
మాంచెస్టర్: వెస్టిండీస్ ఆల్‌రౌండర్ కార్లోస్ బ్రాత్‌వైట్‌కు జరిమానా పడింది. వరల్డ్‌కప్‌లో భాగంగా భారత్‌తో మ్యాచ్‌లో అంపైర్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేయడంతో మ్యాచ్ ఫీజులో 15శాతం కోత విధించారు. ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.8 నిబంధనను అతిక్రమించడంతో బ్రాత్‌వైట్‌కు పరిమానా విధిస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా అతని ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్ కూడా పడింది. ప్రస్తుతం అతని ఖాతాలో రెండు డీమెరీట్ పాయింట్లు ఉన్నాయి.
భారత ఇన్నింగ్స్ 42వ ఓవర్‌లో తాను వేసిన ఓ బంతిని అంపైర్ వైడ్ ఇవ్వడంతో బ్రాత్‌వైట్ అంపైర్‌తో వాగ్వాదం చేశాడు. దీన్ని ఫీల్డ్ అంపైర్లతో పాటు థర్డ్ అంపైర్ మ్యాచ్ రిఫరీ క్రిస్‌బ్రాడ్‌కు రిపోర్ట్ చేశారు. తన తప్పును రిఫరీ ఎదుట బ్రాత్‌వైట్ అంగీకరించడంతో అతనిపై తదుపరి విచారణ లేకుండా జరిమానా విధించారు.
Comments
Please login to add a commentAdd a comment