
సోషల్ మీడియాలో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చాలా ఆక్టీవ్‌గా ఉంటుందన్న విషయం తెలిసిందే. చరిత్రలో ఈ రోజు, ఆటగాళ్లకు సంబందించిన రికార్డులు, అవార్డులు, క్రికెట్‌లో అబ్బురపరిచిన సంఘటనలను ఐసీసీ ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది. తాజాగా బంగ్లాదేశ్‌కు చెందిన రెండేళ్ల అలీ ఆటకు ఐసీసీ ఫిదా అయింది. ఆఫ్ సైడ్ టెక్నిక్స్ అమోఘం అంటూ రెండేళ్ల బుడతడు క్రికెట్ ఆడిన వీడియోను తన అధికారిక ట్విటర్‌లో షేర్ చేసింది.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆఫ్‌సైడ్ షాట్లలో అలీని మించిన ఆటగాడిని ఇప్పటివరకు చూడలేదు అంటూ క్రికెట్ అభిమానులు ట్రోల్ చేస్తున్నారు. త్వరలోనే క్రికెటలో అలీ సంచలనాలు నమోదవుతాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ‘అలీ వయసు రెండేళ్లు, కానీ అతడి ఆఫ్‌సైడ్ టెక్నిక్స్ అద్భుతం.. ఐసీసీ ఫ్యాన్ ఆఫ్ ద వీక్ అలీనే. చాలా అద్భుతంగా ఆడావు అలీ, ఏదో ఒక రోజు బంగ్లాదేశ్ తరుపున ఆడతావు’ అంటూ ఐసీసీ ట్వీట్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment