కొలంబో: గాలే అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక జట్టు ఓటమివైపుగా అడుగులేస్తోంది. నాలుగోరోజు ఆట ముగిసే సమయానికి పర్యాటక జట్టు తన రెండో ఇన్సింగ్స్‌లో మూడు వికెట్లు కోల్పోయి 38 పరుగులు చేసింది. మరో 36 పరుగులు చేస్తే ఇంగ్లండ్ విజయం సాధిస్తుంది. అయితే, పిచ్ స్పిన్‌కు అనుకూలిస్తుండటం ఆతిథ్య జట్టుకు కలిసి వస్తుందో లేదో సోమవారం తేలుతుంది. తాజా టెస్టులో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 421 పరుగులు చేయగా.. శ్రీలంక 135 పరుగులకే ఆలౌట్ అయింది. దాంతో ఫాలో ఆన్ తప్పలేదు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో 359 పరుగులు చేసిన శ్రీలంక ఇంగ్లండ్ ముందు 74 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది.
(చదవండి: రూట్ డబుల్ సెంచరీ)
హై ఫైవ్‌తో ముఖం పగిలింది
రెండో ఇన్సింగ్స్‌లో ఇంగ్లండ్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగలింది. 12 పరుగులకే ఓపనర్ల వికెట్లు కోల్పోయింది. జాక్ క్రాలీ (8), డామినిక్ సిబ్లీ (2) వెంటవెంటనే ఔటయ్యారు. ఆ వెంటనే తొలి ఇన్నింగ్స్ డబుల్ సంచరీ హీరో జో రూట్‌ను రనౌట్ చేయడం ద్వారా శ్రీలకం శిబిరంలో ఉత్సాహం నిండింది. దిల్‌రువాన్ బౌలింగ్‌లో బెయిర్ స్టో బంతిని బాదగా.. కష్ట సాధ్యమైన చోట రన్‌కు ప్రయత్నించారు. కీపర్ నీరోషమ్ డిక్‌వెల్లా వేగంగా కదిలి స్ట్రైకింగ్ ఎండ్ వైపునకు చక్కని త్రో విసరడంతో జో రూట్ రనౌట్ కాక తప్పలేదు. ఇక ఇదే సమయంలో శ్రీలంక ఆటగాళ్ల సంబరాల్లో ఒక ఫన్నీ ఇన్సిడెంట్ చోటుచేసుకుంది. తన సహచర ఆటగాడు వనిండు హసరంగాతో హై ఫైవ్ ఇచ్చే క్రమంలో డిక్‌వెల్లా చేయి అతని ముఖానికి తగలింది. ఈ ఫన్నీ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
(చదవండి: శార్దూల్, వషీ జబర్దస్త్; గతం గుర్తు చేసుకున్న సెహ్వాగ్)
Whooops 😂😂🤦🏽♀️🤦🏽♀️ pic.twitter.com/jdttQXmX7G
— Kate Cross (@katecross16) January 17, 2021
Comments
Please login to add a commentAdd a comment