
ప్రభుత్వ ఆధీనంలోకి రియో ఒలింపిక్ పార్క్
రియో డి జనీరో: ఈ ఏడాది ఒలింపిక్స్‌ను అంగరంగ వైభవంగా నిర్వహించిన రియో నగరంలోని ఒలింపిక్ పార్క్ ఇప్పుడు బ్రెజిల్ ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్లింది. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి నిర్మించిన ఈ పార్క్ ఆలనాపాలనా చూసేందుకు సమర్థవంతమైన ప్రైవేటు సంస్థ ముందుకు రాకపోవడంతో రియో మేయర్ ఎడ్యుర్యో పేస్ ప్రభుత్వానికి అప్పగించారు. ఇప్పుడు దీని నిర్వహణ బాధ్యతలు బ్రెజిల్ ఫెడరల్ క్రీడాశాఖ చూడనుంది. ప్రతిష్టాత్మక క్రీడలు ముగిశాక నిర్వహణ బాధ్యతలు అప్పగించేందుకు బిడ్డింగ్ నిర్వహించగా పేరున్న ఏ సంస్థ కూడా ఈ కాంట్రాక్టు చేజిక్కించుకునేందుకు రాలేదు.