బెయిర్ స్టో భారీ శతకం | Bairstow piles on runs against Sri Lanka | Sakshi
Sakshi News home page

బెయిర్ స్టో భారీ శతకం

Published Fri, Jun 10 2016 8:25 PM | Last Updated on Fri, Nov 9 2018 6:43 PM

Bairstow piles on runs against Sri Lanka

లండన్: మూడు టెస్టుల సిరీస్లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న చివరి టెస్టులో ఇంగ్లండ్ తన తొలి ఇన్నింగ్స్లో 416 పరుగుల వద్ద ఆలౌటయ్యింది. ఇంగ్లండ్ ఆటగాడు బెయిర్ స్టో(167 నాటౌట్;251 బంతుల్లో 18 ఫోర్లు) భారీ శతకంతో రాణించి ఇంగ్లండ్ గౌరవప్రదమైన స్కోరు చేయడంలో సహకరించాడు.  279/6 ఓవర్ నైట్ స్కోరుతో  శుక్రవారం రెండో రోజు ఆటను ఆరంభించిన ఇంగ్లండ్ మరో 137 పరుగులు చేసింది.

 

అయితే తొలి రోజు అజేయ శతకం ఆకట్టుకున్న బెయిర్ స్టో మాత్రం రెండో రోజూ కూడా అదే ఆట తీరును కనబరిచాడు. ఇంగ్లండ్ ఆటగాళ్లలో వోక్స్(66), అలెస్టర్ కుక్(85)లు రాణించారు. శ్రీలంక బౌలర్లలో హెరాత్ నాలుగు వికెట్లు సాధించగా,లక్మల్కు మూడు, ప్రదీప్కు రెండు వికెట్లు లభించాయి. ఇప్పటికే వరుస రెండు టెస్టుల్లో విజయం సాధించిన ఇంగ్లండ్ సిరీస్ను గెలుచుకున్న సంగతి తెలిసిందే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement