బంగ్లాదేశ్ 254 ఆలౌట్ | Bangladesh 254 allout | Sakshi
Sakshi News home page

బంగ్లాదేశ్ 254 ఆలౌట్

Published Mon, Oct 27 2014 1:22 AM | Last Updated on Sat, Sep 2 2017 3:25 PM

బంగ్లాదేశ్ 254 ఆలౌట్

బంగ్లాదేశ్ 254 ఆలౌట్

మిర్పూర్: నాణ్యమైన బౌలింగ్‌తో ఆకట్టుకున్న జింబాబ్వే... తొలి టెస్టులో బంగ్లాదేశ్‌ను కట్టడి చేసింది. వరుస విరామాల్లో వికెట్లు తీయడంతో పాటు మైదానంలో చురుకైన ఫీల్డింగ్‌తో ఆకట్టుకుంది. దీంతో షేర్-ఎ-బంగ్లా జాతీయ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో... రెండో రోజు ఆదివారం పన్యన్‌గరా (5/59) ధాటికి బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 98 ఓవర్లలో 254 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా ఆతిథ్య జట్టుకు తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 14 పరుగుల ఆధిక్యం మాత్రమే దక్కింది.

ముష్ఫీకర్ రహీమ్ (126 బంతుల్లో 64; 9 ఫోర్లు, 1 సిక్స్), మహ్మదుల్లా (160 బంతుల్లో 63; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), మోమినల్ హక్ (112 బంతుల్లో 53; 5 ఫోర్లు) అర్ధసెంచరీలతో రాణించారు. తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన జింబాబ్వే ఆట ముగిసే సమయానికి 2 ఓవర్లలో వికెట్లేమీ నష్టపోకుండా 5 పరుగులు చేసింది. ప్రస్తుతం జింబాబ్వే 9 పరుగులు వెనుకబడి ఉంది. అంతకుముందు 27/1 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆట కొనసాగించిన బంగ్లా ఇన్నింగ్స్ నిలకడగా సాగింది.

శంసూర్ రెహమాన్ (8) విఫలమైనా... మహ్మదుల్లా కీలక భాగస్వామ్యాలతో ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. మోమినల్‌తో కలిసి మూడో వికెట్‌కు 63; ముష్ఫీకర్‌తో కలిసి ఐదో వికెట్‌కు 64 పరుగులు జోడించాడు. అయితే మహ్మదుల్లా అవుటైన తర్వాత... ముష్ఫీకర్‌కు సహకారం అందించేవారు కరువయ్యారు. దీంతో బంగ్లాదేశ్ 45 పరుగుల తేడాతో చివరి 5 వికెట్లను చేజార్చుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement