క్రైస్ట్‌చర్చ్: న్యూజిలాండ్‌తో జరుగుతోన్న చివరిదైన రెండో టెస్టులో ఇంగ్లండ్ భారీ స్కోరు దిశగా సాగుతోంది. ఆదివారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది.
అలిస్టర్ కుక్ (14) మరోసారి విఫలం కాగా... విన్స్ (76; 10 ఫోర్లు), స్టోన్‌మన్ (60; 6 ఫోర్లు) రాణించారు. వీరిద్దరు రెండో వికెట్‌కు 123 పరుగులు జతచేశారు. కివీస్ బౌలర్లలో బౌల్ట్‌కు 2 వికెట్లు దక్కాయి. చేతిలో ఏడు వికెట్లు ఉన్న ఇంగ్లిష్ జట్టు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో కలుపుకొని ప్రస్తుతం 231 పరుగుల ఆధిక్యంలో ఉంది. కెప్టెన్ జో రూట్ (30 బ్యాటింగ్; 2 ఫోర్లు), మలాన్ (19 బ్యాటింగ్; 2 ఫోర్లు) క్రీజులో ఉన్నారు.
అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 192/6తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన న్యూజిలాండ్ మరో 86 పరుగులు జతచేసి 278 పరుగుల వద్ద ఆలౌటైంది. వాట్లింగ్ (85; 11 ఫోర్లు, 1 సిక్స్) త్వరగానే అవుటైనా చివర్లో సౌతీ (50; 8 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడటంతో ఇంగ్లండ్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 29 పరుగుల ఆధిక్యం లభించింది. ప్రత్యర్థి బౌలర్లలో బ్రాడ్ 6, అండర్సన్ 4 వికెట్లు పడగొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment