ఆసియా కప్ క్వాలిఫయర్స్‌కు భారత్ | Buoyant India favourites to see off Laos at home | Sakshi
Sakshi News home page

ఆసియా కప్ క్వాలిఫయర్స్‌కు భారత్

Jun 7 2016 11:21 PM | Updated on Sep 4 2017 1:55 AM

ఆసియా కప్ క్వాలిఫయర్స్‌కు భారత్

ఆసియా కప్ క్వాలిఫయర్స్‌కు భారత్

ఆసియా ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఎఫ్‌సీ) ఆధ్వర్యంలో 2019లో జరిగే ఆసియా కప్ చాంపియన్‌షిప్ క్వాలిఫయింగ్ పోటీలకు భారత జట్టు అర్హత సాధించింది.

లావోస్‌పై 6-1తో ఘనవిజయం
గువహటి: ఆసియా ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఎఫ్‌సీ) ఆధ్వర్యంలో 2019లో జరిగే ఆసియా కప్ చాంపియన్‌షిప్ క్వాలిఫయింగ్ పోటీలకు భారత జట్టు అర్హత సాధించింది. లావోస్ జట్టుతో మంగళవారం జరిగిన రెండో లెగ్ ప్లే ఆఫ్ మ్యాచ్‌లో భారత్ 6-1 గోల్స్ తేడాతో ఘనవిజయాన్ని నమోదు చేసుకుంది. భారత్ తరఫున జెజె లాల్‌పెకులువా (42వ, 74వ ని.లో) రెండు గోల్స్ చేయగా... సుమీత్ పస్సీ (45వ ని.లో), సందేశ్ జింగాన్ (49వ ని.లో), మొహమ్మద్ రఫీక్ (83వ ని.లో), ఫుల్గాంకో కార్డోజో (87వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు.

అంతకుముందు ఆట 16వ నిమిషంలో సిహవోంగ్ లావోస్ జట్టుకు గోల్ అందించాడు. ఇంటా, బయటా పద్ధతిలో ఈ రెండు జట్ల మధ్య జరిగిన రెండు మ్యాచ్‌ల్లో భారత్ ఓవరాల్‌గా 7-1తో లావోస్‌ను ఓడించి ఆసియా కప్ క్వాలిఫయింగ్ పోటీలకు అర్హత పొందింది. జూన్ 2న లావోస్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 1-0తో నెగ్గింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement