుల సిరీస్‌లో ఆసీస్ వరుసగా మూడు గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకుంది. డబుల్ సెంచరీతో రాణించిన ఆసీస్ కెప్టెన్ స్మిత్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వరించింది.
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 403 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 218 ఆలౌట్
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 662/9 డిక్లేర్
Comments
Please login to add a commentAdd a comment