మాస్కో: విపత్కర పరిస్థితుల్లోనూ చెస్ మాత్రం ఆగకుండా దూసుకెళుతోంది. 8 మంది ప్రపంచ అగ్రశ్రేణి ఆటగాళ్లు మాత్రమే ఆడే ‘ది 2020 క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్’ రష్యాలో జరుగుతోంది. ఇది ప్రపంచ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్‌సన్ (నార్వే)తో తలపడేందుకు క్వాలిఫయింగ్ టోర్నీ. ప్రేక్షకులను దగ్గరనుంచి చూసేందుకు అనుమతించకుండా దీనిని నిర్వహిస్తున్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా వీక్షణకు మాత్రం ఢోకా రాలేదు. దీన్ని డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో ప్రత్యక్షప్రసారం చేస్తున్నారు. కొన్ని రోజుల తరబడి కరోనా న్యూస్, న్యూసెన్స్‌తో విసుగెత్తిపోయేవారు క్యాండిడేట్స్ చెస్ చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. చిత్రంగా కరోనాకు పుట్టిల్లయిన చైనా ఆ వైరస్‌కు విలవిలలాడుతుండగా... అత్యధికంగా క్యాండిడేట్స్ చెస్ చూసేవాళ్లు కూడా చైనా వాళ్లే కావడం విశేషం. ఏకంగా 10 లక్షల మంది చైనీయులు యూ ట్యూబ్‌లో గత మూడు రోజులుగా చెస్ పోటీలను తిలకిస్తున్నట్లు ‘ఫిడే’ ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment