సాక్షి, హైదరాబాద్ : ఐపీఎల్ షెడ్యూల్ వచ్చింది.. సోషల్ మీడియాలో అభిమానుల, ఫ్రాంచైజీల సందడి మొదలైంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తొలి రెండు వారాల వ్యవధికి బీసీసీఐ నిన్న షెడ్యూల్ ప్రకటించిన విషయం తెలిసిందే. మ్యాచ్ 23న ఢిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మ్యాచ్‌తో ఈ క్యాష్ రిచ్ లీగ్ 12వ సీజన్‌కు తెరలేవనుంది. ఆయా ఫ్రాంచైజీలు అప్పుడే అభిమానులను ఆకర్షించే పనిలోపడ్డాయి. ఇంకా నెల రోజుల సమయం ఉన్న తమ అధికారిక ట్విటర్‌లో ప్రచారాన్ని మొదలుపెట్టాయి.
ఇందులో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేసిన ఓ ట్వీట్‌కు.. చెన్నై సూపర్ కింగ్స్ ఫర్‌ఫెక్ట్ బదులిచ్చింది. ‘దక్షిణ భారత్‌లో స్పైసీ వంటకాలు ఫేమస్.. కానీ మేం స్వీట్ సాంబార్‌ను ఫ్రిఫెర్ చేస్తున్నాం. మన ఐపీఎల్ 2019 సీజన్ బెంగళూరుకు దూరంగా ప్రారంభం అవుతోంది’ అని చెన్నైని పరోక్షంగా ప్రస్తావిస్తూ ట్వీట్ చేసింది. దీనికి ‘చెన్నై సూపర్ కింగ్స్.. కానీ సాంబార్ ఎప్పుడూ పచ్చ కలర్లోనే ఉంటుంది తెలుసా?’ అని సెటైర్లేసింది. ఈట్వీట్లపై అభిమానులు వారికి తోచిన కామెంట్లు చేస్తున్నారు. ‘అయ్యో బెంగళూరులో సాంబార్ ఎర్రగా ఉంటుందే’ అని ఒకరు.. ‘స్వీటెక్కడా .. కారమే ఉంగుది’ అని మరొకరు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రస్తుతం ఈ ట్వీట్లు నెట్టింట వైరల్ అయ్యాయి. (చదవండి : ఐపీఎల్–12 షెడ్యూల్ విడుదల)
But sambar is always #Yellove in colour no? 🤔💛🦁 https://t.co/f5Rw9ZtpH6
— Chennai Super Kings (@ChennaiIPL) 19 February 2019
No no no no no sambar is Always #Red in Bangalore @RCBTweets
— Madhu Suthanan (@dmadhu92) 19 February 2019
Comments
Please login to add a commentAdd a comment