న్యూఢిల్లీ: అండర్-19 వరల్డ్ కప్ గెలిచిన యువ భారత జట్టుకు బీసీసీఐ నజరానా ప్రకటించింది. యువ భారత జట్టుకు కోచ్‌గా సేవలందిస్తున్న రాహుల్ ద్రవిడ్‌కు రూ. 50లక్షలను బహుమతిగా ప్రకటించిన బీసీసీఐ.. వరల్డ్ కప్ ఆడిన క్రికెటర్లకు తలో రూ. 30 లక్షల చొప్పన ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది. మరొకవైపు ఈ మెగా టోర్నీలో భారత జట్టుకు సేవలందించిన సపోర్టింగ్ స్టాఫ్‌కు సైతం రూ. 20లక్షల నజరానాను ప్రకటించింది. ఈ మేరకు వరల్డ్ కప్ గెలిచిన తర్వాత బీసీసీఐ తన ట్వీటర్ అకౌంట్‌లో నజరానా విషయాని వెల్లడించింది.
అండర్ 19 వరల్డ్ కప్‌లో భాగంగా శనివారం ఆసీస్‌తో జరిగిన అంతిమ సమరంలో భారత జట్టు ఇరగదీసింది. ఆసీస్‌కు ఏ దశలోనూ అవకాశం ఇవ్వకుండా ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచి వరల్డ్ కప్‌ను కైవసం చేసుకుంది. ఫలితంగా నాల్గోసారి వరల్డ్ కప్‌ను ఖాతాలో వేసుకుని అత్యధిక ట్రోఫీలు గెలిచిన జట్టుగా భారత జట్టు కొత్త చరిత్ర సృష్టించింది. ఆసీస్ విసిరిన 217 పరుగుల లక్ష్యాన్ని 38.5 ఓవర్లలో ఛేదించి సగర్వంగా కప్‌ను సొంతం చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment