చాంపియన్ రుత్విక శివాని | Champion rutvika shivani | Sakshi
Sakshi News home page

చాంపియన్ రుత్విక శివాని

Sep 7 2015 12:50 AM | Updated on Sep 3 2017 8:52 AM

చాంపియన్ రుత్విక శివాని

చాంపియన్ రుత్విక శివాని

సుశాంత్ చిపల్‌కట్టి స్మారక అంతర్జాతీయ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ క్రీడాకారిణి గద్దె

♦ కృష్ణప్రసాద్-సాత్విక్ జోడీకి డబుల్స్ టైటిల్     
♦ అంతర్జాతీయ జూ. బ్యాడ్మింటన్ టోర్నీ
 
 సాక్షి, హైదరాబాద్ : సుశాంత్ చిపల్‌కట్టి స్మారక అంతర్జాతీయ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ క్రీడాకారిణి గద్దె రుత్విక శివాని విజేతగా నిలిచింది. మహిళల సింగిల్స్‌లో వరుసగా నాలుగో ఏడాది రుత్విక టైటిల్ గెలవడం విశేషం. మహారాష్ట్రలోని పుణేలో ఆదివారం ఈ టోర్నీ ముగిసింది. ఫైనల్లో టాప్ సీడ్ రుత్విక 21-9, 21-6తో రెండో సీడ్ సుపమర్త్ మింగ్‌చువా (థాయిలాండ్)ను చిత్తుగా ఓడించింది. 26 నిమిషాల్లోనే ఈ మ్యాచ్ ముగియడం విశేషం.

పురుషుల డబుల్స్‌లో కూడా తెలుగు కుర్రాళ్లు కృష్ణప్రసాద్-సాత్విక్ సాయిరాజ్ ద్వయం సత్తా చాటి టైటిల్ చేజిక్కించుకున్నారు. మూడో సీడ్ ప్రసాద్-సాత్విక్ జోడి ఫైనల్లో 21-15, 21-17 స్కోరుతో వారిత్ సరపత్-పనచై వోరసక్‌త్యాన్‌పై నెగ్గింది. పురుషుల సింగిల్స్‌లో భారత్‌కే చెందిన లక్ష్యసేన్ విజేతగా నిలవగా... మహిళల డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్స్‌ను ఇం డోనేసియా జోడీలు కైవసం చేసుకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement