ఇంగ్లండ్‌ 290/8 | Bairstow takes England to 290/8 on Day 1 | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్‌ 290/8

Published Sat, Mar 31 2018 4:46 AM | Last Updated on Wed, Oct 17 2018 4:43 PM

Bairstow takes England to 290/8 on Day 1 - Sakshi

బెయిర్‌స్టో, సౌథీ

క్రైస్ట్‌చర్చ్‌: ఇంగ్లండ్, న్యూజిలాండ్‌ల మధ్య జరుగుతోన్న చివరిదైన రెండో టెస్టు తొలి రోజు ఇరు జట్లు సమ ఉజ్జీలుగా నిలిచాయి. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ శుక్రవారం ఆట ముగిసే సమయానికి 8 వికెట్ల నష్టానికి 290 పరుగులు చేసింది. కివీస్‌ బౌలర్లు సౌథీ (5/60), బౌల్ట్‌ (3/79) చెలరేగడంతో ఓ దశలో ఇంగ్లండ్‌ 164 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

ఆ సమయంలో బెయిర్‌స్టో (97 బ్యాటింగ్‌; 11 ఫోర్లు, 1 సిక్స్‌) ఆదుకోవడంతో మెరుగైన స్కోరు చేయగలిగింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు శుభారంభం లభించలేదు. సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ కుక్‌ (2) మరోసారి నిరాశ పరిచాడు. విన్స్‌ (18), స్టోన్‌మన్‌ (35), రూట్‌ (37), స్టోక్స్‌ (25) ఓ మోస్తరుగా ఆడారు. వుడ్‌ (52; 7 ఫోర్లు, 1 సిక్స్‌)తో కలిసి బెయిర్‌స్టో ఎనిమిదో వికెట్‌కు 95 పరుగులు జతచేసి జట్టును ఆదుకున్నాడు. అతనితో పాటు జాక్‌ లీచ్‌ (10 బ్యాటింగ్‌) ప్రస్తుతం క్రీజులో ఉన్నాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement