
ఎరంగ బౌలింగ్ శైలిపై ఫిర్యాదు
చెస్టర్ లీ స్ట్రీట్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో ఇప్పటికే రెండు మ్యాచ్‌లను కోల్పోయిన శ్రీలంకకు మరో ఎదురుదెబ్బ తగిలింది. రెండో టెస్టులో పేసర్ షమింద ఎరంగ బౌలింగ్ శైలి నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్టు ఫిర్యాదు అందింది. ఇప్పటికే ఈ విషయాన్ని లంక టీమ్ మేనేజ్‌మెంట్‌కు తెలిపామని ఐసీసీ పేర్కొంది. నిబంధనల ప్రకారం 14 రోజుల్లోగా తన బౌలింగ్ శైలిని పరీక్షించుకోవాల్సి ఉంటుంది. అయితే ఫలితం వచ్చేవరకు ఎరంగ మ్యాచ్‌ల్లో పాల్గొనే అవకాశం ఉంది. దీంతో ఈనెల 9న జరిగే చివరిదైన మూడో టెస్టు ఆడబోతున్నా... పరీక్షలో విఫలమైతే వన్డే సిరీస్‌కు దూరం కావాల్సి ఉంటుంది.