అనురాగ్ ఠాకూర్కు గంగూలీ మద్దతు | Can't play Pakistan till they stop cross-border terrorism, says Sourav Ganguly | Sakshi
Sakshi News home page

అనురాగ్ ఠాకూర్కు గంగూలీ మద్దతు

Published Sat, Sep 24 2016 1:50 PM | Last Updated on Mon, Sep 4 2017 2:48 PM

అనురాగ్ ఠాకూర్కు గంగూలీ మద్దతు

అనురాగ్ ఠాకూర్కు గంగూలీ మద్దతు

కోల్కతా: ఉగ్రవాదానికి ఊతమిస్తూ భారత్పై దాడులకు పాల్పడుతున్న పాకిస్తాన్తో క్రికెట్  ఆడబోమంటూ బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలకు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మద్దతుగా నిలిచాడు. మన సరిహద్దుల్లో దాడులను పాక్ ఆపే వరకూ వారితో క్రికెట్ అనే మాటే ఉండకూడదని గంగూలీ స్పష్టం చేశాడు. ఈ విషయంలో అనురాగ్ ఠాకూర్ అభిప్రాయం సమర్ధనీయమేనని గంగూలీ పేర్కొన్నాడు.ప్రస్తుత పరిస్థితుల్లో ఇరు దేశాల క్రికెట్ ద్వైపాక్షిక సిరీస్లను చూడాలనుకోవడం సరైనది కాదన్నాడు

 

'మేమంతా పాక్ తో క్రికెట్ సిరీస్ ఆడాలని ఎప్పుడూ కోరుకుంటూనే ఉంటాం.కానీ మాతో పాక్ క్రికెట్ ఆడాలనుకుంటే మాత్రం సరిహద్దుల్లో కాల్పులను వారు ఆపాలి. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదానికి విరామం పడిన తరువాతే వారితో క్రికెట్ గురించి ఆలోచించాలి' అని గంగూలీ పేర్కొన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement