
కివీస్ కు ఎదురుదెబ్బ.. మెక్ కల్లమ్ డకౌట్
మెల్ బోర్న్: వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఆదివారమిక్కడ ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ కు ప్రారంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఒక్క పరుగుకే తొలి వికెట్ కోల్పోయింది. డాషింగ్ ఓపెనర్ బ్రెండన్ మెక్ కల్లమ్ డకౌట్ అయ్యాడు. స్టార్క్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
ఆసీస్ ఆటగాళ్లు సంబరాలు చేసుకోగా, మెక్ కల్లమ్ నిరాశగా మైదానాన్ని వీడాడు. కివీస్ అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. న్యూజిలాండ్ 2 ఓవర్లలో 6/1 స్కోరుతో ఆట కొనసాగిస్తోంది.