షమీ సెల్యూట్‌.. కాట్రెల్‌ రియాక్షన్‌! | Sheldon Cottrell responds to Shami imitating his salute celebration | Sakshi
Sakshi News home page

షమీ సెల్యూట్‌.. కాట్రెల్‌ రియాక్షన్‌!

Published Fri, Jun 28 2019 6:13 PM | Last Updated on Fri, Jun 28 2019 7:31 PM

Sheldon Cottrell responds to Shami imitating his salute celebration - Sakshi

మాంచెస్టర్‌: ప్రపంచకప్‌లో కరేబియన్‌ ఫాస్ట్‌ బౌలర్‌ షెల్డన్‌ కాట్రెల్‌ వికెట్‌ సెలబ్రేషన్స్‌ హైలెట్‌గా నిలుస్తున్నాయి. వికెట్‌ తీసిన వెంటనే సెల్యూట్‌ చేసి సంబరాలు చేసుకోవడం కాట్రెల్‌కు అలవాటుగా మారిపోయింది. వృత్తిరీత్యా సోల్జర్‌ అయిన కాట్రెల్‌.. జమైకా డిఫెన్స్‌ ఫోర్స్‌కు గౌరవ సూచకంగా వికెట్‌ తీసిన వెంటనే మార్చ్‌ఫాస్ట్‌ చేసి సెల్యూట్‌ చేస్తున్నాడు.

అయితే గురువారం విండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో కాట్రెల్‌ తొమ్మిదో వికెట్‌గా ఔటైన సందర్భంలో అతన్ని అనుకరించాడు భారత పేసర్‌ మహ్మద్‌ షమీ. విండీస్‌ లక్ష్య ఛేదనలో భాగంగా చహల్‌ వేసిన 30 ఓవర్‌ ఐదో బంతికి కాట్రెల్‌ ఎల్బీడబ్యూ అయ్యాడు. ఆ సమయంలో కాట్రెల్‌ తరహాలోనే మార్చ్‌ఫాస్ట్‌ చేసిన షమీ సెల్యూట్‌ చేశాడు. దీనికి చహల్‌తో​ సహా కోహ్లి కూడా పగలబడి నవ్వాడు.  దీనిపై ట్విటర్‌ వేదికగా కాట్రెల్‌ స్పందించాడు.  ఇలా షమీ చేసిన సెల్యూట్‌ను తేలిగ్గా తీసుకున్న కాట్రెల్‌.. ‘గ్రేట్‌ ఫన్‌.. గ్రేట్‌ బౌలింగ్‌’ అంటూ రిప్లై ఇచ్చాడు.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement