
సాక్షి, హైదరాబాద్: ఫైనల్ చేరాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో బెంగళూరు బ్లాస్టర్స్ మిక్స్‌డ్ డబుల్స్ జంట సిక్కి రెడ్డి–కిమ్ సా రంగ్ అద్భుత ఆటతీరును కనబరిచింది. హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో సిక్కి రెడ్డి–కిమ్ సా రంగ్ ద్వయం 15–12, 13–15, 15–9తో కామిల్లా రైటర్ జుల్–లా చెయుక్ హిమ్ జోడీని ఓడించింది. దాంతో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ యజమానిగా ఉన్న బెంగళూరు బ్లాస్టర్స్ జట్టు ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)లో ఫైనల్లోకి దూసుకెళ్లింది.
శనివారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన రెండో సెమీఫైనల్లో బెంగళూరు బ్లాస్టర్స్ 4–3తో అహ్మదాబాద్ స్మాష్ మాస్టర్స్‌ను ఓడించింది. ఆదివారం జరిగే ఫైనల్లో హైదరాబాద్ హంటర్స్‌తో బెంగళూరు బ్లాస్టర్స్ అమీతుమీ తేల్చుకుంటుంది. అంతకుముందు అహ్మదాబాద్ తరఫున పురుషుల తొలి సింగిల్స్‌లో సౌరభ్ వర్మ... మహిళల ఏకైక సింగిల్స్‌లో తై జు యింగ్ గెలిచారు. బెంగళూరు తరఫున పురుషుల డబుల్స్‌లో మథియాస్ బో–కిమ్ సా రంగ్ జంట... పురుషుల రెండో సింగిల్స్‌లో అక్సెల్‌సన్ నెగ్గారు.
Comments
Please login to add a commentAdd a comment