
బోపన్న జంట సంచలనం
బ్రయాన్ బ్రదర్స్‌పై విజయం
లండన్: ఈ సీజన్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్న రోహన్ బోపన్న (భారత్)-ఫ్లోరిన్ మెర్జియా (రుమేనియా) ద్వయం వింబుల్డన్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో పెను సంచలనం సృష్టించింది.
మంగళవారం అర్ధరాత్రి దాటాక జరిగిన క్వార్టర్ ఫైనల్లో బోపన్న-మెర్జియా జంట టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ జోడీ మైక్ బ్రయాన్-బాబ్ బ్రయాన్ (అమెరికా) జోడీని బోల్తా కొట్టించి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. 2 గంటల 34 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న-మెర్జియా 5-7, 6-4, 7-6 (11/9), 7-6 (7/5)తో బ్రయాన్ బ్రదర్స్‌ను ఓడించి సెమీస్‌లో జీన్ జూలియన్ రోజర్ (నెదర్లాండ్స్)-హొరియా టెకావ్ (రుమేనియా)లతో అమీతుమీకి సిద్ధమయ్యారు.